నల్లారికి ఇక అదే దారి

మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మరో నాలుగేళ్లపాటు ఇంటిపట్టున ఉండాల్సిందే. ఆయన పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. విభజిత ఆంధ్రప్రదేశ్ లో కీలక భూమిక [more]

Update: 2020-02-01 12:30 GMT

మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మరో నాలుగేళ్లపాటు ఇంటిపట్టున ఉండాల్సిందే. ఆయన పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. విభజిత ఆంధ్రప్రదేశ్ లో కీలక భూమిక పోషిస్తారని భావించినా ఆయన మాత్రం ఇప్పటి వరకూ పత్తా లేకుండా పోయారు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా పనిచేశారు. చివరి బాల్ ఉందంటూ ఊరించి ఏపీ ప్రజలను మత్తులో ముంచారు. చివరకు రాష్ట్ర విభజన జరిగింది.

తమ్ముడు వెళ్లిన పార్టీ కూడా….

నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి 2014 ఎన్నికల్లో సొంత పార్టీ జై సమైక్యాంధ్ర పార్టీ పెట్టి ఘోరంగా విఫలమయ్యారు. వైఎస్ తరహాలో పరిపాలన చేస్తారనుకున్నా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఏ వర్గాన్ని సొంతం చేసుకోలేకపోయారు. ఫలితంగా ఆయన రాజకీయాలకు దూరం కావాల్సి వచ్చింది. 2019 ఎన్నికలకు ముందు తన సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిని టీడీపీలోకి పంపారు. తాను మాత్రం కొంతకాలం మౌనంగానే ఉన్నారు.

కాంగ్రెస్ లో చేరినా….

చివరకు ఎన్నికలకు ముందు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. పూర్తిగా చతికల పడిన కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ బలోపేతం చేస్తారని అందరూ భావించారు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి 2019 ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ తరుపున ప్రచారం చేయలేదు. హైదరాబాద్ కే పరిమితమయ్యారు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని పీసీసీ చీఫ్ చేస్తారన్న ప్రచారం కూడా జరిగింది. అయితే ఆయన దానిని సున్నితంగా తిరస్కరించారంటారు.

ఇంటిపట్టునే…..

ఏపీ రాజకీయాలు ఇప్పుడు హాట్ హాట్ గా మారాయి. రాజధాని అమరావతి అంశం రాజకీయ వర్గాల్లో నలుగుతోంది. అయినా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి దీనిపై స్పందించలేదు. ఇదే కాదు వరసగా ఇసుక, ఇంగ్లీష్ మీడియం వంటి అంశాలపై కూడా ఆయన పెదవి విప్పలేదు. ఇవన్నీ చూస్తుంటే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఇక రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా జాతీయ స్థాయిలో ఇప్పట్లో కోలుకోలేని పరిస్థితి కన్పించకపోవడంతో నల్లారి భవితవ్యం ఏంటనేది చర్చనీయాంశమైంది.

Tags:    

Similar News