నల్లారి ప్రయత్నాలు ఫలించేనా?

మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తిరిగి యాక్టివ్ అయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో ఆయన ప్రచారంలో పాల్గొనే అవకాశముంది. ఆయన [more]

Update: 2021-03-20 05:00 GMT

మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తిరిగి యాక్టివ్ అయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో ఆయన ప్రచారంలో పాల్గొనే అవకాశముంది. ఆయన సన్నిహితులు చెబుతున్న సమాచారం ప్రకారం త్వరలో ఏపీ పాలిటిక్స్ లో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి యాక్టివ్ గా పాల్గొననున్నారు. ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సయమం ఉన్నప్పటికీ, కొన్ని కీలక విషయాల్లో సంప్రదింపులు జరిపేందుకు పార్టీ హైకమాండ్ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని రంగంలోకి దించనున్నట్లు తెలిసింది.

సీనియర్ నేతలతో సమావేశం…..

ముందుగా ఆయన సీనియర్ నేతలందరినీ కవలనున్నారు. పార్టీలో ఉండి యాక్టివ్ గా లేని నేతలతో త్వరలోనే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో జరిగే ఈ సమావేశానికి ఇప్పటికే కొందరికి ఫోన్ల ద్వారా ఆహ్వానాలు అందాయని చెబుతున్నారు. తిరుపతి ఉప ఎన్నికలపై వ్యూహాలను ఈ సమావేశంలో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చర్చిస్తారని సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది.

ప్రజాసమస్యలపై…..

ఇక తర్వాత జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలను ఉధృతం చేయడం. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ పై ముందుండి పోరాటం చేయాలని నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నిర్ణయించారంటున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ నిలుపుదల చేస్తామన్న హామీతో ప్రజల ముందుకు వెళ్లనున్నారు. అలాగే అమరావతి రాజధాని అంశాన్ని కూడా ఆయన భుజానకెత్తుకునే అవకాశముంది.

టీడీపీతో కలసి నడవాలని….

దీంతో పాటు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టీడీపీతో కలసి ప్రయాణం చేయాలన్న యోచన చేస్తున్నారు. జనసేన, బేజేపీ ఒక కూటమిగా వెళుతున్నాయి. చంద్రబాబు సీపీఐతో కలసి నడుస్తున్నారు. తాము కూడా చంద్రబాబుతో కలసి నడవాలన్నది కాంగ్రెస్ నేతల ఆలోచన. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు అవుతుండటంతో పార్టీపై వ్యతిరేకత తగ్గిందని భావిస్తున్నారు. ఎటూ చంద్రబాబు తెలంగాణలో కాంగ్రెస్ తో కలసి నడిచారు. జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ వెంట ఉన్నారు. ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీని కూడా కలిశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబును ఒప్పించడం పెద్ద పనికాదని, ఈ బాధ్యతను కాంగ్రెస్ హైకమాండ్ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపై పెట్టిందంటున్నారు. మరి ఎంతవరకూ ఈ స్ట్రాటజీ వర్క్ అవుట్ అవుతుందో? లేదో? చూడాలి.

Tags:    

Similar News