పెదరాయుడు… ప్రసన్న

నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సీనియర్ నేత. నల్లపురెడ్డి కుటుంబానికి కూడా రాజకీయాల్లో ఒక ఇమేజ్ ఉంది. అలాంటి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇప్పుడు డిఫరెంట్ గా వ్యవహరిస్తున్నారు. [more]

Update: 2019-10-19 13:30 GMT

నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సీనియర్ నేత. నల్లపురెడ్డి కుటుంబానికి కూడా రాజకీయాల్లో ఒక ఇమేజ్ ఉంది. అలాంటి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇప్పుడు డిఫరెంట్ గా వ్యవహరిస్తున్నారు. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే 2014 ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నియోజకవర్గంలో పెద్దగా ఉండరన్న టాక్ ఉంది. ప్రజలకు అందుబాటులో ఉండరన్న పేరును ఆయన బాగానే సంపాదించుకున్నారు.

మంత్రి పదవి దక్కకున్నా…..

నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి వైఎస్ జగన్ పార్టీ పెట్టిన తర్వాత జిల్లా పార్టీ బాధ్యతలను అప్పగించారు. అయితే దానిని కూడా ఆయన సమర్థవంతంగా నిర్వహించలేకపోయారు. ఆయనే స్వచ్ఛందంగా జిల్లా అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కోవూరు నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. మంత్రివర్గంలో స్థానం దక్కుతుందనుకుంటే జగన్ తొలి దఫాలో ఆయనకు సర్దుబాటు చేయలేకపోయారు. మలి విడత విస్తరణంలో తనకు ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందన్న నమ్మకంతో ఉన్నారు.

అన్ని నియోజకవర్గాల్లోనూ…..

అయితే రాష్ట్రంలో 151 నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు ఒక తీరుగా ఉంటే కోవూరులో మాత్రం నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వెరైటీ గా వ్యవహరిస్తున్నారు. అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఎన్నికల అనంతర ఘర్షణలు దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఉన్నాయి. దీనిపై తెలుగుదేశం పార్టీ కూడా తీవ్ర అభ్యంతరం తెలుపుతోంది. ఆందోళనలను నిర్వహిస్తుంది. టీడీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ చంద్రబాబు ఊరూరా చెబుతున్నారు. కానీ కోవూరు నియోజకవర్గంలో మాత్రం జగన్ నినాదమైన రివర్స్ ను అందుకున్నారు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి.

బాధితులకు అండగా…

నియోజకవర్గం పరిధిలోని బుచ్చిరెడ్డి పాలెంలో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ వర్గీయులు టీడీపీ నేతలపై దాడికి పాల్పడ్డారు. కొడవలూరు మండలంలో ఒక ప్రిన్సిపాల్ పైన కూడా వైసీపీ కార్యకర్తలు కొందరు దాడి చేశారు. అయితే విషయం తెలుసుకున్న నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వైసీపీ నేతలను పిలిచి క్లాస్ పీకడమే కాకుండా వైసీపీ నేతలపై కేసులు నమోదు చేయాలని పోలీసులకు సిఫార్సు కూడా చేశారట. అంతటితో ఆగకుండా బాధితులకు వైసీపీ తరుపున నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి క్షమాపణలు కూడా చెప్పడం విశేషం. ఇలా నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి డిఫరెంట్ వే లో వెళుతున్నారు. ప్రసన్న పెదరాయుడిలా మారారన్నవ్యాఖ్యలు పార్టీలోనే విన్పిస్తున్నాయి.

Tags:    

Similar News