ప్రసన్నకు గుడ్ టైమ్ స్టార్ట్ అయిందటగా?

వైసీపీలో ఎమ్మెల్యేల మ‌ధ్య ఉత్సాహం ఉర‌క‌లెత్తుతోంది. దీనికి ప్రధాన కార‌ణం.. రెండు మంత్రి వ‌ర్గ సీట్లను త్వర‌లోనే భ‌ర్తీ చేయ‌నుండ‌డం. వాస్తవానికి ఇప్పుడు క‌రోనా ఎఫెక్ట్ లేక‌పోయి [more]

Update: 2020-04-01 14:30 GMT

వైసీపీలో ఎమ్మెల్యేల మ‌ధ్య ఉత్సాహం ఉర‌క‌లెత్తుతోంది. దీనికి ప్రధాన కార‌ణం.. రెండు మంత్రి వ‌ర్గ సీట్లను త్వర‌లోనే భ‌ర్తీ చేయ‌నుండ‌డం. వాస్తవానికి ఇప్పుడు క‌రోనా ఎఫెక్ట్ లేక‌పోయి ఉంటే.. ఈ నెల 26న రాజ్యస‌భ ఎన్నిక‌లు జ‌రిగి వైసీపీలో ఇద్దరు మంత్రులు పిల్లి సుభాష్‌చంద్రబోస్, మోపిదేవి వెంక‌ట ర‌మ‌ణ‌లు రాజ్యసభ‌లో అడుగు పెట్టి ఉండేవారు. అయితే, ఇప్పుడు వాయిదా ప‌డినా మ‌రో నెల రోజుల్లో అయినా లేదా మ‌రో రెండు మాసాల్లో అయినా రాజ్యస‌భ ఎన్నిక‌లు జ‌ర‌గ‌డం గ్యారెంటీ. అయితే, ఇప్పుడు వీరి స్థానాలు ఖాళీ అయితే, వైసీపీలో ఆ రెండు మంత్రివ‌ర్గ సీట్లను భ‌ర్తీ చేయాల్సి ఉంటుంది.

ఆ రెండింటికీ కాదని….

ఈ రెండింటిలో ఒక‌టి డిప్యూటీ సీఎం ప‌ద‌వి కావ‌డం అందునా అది అత్యంత కీల‌క‌మైన రెవెన్యూ మంత్రి సీటు కావ‌డం గ‌మ‌నార్హం. దీంతో ఈ ప‌ద‌వి కోసం బీసీ సామాజిక వ‌ర్గానికి చెందిన నేత‌లు తీవ్రమైన పోటీ ప‌డుతున్నారు. ఇక‌, మోపిదేవి బెర్త్‌లోకి వ‌చ్చేందుకు కూడా నేత‌లు తామంటే తామ‌ని చెబుతున్నారు. వీరిద్దరు బీసీ వ‌ర్గానికి చెందిన మంత్రులే కావ‌డంతో జ‌గ‌న్ ఈ రెండు సీట్లను బీసీల‌తోనే భ‌ర్తీ చేస్తారా ? లేదా ? అన్నది ప్రస్తుతానికి అయితే స‌స్పెన్స్‌. ఇక వైసీపీలో విన‌ప‌డుతోన్న స‌మాచారం ప్రకారం ఈ రెండు సీట్లలో నెల్లూరుకు చెందిన న‌ల్లప‌రెడ్డి ప్రస‌న్నకుమార్ రెడ్డికి ఒక‌టి ద‌క్కుతుంద‌ని అంటున్నారు. ఆయ‌న వైసీపీ త‌ర‌పున ఎన్నికైన తొలి ఎమ్మెల్యే కావ‌డం విశేషం.

ఇప్పటికే అక్కడ ఇద్దరు….

అయితే, అదే స‌మ‌యంలో ఇదే జిల్లా నుంచి కాకాని గోవ‌ర్దన్ రెడ్డి కూడా లైన్‌లో ఉన్నార‌నేది వాస్తవం. వీరిద్దరూ కూడా పార్టీకి అత్యంత కావాల్సిన నాయ‌కులు గా ప్రచారం లో ఉన్నారు. అయితే, ఇద్దరూ కూడా ఓసీ వ‌ర్గానికి చెందిన వారు కావ‌డం గ‌మ‌నార్హం. ఈ జిల్లాలో ఇప్పటికే రెడ్ల హ‌వా ఉంద‌న్న టాక్ ఉంది. పైగా మేక‌పాటి గౌతంరెడ్డి మంత్రిగా ఉన్నారు. మ‌రి మ‌రో రెడ్డికి జ‌గ‌న్ మంత్రి ప‌ద‌వి ఇస్తారా ? అన్నది చూడాలి. ఇక‌, మ‌హిళ‌ల విష‌యానికి వ‌స్తే.. రోజా, శింగ‌న‌మ‌ల ఎమ్మెల్యే జొన్నల‌గ‌డ్డ ప‌ద్మావ‌తిలు లైన్‌లో ఉన్నారు. వాస్తవానికి రోజాకు బెర్త్ ద‌క్కే ప‌రిస్థితి లేదు. ఇప్పట‌కే ఆమెకు ఏపీఐఐసీ చైర్ ప‌ర్సన్‌ ప‌ద‌విని ఇచ్చారు. సో.. ఆమె ప్రయ‌త్నాలు చేస్తున్నప్పటికీ.. ఫ‌లించే అవ‌కాశం లేద‌ని అంటున్నారు.

మరి ఎవరికి దక్కనుందో?

ఇక‌, జొన్న‌ల‌గ‌డ్డ ప‌ద్మావ‌తి విష‌యానికి వ‌స్తే.. ఆమెకు బెర్త్ క‌న్ఫర్మ్ అవుతుంద‌ని అంటున్నారు. అయితే, ఎస్సీ వ‌ర్గానికి చెందిన మ‌హిళా మంత్రులు ఇద్దరు ఉండ‌గా.. ఓవ‌రాల్‌గా ఐదుగురు మంత్రులు ఉండ‌డంతో ఇప్పుడు ఇదే వ‌ర్గానికి చెందిన మ‌హిళ‌కు కేటాయిస్తారా? అనేది ప్రశ్న. కానీ, ప‌ద్మావ‌తి పార్టీలో యాక్టివ్‌గా ఉంది. ఇటీవ‌ల టీడీపీ సీనియ‌ర్ నాయ‌కురాళ్లు శ‌మంత‌క‌మ‌ణిని ఆమె కుమార్తెను పార్టీలో చేర్పించేందుకు యాక్టివ్‌గా ప‌నిచేశారు. సో.. మొత్తానికి జ‌గ‌న్ వీరిలో ఎవ‌రిని క‌రుణిస్తారో చూడాలి.

Tags:    

Similar News