ప్రసన్న హడావిడి లేదు… ఎందుకనో?

నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సీనియర్ రాజకీయ నేత. తండ్రి వారసత్వం నుంచి వచ్చినా ఆయన తనకంటూ ఒక ముద్రను ఏర్పరచుకున్నారు. జగన్ వెంట తొలి అడగు వేసిన [more]

Update: 2020-10-28 12:30 GMT

నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సీనియర్ రాజకీయ నేత. తండ్రి వారసత్వం నుంచి వచ్చినా ఆయన తనకంటూ ఒక ముద్రను ఏర్పరచుకున్నారు. జగన్ వెంట తొలి అడగు వేసిన టీడీపీ నేత ఆయనే. అలాంటి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గత కొంతకాలంగా మౌనంగా ఉంటున్నారు. తాను ఎదురు చూస్తున్న సమయం దగ్గరపడుతుండటంతో మౌనంగా ఉండటమే బెటర్ అని నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి భావించినట్లుంది.

తొలి దఫాలోనే……

నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి 2014 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అయినా అప్పట్లో జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. అయితే ఎక్కువ కాలం ఆ బాధ్యతలను నిర్వర్తించలేక వేరొకరికి అప్పగించమని అధిష్టానానికి చెప్పేశారు. దీంతో కాకాని గోవర్థన్ రెడ్డికి జిల్లా అధ్యక్ష్య బాధ్యతలను పార్టీ అప్పగించింది. ఇక 2019 ఎన్నికల్లో నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడటంతో తాను మంత్రి అవుతానని ఆయన నమ్మకంగా ఉన్నారు.

ఆనంపై అధిష్టానం……

కానీ తొలి మంత్రివర్గంలో నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి జగన్ చోటు కల్పించలేకపోయారు. రెండో విడతలోనైనా తనకు మంత్రి పదవి వస్తుందన్న ఆశతో ఉన్నారు. సీనియర్ నేత ఆనం రామనారాయణరెడ్డి పార్టీని ఇరుకున పెట్టే విధంగా తరచూ వ్యాఖ్యలు చేయడంతో ఆయన పేరు జాబితాలో ఉండకపోవచ్చని అంటున్నారు. అందుకే రెడ్డి సామాజికవర్గం కోటాలో తనకే దక్కుతుందని నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి విశ్వాసంతో ఉన్నారు.

ఈసారైనా ఛాన్స్ దక్కుతుందా?

గత కొద్దిరోజులుగా ఆయన అందరితో కలసి పనిచేస్తున్నారంటున్నారు. మంత్రులతో పాటు ఎమ్మెల్యేలతో తరచూ సమావేశమవుతూ పార్టీ పరిస్థితి మరింత మెరుగుపడాలంటే అందరం సమన్వయంతో పనిచేసుకుపోవాలని సూచిస్తున్నారట. ఇటీవల మేకపాటి గౌతమ్ రెడ్డిని కూడా కలసి పెద్దరికంగా జిల్లా అభివృద్ధి పనులపై చర్చించారని చెబుతున్నారు. ఎలాంటి వివాదాలకు పోకుండా మంత్రివర్గ విస్తరణ వరకూ మౌనంగా ఉండాలని నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నిర్ణయించుకున్నట్లుంది. అందుకే ఆయన పెద్దగా బయట హడావిడి చేయడం లేదు.

Tags:    

Similar News