ఈసారి గ్యారంటీనా?

నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వైసీపీలో సీనియర్ నేతగా ఉన్నారు. జగన్ పార్టీ పెట్టిన వెంటనే టీడీపీ నుంచి వచ్చిన తొలి నేత ఆయనే. అందుకే నల్లపురెడ్డి [more]

Update: 2021-06-23 12:30 GMT

నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వైసీపీలో సీనియర్ నేతగా ఉన్నారు. జగన్ పార్టీ పెట్టిన వెంటనే టీడీపీ నుంచి వచ్చిన తొలి నేత ఆయనే. అందుకే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అంటే జగన్ కు ప్రత్యేక అభిమానం. ఈసారి కేబినెట్ విస్తరణలో నల్లపురెడ్డికి చోటు ఉంటుందా? లేదా? అన్న చర్చ జోరుగా సాగుతుంది. అయితే పార్టీ వర్గాల సమాచారం ప్రకారం ఈసారి ఖచ్చితంగా నల్లపురెడ్డికి జగన్ కేబినెట్ లో బెర్త్ దొరుకుతుందని తెలుస్తోంది.

జగన్ నే నమ్ముకుని….?

ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సీనియర్ నేత కావడం, జగన్ నే నమ్ముకుని పార్టీలోకి రావడం వంటివి ఆయనకు ప్లస్ అంటున్నారు. తొలి దశలోనే ఆయనకు మంత్రి పదవి దక్కాల్సి ఉంది. అయితే సామాజిక సమీకరణాల కారణంగా తొలి దఫా మంత్రివర్గంలో చోటు లభించలేదు. దీనిపై నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కొంత అసంతృప్తిగానే ఉన్నారు. ఇంకో ఆరు నెలల్లో మంత్రి వర్గ విస్తరణ ఉంది.

ప్రస్తుతం సైలెంట్ గా….

దీంతో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ప్రస్తుతం మౌనంగా ఉన్నారు. ఎలాంటి వివాదాల జోలికి పోవడం లేదు. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఈసారి మంత్రిపదవి పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. జగన్ ను నమ్మి వచ్చిన తనకు అన్యాయం చేయరని ఆయన సన్నిహితుల వద్ద కూడా వ్యాఖ్యానిస్తున్నారు. జగన్ ను నేరుగా కలవకపోయినా తన మనసులో మాటను ఆయనకు చేరవేసినట్లు ఆయన వర్గీయులు చెబుతన్నారు.

ఖచ్చితంగా దక్కుతుందని….

నెల్లూరు జిల్లాలో రెడ్డి సామాజికవర్గం ఎక్కువ. ప్రస్తుత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డిని తొలగించి ఆయన స్థానంలో మరొకరిని నియమించాల్సి ఉంటుంది. కానీ మేకపాటిని కొనసాగిస్తూనే ఆ జిల్లాలో జగన్ మరో రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేతకు మంత్రి పదవి ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతోనే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిలో ఆశలు పెరిగాయి. మిగిలిన జిల్లాల్లో బీసీ ఇతర వర్గాలకు అవకాశం కల్పించాలని నిర్ణయించారు. దీంతో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఈసారి మంత్రి పదవి గ్యారంటీ అన్న టాక్ జిల్లాలో జోరుగా నడుస్తుంది.

Tags:    

Similar News