అది తేలాకే అభ్యర్థి ఎవరో తేలుస్తారట

నాగార్జున సాగర్ ఉప ఎన్నిక అధికార టీఆర్ఎస్ కు సవాల్ గా మారింది. అభ్యర్థి ఎంపిక ఎవరనేది తేల్చుకోలేకపోతుంది. సర్వేల మీద సర్వేలను కేసీఆర్ చేయిస్తున్నారు. దీంతో [more]

Update: 2021-01-10 11:00 GMT

నాగార్జున సాగర్ ఉప ఎన్నిక అధికార టీఆర్ఎస్ కు సవాల్ గా మారింది. అభ్యర్థి ఎంపిక ఎవరనేది తేల్చుకోలేకపోతుంది. సర్వేల మీద సర్వేలను కేసీఆర్ చేయిస్తున్నారు. దీంతో అభ్యర్థి ఎంపిక ఇప్పట్లో జరిగేది లేదని స్పష్టమవుతుంది. బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులపై క్లారిటీ వచ్చేంత వరకూ అభ్యర్థిని ప్రకటించకూడదని కేసీఆర్ నిర్ణయించారని చెబుతున్నారు. అవసరమైతే మరికొన్ని సార్లు లోతుగా సర్వే చేయించాలని కూడా కేసీఆర్ అభిప్రాయపడుతున్నారట.

జానారెడ్డి బరిలో ఉంటే….

ఇప్పటి వరకూ అయితే కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత జానారెడ్డి పోటీకి దిగుతున్నారన్న ప్రచారం జరుగుతుంది. జానారెడ్డి ఇప్పటికే ఏడుసార్లు విజయం సాధించి ఉన్నారు. గత ఎన్నికల్లోనూ స్వల్ప మెజారిటీతో ఓటమి పాలయ్యారు. జానారెడ్డి అభ్యర్థి అయితే అందుకు ధీటైన అభ్యర్థిని నిలబెట్టాలన్నది కేసీఆర్ ఆలోచనగా ఉంది. ఇందుకోసం పలువురు సీనియర్ నేతల పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

ఆయన కాకుంటే….

అయితే మరో ప్రచారం కూడా ఉంది. ఈ ఉప ఎన్నికలలో జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి పోటీ చేస్తారన్న వాదన కూడా ఉంది. జానారెడ్డి తన కుమారుడిని ఉప ఎన్నికల ద్వారా అరంగేట్రం చేయించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. జానారెడ్డి కాకుండా ఆయన కుమారుడు బరిలో ఉంటే మాత్రం టీఆర్ఎస్ వ్యూహం మార్చనుంది. సీనియర్ నేతలకు కాకుండా అప్పుడు వేరే పేర్లను కేసీఆర్ పరిగణనలోకి తీసుకోనున్నారని చెబుతున్నారు.

నోముల కుటుంబం వత్తిడి…..

మరోవైపు నోముల నరసింహయ్య కుమారుడు భగత్ కూడా టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. బీసీ సంఘాలు కూడా భగత్ కు టిక్కెట్ ఇవ్వాలని డిమాండ్ వినిపిస్తుంది. ప్రధానంగా యాదవ సంఘాలు ఈ మేరకు పార్టీ పై వత్తిడి తెస్తున్నాయి. దీంతో కాంగ్రెస్ అభ్యర్థిని బట్టి ఇక్కడ టీఆర్ఎస్ ప్రకటిస్తుందని తెలిసింది. బీజేపీకి ఇక్కడ పెద్దగా బలం లేకపోవడంతో కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటన తర్వాతనే కేసీఆర్ నిర్ణయం వెలువడే అవకాశముంది.

Tags:    

Similar News