నాగబాబు టార్టెట్ టీడీపీ… కారణమిదేనా?

ఈ మాట రాజకీయ విశ్లేషకులు అనడంలేదు. జనసేనలో పవన్ తరువాత అంతటి వారు అయిన నటుడు, నాయకుడు నాగబాబు అంటున్నారు. ఆయన తెలుగుదేశం మీద ఒక్క లెక్కన [more]

Update: 2020-06-21 06:30 GMT

ఈ మాట రాజకీయ విశ్లేషకులు అనడంలేదు. జనసేనలో పవన్ తరువాత అంతటి వారు అయిన నటుడు, నాయకుడు నాగబాబు అంటున్నారు. ఆయన తెలుగుదేశం మీద ఒక్క లెక్కన మండిపడుతున్నారు. రాష్ట్రంలో ఉన్నవి రెండే పార్టీలు అని కూడా తీర్పు చెప్పేస్తున్నారు. వైసీపీ, జనసేన, బీజేపీ కూటమే ఆ పార్టీలని, టీడీపీ ఏపీలో ఎక్కడ ఉందని గడుసుగానే ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం చాప్టర్ క్లోజ్ అని కూడా హాట్ కామెంట్స్ చేస్తున్నారు.

మునిగిందా…?

తెలుగుదేశం పార్టీ మీద చాలా కాలంగా నాగబాబు గట్టిగానే కామెంట్స్ చేస్తున్నారు. అమరావతి రాజధాని భూముల్లో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది అని కూడా ఈ మధ్య ఆరోపించిన నాగబాబు అచ్చెన్నాయుడు అరెస్ట్ ను కూడా తాజాగా సమర్ధించారు. టీడీపీ నేతలు అవినీతి చేయబట్టే ఇలా జరుగుతోందని వ్యాఖ్యానించారు. టీడీపీ చేతికి అయిదేళ్ళు అధికారం ఇస్తే మొత్తానికి మొత్తం అవినీతి చేసి జనాలను వంచించారని, ఇపుడు టీడీపీని జనం ఎవరు నమ్మరని కూడా అంటున్నారు. టీడీపీ పూర్తిగా మునిగిన నావ అని, అందులో ఎవరూ ఉండరని కూడా నాగబాబు తేల్చేస్తున్నారు.

తమ్ముడు అలా …..

సరే జనసేన మొత్తం విధానం టీడీపీ వ్యతిరేకమా అంటే అలా కానేకాదు, పవన్ కళ్యాణ్ ఇప్పటికీ చంద్రబాబు లైన్లోనే నడుస్తున్నారు. ఆయన, ఆయన పక్కన ఉన్న నాదెండ్ల మనోహర్ అచ్చెన్న అరెస్ట్ చేయడాన్ని సమర్ధించలేదు. పైగా రాజకీయ కక్షలతో అరెస్టులు చేయడం మంచిది కాదని అన్నారు. సంప్రదాయాలకు విరుధ్ధంగా ఈ అరెస్టులు జరిగాయని కూడా వారు అంటున్నారు. అంటే టీడీపీకి జనసేన నుంచి లభించిన మద్దతుగా ఇది చూడాలి, మరి తమ్ముడు పవన్ ఇంకా చంద్రబాబు మంచి లీడర్ అని, ఆయన పార్టీని వైసీపీ ఇబ్బందులు పెడుతోందని అభిప్రాయపడుతూంటే నాగబాబు మాత్రం చీల్చిచెండాడుతున్నారు. మరి జనసేన విధానం ఇది కాదా, నాగబాబు పార్టీతో విభేదిస్తున్నారా అన్నది చర్చగా ఉంది.

ఇమడలేరా….?

నాగబాబు గత కొంతకాలంగా చేస్తున్న హాట్ కామెంట్స్, ప్రకటనలు జనసేనకు ఇబ్బందిగానే ఉంటూ వస్తున్నాయి. తాజాగా ఆయన ఓ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో టీడీపీ ఏపీలో లేనేలేదని అనేయడం విశేషం. 2024లో వైసీపీని ఎదుర్కొని అధికారంలోకి వచ్చేది జనసేన , బీజేపీ కూటమి మాత్రమేమని కూడా నాగబాబు అంటున్నారు మరి ఆయన‌కు ఉన్న ధైర్యం, ఆత్మవిశ్వాసం జనసేన నాయకులలో లేవా. లేక ఆయన చూస్తున్న కళ్లతో వారు చూడలేకపోతున్నారా. టీడీపీతో జనసేన రాజకీయ బంధం ఏంటి, రాజకీయ సిధ్ధాంతాలు ఏంటి..ఇవన్నీ కూడా చర్చగానే ఉన్నాయి. ఇలా అన్నదమ్ముల మధ్య సిధ్ధాంత విభేధాలు ఇపుడు జనసేన అభిమానులను గందరగోళంలో పడేస్తున్నాయి. మొతానికి చూస్తే జనసేనలో నాగబాబు ఇమడలేకపొతున్నారని చెబుతున్నారు.

Tags:    

Similar News