Janasena : గేటు దగ్గరే ఆపేస్తున్నారట… పవన్ ను చేరనివ్వడం లేదట

‍జనసేనలో గత రెండున్నరేళ్ల నుంచి చేేరికలు లేవు. బీజేపీలో చేరుతున్న నేతలు జనసేలోకి ఎందుకు రావడం లేదు. ప్రధానంగా కొన్ని సామాజికవర్గానికి చెందిన నేతలు జనసేనలోకి వచ్చేందుకు [more]

Update: 2021-11-10 06:30 GMT

‍జనసేనలో గత రెండున్నరేళ్ల నుంచి చేేరికలు లేవు. బీజేపీలో చేరుతున్న నేతలు జనసేలోకి ఎందుకు రావడం లేదు. ప్రధానంగా కొన్ని సామాజికవర్గానికి చెందిన నేతలు జనసేనలోకి వచ్చేందుకు మొగ్గు చూపుతున్నారు. వీరిలో కమ్మ, కాపు, రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేతలు కూడా ఉన్నారు. కానీ వారి విషయం జనసేన అధినేత పవన్ కల్యాణ్ వరకూ వెళ్లడం లేదంటున్నారు. నాదెండ్ల మనోహర్ వారికి అడ్డుగా ఉన్నారన్న టాక్ జనసేన పార్టీలో బలంగా విన్పిస్తుంది.

అన్నీ ఆయనే…

పవన్ కల్యాణ్ కు చెవి, ముక్కు, గొంతు అన్నీ నాదెండ్ల మనోహర్. ఆయన ఏం చెబితే పవన్ అది చేస్తారు. నాదెండ్ల మనోహర్ ను పవన్ కల్యాణ్ అలా నమ్మారు. సామాజికవర్గం కాకపోయినా రాజకీయ వ్యూహాలను నాదెండ్ల రచిస్తారన్నది పవన్ కల్యాణ్ విశ్వాసం. అందుకే పార్టీలో ఆయనకు అంత ప్రయారిటీ ఇచ్చారు. నాదెండ్ల మనోహర్ వైఖరికి విసుగు చెంది అనేక మంది పవన్ సొంత సామాజికవర్గం నేతలే పార్టీని విడిచి వెళ్లిపోయారు.

పొత్తు ప్రభావం…..

ఇక ఇటీవల జనసేన అధినేత కొంత స్పీడ్ పెంచారు. టీడీపీతో పొత్తు ఉంటుందన్న సంకేతాలు కూడా వస్తున్నాయి. దీంతో కొందరు నేతలు నేరుగా పవన్ కల్యాణ్ ను అప్రోచ్ అయ్యేందుకు ప్రయత్నించారట. వారిలో కొందరికి నాదెండ్ల మనోహర్ ను సంప్రదించాలని సూచించారట. కానీ నాదెండ్ల మనోహర్ మాత్రం వారి చేరికకు ఇంత వరకూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలిసింది. మరికొందరు నేతలు పవన్ కల్యాణ్ నేరుగా దొరకకపోవడంతో నాదెండ్లను సంప్రదించడంతో గేటు బయటనుంచే పంపేస్తున్నారన్న టాక్ నడుస్తోంది.

దూరమవుతామనా?

సరైన నేత మరొకరు వస్తే తనకు పవన్ దూరమవుతారని నాదెండ్ల మనోహర్ కు భయం పట్టుకుందా? అన్న అనుమానం కలుగుతుంది. పవన్ కల్యాణ్ కూడా చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఉత్తరాంధ్రకు చెందిన ఒక రాజకీయ నేతకు ఇటీవల నాదెండ్ల మనోహర్ నుంచి అలాంటి ఇబ్బందే ఎదురయింది. మొత్తం మీద నాదెండ్ల మనోహర్ నేతలను పవన్ కల్యాణ్ వద్దకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారన్న విమర్శలు అయితే విన్పిస్తున్నాయి. అందుకే ఇంతవరకూ జనసేనలో సరైన నేత చేరకపోవడానికి కారణం.

Tags:    

Similar News