Janasena : అవునంటే కాదనిలే… కాదంటే….?

రాజకీయాల్లో ఎత్తుగడలు మామూలే. కానీ ప్రత్యర్థి వర్గానికి మాత్రం చిక్కకుండా రాజకీయాలను సహజంగానే చేస్తుంటారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తుల్లో కూడా ఇలాంటి సంకేతాలనే రెండు పార్టీలూ [more]

Update: 2021-10-17 06:30 GMT

రాజకీయాల్లో ఎత్తుగడలు మామూలే. కానీ ప్రత్యర్థి వర్గానికి మాత్రం చిక్కకుండా రాజకీయాలను సహజంగానే చేస్తుంటారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తుల్లో కూడా ఇలాంటి సంకేతాలనే రెండు పార్టీలూ బయటకు పంపుతున్నాయి. తాము బీజేపీతోనే కలసి ఉంటామని, వచ్చే ఎన్నికల్లోనూ ఆ పార్టీతోనే కలసి పోటీ చేస్తామని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. బీజేపీ, జనసేన పొత్తుకు గండి పడుతుందన్న నేపథ్యంలో ఈ వార్తలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

బీజేపీతో కలసి….

బీజేపీతో కలసి పోటీ చేస్తామన్న నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యలను కొట్టిపారేయలేం. అదే సమయంలో టీడీపీతో పొత్తు ఉండదన్న గ్యారంటీ కూడా ఏమీ లేదు. ఎందుకంటే వచ్చే ఎన్నికలు జనసేన, బీజేపీ, టీడీపీ మూడు పార్టీలకూ ప్రతిష్టాత్మకమే. మరో ఐదేళ్లు అధికారానికి దూరంగా ఉండలేని పరిస్థితి. అదే సమయంలో పవన్ కల్యాణ్ మరో ఐదేళ్లు అధికారం లేకుండా పార్టీని నడపలేరు. ఆర్థికంగా ఇప్పటికే ఆయన పార్టీ కోసం సినిమాల్లో ఇష్టం లేకున్నా నటిస్తున్నారు.

ఇద్దరూ మౌనంగానే….

అదే సమయంలో ఎక్కడా బయటపడటంలేదు. కొద్ది రోజుల క్రితం చంద్రబాబు ఇంటిపై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ దాడి చేసినప్పుడు పవన్ కల్యాణ్ స్పందించలేదు. కనీసం ఖండన కూడా విడుదల చేయలేదు. అలాగే పవన్ కల్యాణ్ సభలను అడ్డుకోవడం, ఆయనపై వ్యక్తిగతంగా మాటల దాడులు చేయడంపై చంద్రబాబు కూడా స్పందించలేదు. ఇద్దరూ కావాలనే స్పందించలేదన్న టాక్ కూడా ఉంది.

బీజేపీతో కలసి…..

ఈ నేపథ్యంలో జనసేన, టీడీపీ పొత్తు ఖాయంగానే కన్పిస్తుంది. అదే సమయంలో బీజేపీ అండ కూడా ఉంటే బాగుంటుందని చంద్రబాబు భావిస్తున్నారు. జనసేనతో ఈ మేరకు బీజేపీ కలసి వస్తే స్వాగతించేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారు. వీలయితే బద్వేలు ఉప ఎన్నికల్లో టీడీపీ బహిరంగంగా బీజేపీ అభ్యర్థికి మద్దతిచ్చే అంశాన్ని కూడా పరిశీలిస్తామని చెబుతున్నారు. మొత్తం మీద అవునంటే కాదనిలే.. అన్న రీతిలో జనసేన, బీజేపీ పొత్తు ఉంటుందన్న కామెంట్స్ వినపడుతున్నాయి.

Tags:    

Similar News