వైసీపీలో లీకులు… ఉప్పందిస్తుంది వీరేనట

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఎలాంటి ప‌రిణామాలైనా చోటు చేసుకునే అవ‌కాశం ఉంది. ఇది కూడా అలాంటిదే. ఒక పార్టీలో గెలిచి.. మ‌రో పార్టీకి అనుకూలంగా మారిపోతున్న నేత‌లు చాలా [more]

Update: 2021-07-11 12:30 GMT

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఎలాంటి ప‌రిణామాలైనా చోటు చేసుకునే అవ‌కాశం ఉంది. ఇది కూడా అలాంటిదే. ఒక పార్టీలో గెలిచి.. మ‌రో పార్టీకి అనుకూలంగా మారిపోతున్న నేత‌లు చాలా మంది ఉన్నారు. అదే స‌మ‌యంలో ఒక పార్టీలో ఉంటూ.. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవ‌హ‌రించే నేత‌లు కూడా క‌నిపిస్తున్నారు. ఇలాంటి వారు ఏపీలో ఎక్కువ‌గా క‌నిపిస్తున్నార‌ని అంటున్నారు ప‌రిశీలకులు. వెన్నుపోటు రాజ‌కీయాల‌కు ఏపీ కేరాఫ్‌గా మారిపోయింద‌న్న చ‌ర్చలు ఎక్కువ వినిపిస్తున్నాయి. ఏపీలో బీజేపీని తీసుకుంటే.. చాలా మంది నేత‌లు.. క‌మలం పార్టీలో ఉంటూనే. వైసీపీకి అనుకూలంగా వ్యవ‌హ‌రిస్తార‌నే వాద‌న ఉంది. కొన్నాళ్ల కింద‌టి వ‌ర‌కు జ‌గ‌న్‌ను విమ‌ర్శించ‌డం మానేసి.. రెండేళ్ల కింద‌టే అధికారం కోల్పోయిన చంద్రబాబును విమ‌ర్శించిన బీజేపీ నేత‌లను చూసిన విష‌యం తెలిసిందే.

టీడీపీతోనూ…

అంటే.. వీరు ఉండ‌డం బీజేపీలోనేఉంటారు.. బీజేపీ సిద్ధాంతాల ప్రకార‌మే న‌డుచుకుంటారు. కానీ, వారి మ‌న‌సు, మాట మాత్రం వైసీపీకి, ముఖ్యంగా జ‌గ‌న్‌కు చాలా అనుకూలంగా ఉండేది. ఎవ‌రో ఒక‌రిద్దరు.. అంటే క‌న్నా లక్ష్మీనారాయ‌ణ‌, సుజ‌నా చౌద‌రి.. వంటివారు నోరు విప్పినా.. వారి నోటికి అంతే వేగంగా తాళం వేయించిన సంద‌ర్భాలు కూడా మ‌న‌కు తెలిసిందే. దీంతో బీజేపీ నేత‌లు వైసీపీకి అనుకూలంగా ఉన్నార‌నే టాక్ రాజ‌కీయాల్లో జోరుగా సాగింది. అయితే ఇది ఇప్పుడే కాదు… గ‌తంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీజేపీ సీనియ‌ర్ నేత‌లు బాబును అనుకూలంగా ఉండేవారు. బీజేపీ సీక్రెట్లు ముందుగా బాబు చెవిలో వేసేవారు. ఆ మాట‌కు వ‌స్తే ఇప్పుడు బీజేపీలో ఉన్న సీనియ‌ర్లు కూడా చంద్రబాబుతో త‌ర‌చూ ట‌చ్‌లో ఉంటార‌న్నది తెలిసిందే.

మరో ఇద్దరు కూడా….

ఇక‌, ఇప్పుడు వైసీపీలోనే ఉంటూ.. బీజేపీకి అనుకూలంగా వ్యవ‌హ‌రిస్తున్న నేత‌ల వ్యవ‌హారం తెర‌మీదికి వ‌చ్చింది. ఎంపీ రఘురామ కృష్ణరాజు రెబెల్‌గా మారి.. బీజేపీకి, టీడీపీకి కూడా సానుకూలంగా వ్యవ‌హ‌రిస్తున్న విష‌యం తెలిసిందే. పైకి ఈయ‌న ఒక్కరే క‌నిపిస్తున్నా.. చాలా మంది నేత‌లు.. బీజేపీకి అనుకూలంగా ఉన్నార‌ని.. వారు వైసీపీలోనే ఉన్నా.. మ‌న‌సంతా.. బీజేపీలోనే ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ముఖ్యంగా జ‌గ‌న్ సామాజిక వ‌ర్గానికే చెందిన ఇద్దరు ఎంపీలు కూడా బీజేపీ జాతీయ నేత‌ల‌తో ట‌చ్‌లో ఉన్నార‌న్న సందేహాలు వ‌స్తున్నాయి. జ‌గ‌న్ అధికారంలోకి రావడంతో చాలా మంది రెడ్డి సామాజిక వ‌ర్గం నేత‌లు.. ప‌ద‌వులు ఆశించారు.

అసంతృప్త నేతలు…..

అయితే.. అంద‌రికీ ఇవ్వడం సాధ్యం కాదు క‌నుక‌.. జ‌గ‌న్ వ్యూహాత్మకంగా సోష‌ల్ ఇంజ‌నీరింగ్‌ను ఎంచుకుని ముందుకు న‌డిచారు. దీంతో త‌మ‌కు ప‌ద‌వులు వ‌స్తాయ‌ని ఆశ‌లు పెట్టుకున్నవారికి నిరాశే ఎదురైంది. ఈ క్రమంలో వీరంతా.. బీజేపీకి అనుకూలంగా మారార‌ని విమ‌ర్శలు ఉన్నాయి. అంటే.. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల‌ను ముందుగానే లీకులు చేయ‌డం, పార్టీలో ఉన్న అంత‌ర్గత పోరుపై ఉప్పందించ‌డం.. లోపాల‌ను ముందుగానే చెప్పడం వంటివి చేస్తున్నార‌ట‌. ఇదీ.. మొత్తంగా.. అటు బీజేపీలో వైసీపీ నాయ‌కులు, ఇటు వైసీపీలో బీజేపీ నాయ‌కుల గురించి ప్రచారంలో ఉన్న విష‌యాలు.

Tags:    

Similar News