చేతకాని తనం అనుకుంటున్నారుగా?

అధికారంలోకి వస్తే అంతా తనదే అనుకున్నారు. తాను చెప్పింది జరుగుతుందని భావించారు. అందుకే ఎన్ని ప్రలోభాలు, బెదిరింపులు వచ్చినా వైసీపీనే నమ్ముకుని ఉన్నారు. తాను అనుకున్నట్లుగా పార్టీ [more]

Update: 2020-12-31 08:00 GMT

అధికారంలోకి వస్తే అంతా తనదే అనుకున్నారు. తాను చెప్పింది జరుగుతుందని భావించారు. అందుకే ఎన్ని ప్రలోభాలు, బెదిరింపులు వచ్చినా వైసీపీనే నమ్ముకుని ఉన్నారు. తాను అనుకున్నట్లుగా పార్టీ అధికారంలోకి వచ్చింది కానీ, తనకు మాత్రం ఎలాంటి అధికారాలు లేవని ఆయనకు ఇప్పటికి అర్థమయింది. ఆయనే గుంటూరు తూర్పు నియోజకవర్గం ముస్తాఫా. ముస్తాఫా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా అధికారులు ఎవరూ ఆయనను ఎమ్మెల్యేగా చూడటం లేదట.

జగన్ ను నమ్ముకుని….

ముస్తాఫా జగన్ ను నమ్ముకునే ఉన్నారు. 2014 ఎన్నికల్లో ముస్తాఫా గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి గెలిచారు. అప్పట్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం, 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ గూటికి చేరిన సంగతి తెలిసిందే. ముస్తాఫా కు కూడా టీడీపీ అప్పట్లో భారీ ఆఫర్లనే ఇచ్చింది. రాయపాటి సాంబశివరావుకు కూడా ముస్తాఫా శిష్యుడు కావడంతో టీడీపీలోకి జంప్ చేస్తారనుకున్నారంతా. కానీ ఆయన మాత్రం వైసీపీని వీడేది లేదని చెప్పారు.

ఏ పనులూ జరగక….

2014నుంచి 2019 వరకూ ముస్తాఫా ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఎలాంటి పనులు జరగలేదు. అప్పట్లో టీడీపీ నేతలు చెప్పిందే వేదం కావడంతో ముస్తాఫా బాగా ఇబ్బంది పడ్డారు. తన నియోజకవర్గంలో మంచినీటి సమస్య తలెత్తడంతో ప్రభుత్వం స్పందించకపోయినా సొంత నిధులు వెచ్చించి ట్యాంకర్ల ద్వారా మంచినీటిని అందించారు. అలా ఐదేళ్ల పాటు అష్టకష్టాలు పడిన ముస్తాఫా తమ ప్రభుత్వం వస్తే తనదే అధికారమనుకున్నారు.

మంత్రివర్గ విస్తరణ వరకూ……

కానీ గత పంధొమ్మిది నెలలుగా తనను ఎమ్మెల్యేగానే గుర్తించడం లేదని వాపోతున్నారు. అధికారులు అస్సలు కేర్ చేయడం లేదట. మంత్రిగాని, మరో వైసీపీ నేత గాని చెబితేనే పనులు జరుగుతున్నాయి. దీంతో ఈ విషయాన్ని ముఖ్యమంత్రి సలహాదారుకు కూడా తెలియజేసినా ఫలితం లేకుండా పోతుంది. మంచినీటి సమస్యను కూడా తన నియోజకవర్గంలో పరిష్కరించలేకపోతున్నారు. అధికారంలో లేకుంటే ప్రజలకు ఏదో ఒక వివరణ ఇచ్చుకోవచ్చు. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా పనులు కావడం లేదంటే చేతకాని తనమనుకోవాలా? అన్న ప్రశ్న తలెత్తుంది. అయితే మంత్రి వర్గ విస్తరణ జరిగేంత వరకూ ముస్తాఫా ఓపిక పట్టాలని డిసైడ్ అయ్యారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

Tags:    

Similar News