Ys jagan : మంగళగిరిలో మల్టీ లెవెల్ టాస్క్… అందుకే ఆ పదవి

జగన్ ఏ పనిచేసినా ముందు చూపుతోనే చేస్తారు. మంగళగిరిలో ఆళ్ల రామకృష్ణారెడ్డి మరింత బలం కావడానికి మూడేళ్ల ముందే నిర్ణయం తీసుకున్నారు. ఆ నియోజకవర్గానికి చెందిన మూరుగుడు [more]

Update: 2021-11-12 15:30 GMT

జగన్ ఏ పనిచేసినా ముందు చూపుతోనే చేస్తారు. మంగళగిరిలో ఆళ్ల రామకృష్ణారెడ్డి మరింత బలం కావడానికి మూడేళ్ల ముందే నిర్ణయం తీసుకున్నారు. ఆ నియోజకవర్గానికి చెందిన మూరుగుడు హన్మంతరావును ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు. నిజానికి ఈ పేరు ఎవరూ ఊహించలేదు. గుంటూరు జిల్లా నుంచి మర్రి రాజశేఖర్, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు వస్తుందని అనుకున్నారు. ఉమ్మారెడ్డికి వచ్చింది. కానీ మర్రికి ఇవ్వకుండా అనూహ్యంగా మూరుగుడు హన్మంతరావుకు ఇచ్చారు.

పద్మశాలికి చెందిన…

మూరుగుడు హన్మంతరావు పద్మశాలి సామాజికవర్గానికి చెందిన నేత. మంగళగిరి నియోజకవర్గం నుంచి రెండుసార్లు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1999, 2004లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. 2009 లో ఆయన బంధువు కాండ్రు కమలకు కాంగ్రెస్ టిక్కెట్ ఇచ్చినా ఆమె గెలిచారు. 2014లో వీరు టీడీపీ వైపు వెళ్లినా 2019 ఎన్నికల సమాయానికి వీరంతా వైసీపీలో చేరిపోయారు. మంగళగిరిలో లోకేష్ పరాజయానికి పనిచేశారు.

రెండు సార్లు గెలిచి….

మంగళగిరి నియోజకవర్గంలో పద్మశాలి సామాజికవర్గం ఎక్కువ. అయితే ఆళ్ల రామకృష్ణారెడ్డిని రెండుసార్లు నుంచి గెలిపిస్తుంది వారే. దీంతో ఆ సామాజికవర్గాన్ని సంతృప్తి పర్చేందుకు జగన్ ఈసారి మూరుగుడు హన్మంతరావుకు పదవి ఇచ్చారంటున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ మంగళగిరి నుంచి నారా లోకేష్ పోటీ చేస్తారంటున్నారు. లోకేష్ ను మరోసారి ఓడించాలంటే అక్కడ పద్మశాలి సామాజికవర్గాన్ని మంచి చేసుకోవాలి.

లోకేష్ ను నిలువరించాలంటే?

కేవలం మంగళగిరిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు మూరుగుడు హన్మంతరావుకు జగన్ పదవి ఇచ్చారంటున్నారు. మూడు రాజధానుల ప్రకటనతో ఈ ప్రాంతంలో కొంత అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఇటీవల జరిగిన పరిషత్ ఎన్నికల్లో అది బయటపడింది. దీంతో మురుగుకు పదవి ఇచ్చి నష్ట నివారణ చర్యలను జగన్ చేపట్టారంటున్నారు. ఆళ్లకు అండగా మరోసారి పద్మశాలి నియోజకవర్గం నిలవాలన్నదే ఈ ఎంపిక ముఖ్యోద్దేశ్యం.

Similar News