టీడీపీకి మ‌రోషాక్‌.. సీనియ‌ర్ నాయ‌కుడు హ్యాండిస్తున్నాడా?

అస‌లే తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న టీడీపీకి ఇప్పుడు మ‌రిన్ని క‌ష్టాలు ఎదుర‌వుతున్నాయా? మ‌రో కీల‌క నేత జారిపోతున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. దాదాపు పార్టీ ఆవిర్భావం [more]

Update: 2020-06-26 03:30 GMT

అస‌లే తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న టీడీపీకి ఇప్పుడు మ‌రిన్ని క‌ష్టాలు ఎదుర‌వుతున్నాయా? మ‌రో కీల‌క నేత జారిపోతున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. దాదాపు పార్టీ ఆవిర్భావం నుంచి కూడా టీడీపీకి అండ‌గా ఉంటున్న నాయ‌కుడు, న‌టుడు మాగంటి ముర‌ళీ మోహ‌న్‌. గ‌త 2014ఎన్నిక‌ల్లో రాజ‌మండ్రి నుంచి ఎంపీగా పోటీ చేసి విజ‌యం సాధించారు. త‌ర్వాత అనారోగ్య కార‌ణాల‌తో గ‌త ఏడాది ఎన్నిక‌ల‌కు దూరంగా ఉన్నారు. దీంతో ఆయ‌న కోడ‌లు మాగంటి రూపాదేవి లైన్‌లోకి వ‌చ్చారు. ఆమె గ‌త ఏడాది రాజ‌మండ్రి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే, ఇప్పుడు ఏడాది అయింది. ఈ మామా కోడ‌ళ్ల జాడ ఎక్కడా క‌ని పించ‌డం లేదు.

మహానాడులోనూ….

టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి అన్ని విధాలా అండ‌దండ‌లు అందిస్తోన్న ముర‌ళీ మోహ‌న్‌కు ఎంపీ అవ్వాల‌న్నది చిర‌కాల కోరిక‌. చంద్రబాబు రాజ్యస‌భ సీటు ఆఫ‌ర్ చేసినా తాను లోక్‌స‌భ‌కే పోటీ చేస్తాన‌ని ప‌ట్టుబ‌ట్టి మ‌రీ 2009లో రాజ‌మండ్రి ఎంపీగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఆ త‌ర్వాత ఐదేళ్ల పాటు ప్రజల్లోనే ఉన్న ఆయ‌న 2014లో ఘ‌న‌విజ‌యం సాధించి పార్లమెంటులో అడుగు పెట్టాల‌న్న త‌న కోరిక తీర్చుకున్నారు. ఇక గ‌త ఎన్నికల్లో కోడలు రూపాదేవి ఓడిపోయాక రాజ‌కీయంగా ముర‌ళీ మోహ‌న్‌ కుటుంబం ఊసే ఎక్కడా లేదు. గత నెల‌లో జ‌రిగిన మ‌హానాడులోనూ ఈ ఇద్దరి జాడా ఎక్కడా క‌నిపించ‌లేదు. పార్టీలోనూ వీరి గురించిన సమాచారం సైలెంట్‌గానే ఉంది. కానీ, ఎప్పటికైనా పార్టీలో పుంజుకుంటారులే.. అని అంద‌రూ అనుకున్నారు.

వ్యాపారాలపైనే…

అయితే అత్యంత విశ్వస‌నీయ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు భ‌విష్యత్తులో ఇక రాజ‌కీయాల జోలికి వెళ్లకూడ‌ద‌ని నిర్ణయిం చుకున్నట్టు ముర‌ళీ మోహ‌న్ చెప్పార‌ని అంటున్నారు పార్టీ సీనియ‌ర్‌లు. పార్టీలో ప్రాధాన్యం మాట ఎలా ఉన్నప్పటికీ.. ప్రస్తుతం ముర‌ళీ మోహ‌న్ ఆరోగ్య ప‌రిస్థితి కొంత ఇబ్బందిగానే ఉంది. అదే స‌మ‌యంలో రూపాదేవి కూడా వ్యాపారంలో బిజీగా ఉన్నారు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో పార్టీ కార్యక్రమాల్గో పాల్గొన‌డం అన్ని విధాలా న‌ష్టమ‌న్న నిర్ణయానికి వీరు వ‌చ్చేసిన‌ట్టు టీడీపీ వ‌ర్గాలే చ‌ర్చించుకుంటున్నాయి. అందుకే పార్టీకి దూరంగా ఉంటున్నార‌ని వార్తలు వ‌స్తున్నాయి.అస‌లు టీడీపీ ప‌రిస్థితి బాగోక‌పోవ‌డంతో బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు.. రాజ‌మండ్రి లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం వైపు తొంగి చూసేందుకు కూడా ఈ కుటుంబం ఇష్టప‌డ‌డం లేద‌ట‌.

ఇక రాజకీయాలు అనవసరమని….

ఆది నుంచి కూడా ముర‌ళీ మోహ‌న్ జాగ్రత్తప‌రుడ‌ని, విచ్చల‌విడిగా ఖ‌ర్చులు పెట్టేందుకు ఆయ‌న క‌డుదూరంగా ఉంటార‌ని, ఈ క్రమంలోనే ఇప్పుడు పార్టీ ప‌రిస్థితి బాగోని నేప‌థ్యంలో విచ్చల విడిగా ఖ‌ర్చులు చేసుకుంటూ పోతే.. రేప‌టి ప‌రిస్థితి ఏమిట‌నేది కూడా మ‌ర‌ళీ మోహ‌న్ ఆలోచ‌న‌గా ఉంద‌ని చెబుతున్నారు. ఇదిలావుంటే, తామంతా హైద‌రాబాద్‌లో ఉండి.. ఒక్క కోడ‌లు మాత్రమే రాజ‌మండ్రిలో ఉన్నా ప్రయోజ‌నం ఉండ‌బోద‌ని చెబుతున్నారు. ఈ ప‌రిణామాల‌తోపాటు.. ఇక‌.. ఇప్పట్లో రాజ‌కీయాలు ఎందు‌క‌నే ఆలోచ‌న‌లో ఉన్నార‌ని తెలుస్తోంది. ఈ ప‌రిణామాలు చూస్తుంటే ముర‌ళీ మోహ‌న్ కుటుంబం టీడీపీ రాజ‌కీయాల‌కు దాదాపు దూర‌మైంద‌నే అనుకోవాలి.

Tags:    

Similar News