Tdp : మరోసారి ముళ్లపూడికి ముప్పు?

మళ్లీ నిరాశ తప్పదా? ఈయన కల నెరవేరదా? అవును జరుగుతున్న రాజకీయ పరిణామాలు మరోసారి ఈయన రాజకీయ భవితవ్యానికి తాళం పడేలానే కన్పిస్తున్నాయి. టీడీపీ ఏ ఎన్నికల్లో [more]

Update: 2021-10-11 03:30 GMT

మళ్లీ నిరాశ తప్పదా? ఈయన కల నెరవేరదా? అవును జరుగుతున్న రాజకీయ పరిణామాలు మరోసారి ఈయన రాజకీయ భవితవ్యానికి తాళం పడేలానే కన్పిస్తున్నాయి. టీడీపీ ఏ ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నా ఈయనకు మాత్రం మరోసారి టిక్కెట్ గండం పొంచి ఉండే అవకాశాలు సుస్పష్టం. ఆయనే ముళ్లపూడి బాపిరాజు. మాజీ జిల్లా పరిషత్ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజుకు మరోసారి రాజకీయ ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి.

ఎప్పటినుంచో….

ముళ్లపూడి బాపిరాజు తాడేపల్లి గూడెం టిక్కెట్ ను ఎప్పటి నుంచో ఆశిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాల్లో టీడీపీ కీలక నేతగా ఉన్న బాపిరాజు 2009 ఎన్నికల్లో పోటీ చేశారు. గెలవకపోయినా ఎక్కువ ఓట్లు సాధించడంతో ఆయన పార్టీ అధిష్టానం దృష్టిలో పడ్డారు. 2009 నుంచి పార్టీ ప్రతిపక్షంలో ఉన్న పదేళ్ల పాటు తాడేపల్లి గూడెం టీడీపీ ఇన్ ఛార్జిగా ఉండి పార్టీని బలోపేతం చేసే ప్రయత్నాన్ని చేశారు.

వరసగా ఇబ్బందులు….

2014 ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం తమదేనని భావించిన బాపిరాజుకు బీజేపీ రూపంలో షాక్ తగిలింది. అప్పుడు టీడీపీ, బీజేపీ పొత్తు ఉండటంతో గూడెం సీటును బీజేపీకి కేటాయించారు. తాడేపల్లి గూడెం నుంచి గెలిచిన మాణిక్యాలరావును మంత్రి పదవి లోకి కూడా చంద్రబాబు తీసుకున్నారు. అప్పటి నుంచి గూడెంలో బాపిరాజు హవా తగ్గడం ప్రారంభమయింది. ఇక 2019 ఎన్నికల్లోనూ ఆయనకు నిరాశే ఎదుయింది. బాపిరాజును కాదని చంద్రబాబు ఈలినానికి టిక్కెట్ ఇచ్చారు.

సేనతో పొత్తు ఉంటే…?

ఈసారి కూడా ముళ్లపూడి బాపిరాజు ఆశలు నెరవేరేటట్లు లేదు. తాడేపల్లిగూడెంకు వలవల బాబ్జీని చంద్రబాబు ఇన్ ఛార్జిగా నియమించారు. ఆయన పనితీరు బాగా లేకపోవడంతో మరోసారి టిక్కెట్ కు తాను ట్రై చేసుకోవచ్చని ముళ్లపూడి బాపిరాజు భావించారు. కానీ జనసేన పొత్తు ఉంటే ఈసారి కూడా టిక్కెట్ కష్టమే. ఇక్కడ జనసేన బలంగా ఉండటంతో ఈ సీటును వదులుకునే అవకాశం లేదు. ముళ్లపూడి బాపిరాజుకు ఈసారి కూడా టిక్కెట్ దక్కే అవకాశం లేదు.

Tags:    

Similar News