ముళ్లపూడికి దారి కన్పించడం లేదా

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో చెప్పడం క‌ష్టం. నిన్న మొన్నటి వ‌ర‌కు త‌న‌కు తిరుగేలేకుండా చ‌క్రం తిప్పిన నాయ‌కులు, రాష్ట్రంలో మారిన రాజ‌కీయ ప‌రిణామాలు, ప‌రిస్థితుల‌తో ఒక్కసారిగా [more]

Update: 2019-07-19 14:30 GMT

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో చెప్పడం క‌ష్టం. నిన్న మొన్నటి వ‌ర‌కు త‌న‌కు తిరుగేలేకుండా చ‌క్రం తిప్పిన నాయ‌కులు, రాష్ట్రంలో మారిన రాజ‌కీయ ప‌రిణామాలు, ప‌రిస్థితుల‌తో ఒక్కసారిగా సంధిలో ప‌డ్డారు. ఏం చేయాలో? రాజ‌కీయంగా ఎటు అడుగులు వేయాలో కూడా తెలియ‌ని ప‌ర‌స్థితిని ఎదుర్కొంటున్నారు. ఇలాంటి వారిలో ఎక్కువ మంది టీడీపీలోనే ఉన్నారు. మ‌రీ ముఖ్యంగా టీడీపీలో త‌న‌కు తిరుగేలేద‌ని, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా అభివృద్ధి అంతా త‌న క‌నుస‌న్నల్లోనే సాగింద‌ని చెప్పుకొన్న జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు పొలిటిక‌ల్ ఫ్యూచ‌ర్ పూర్తిగా డోలాయ‌మానంలో ప‌డిపోయింది. ఆయ‌న ఇప్పుడు చేతులు ముడుచుకుని కూర్చున్నట్లయ్యింది.

కీలక నేతగా ఎదిగి…..

క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన ముళ్లపూడి బాపిరాజు.. టీడీపీలో కీల‌క నాయ‌కుడిగా ఎదిగారు. ముఖ్యంగా పార్టీలో దూకుడుగా ముందుకు సాగి.. నిత్యం ఏదో ఒక రూరంలో వార్తల్లో నిలిచేవారు. ఈ క్రమంలోనే 2009లో ఒక‌సారి టీడీపీ త‌ర‌పున అసెంబ్లీకి పోటీ చేశారు. అయితే, అప్పటి ప్ర‌జారాజ్యం, కాంగ్రెస్ నాయ‌కుడు వైఎస్‌ల హ‌వా ముందు బాపిరాజు నిల‌బ‌డ‌లేక పోయారు. ఈ క్రమంలోనే మూడో స్థానానికి ప‌డిపోయారు. ఒక‌, త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం గోపాల‌పురం ఎస్సీల‌కు రిజ‌ర్వ్ అయింది. దీంతో ఆయ‌న త‌న మ‌కాంను(రాజ‌కీయ వేదిక‌ను) తాడేప‌ల్లిగూడెంకు మార్చుకున్నారు. ఇక‌, 2014 ఎన్నిక‌ల్లో మ‌రోసారి పోటీ చేయాల‌ని ముళ్లపూడి నిర్ణ‌యించుకున్నారు. తాడేప‌ల్లిగూడెం టికెట్‌ను ఆశించారు. అయితే, అప్పటి బీజేపీ- టీడీపీ పొత్తులో భాగంగా చంద్రబాబు ఈ టికెట్‌ను బీజేపీ నేత పైడికొండ‌ల మాణిక్యాల‌రావుకు ఇచ్చారు.

అనధికార ఎమ్మెల్యేగా….

దీంతో ఆ ఎన్నిక‌ల్లో పైడికొండ‌ల విజ‌యం సాధించారు. పైడికొండ‌ల ఏకంగా మంత్రి కూడా అవ్వడంతో రాజ‌కీయంగా గూడెంలో మూడేళ్ల పాటు పెద్ద యుద్ధం న‌డిచింది. ఇక‌, త‌న‌కు టికెట్ ద‌క్కక పోయే స‌రికి ఒకింత అలిగిన ముళ్లపూడి బాపిరాజుని బుజ్జగించేందుకు చంద్రబాబు ఆయ‌న‌కు జెడ్పీ చైర్మన్ న‌ద‌వి ద‌క్కేలా చేశారు. అతి త‌క్కువ వ‌య‌స్సులోనే బాపిరాజుకు ఈ ప‌ద‌వి ద‌క్కింది. అప్పటి నుంచి ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో త‌న‌దే పైచేయి అనేలా వ్యవ‌హ‌రించారు. పైడికొండ‌ల మంత్రి, ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ.. అన‌ధికార ఎమ్మెల్యేగా ముళ్లపూడి వ్యవ‌హ‌రించార‌నే పేరు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో అనేక మార్పులు, నేరుగా ఇద్దరు నాయ‌కులు స‌వాళ్లు, ఆరోప‌ణ‌లు విమ‌ర్శలు చేసుకుని మీడియాకు ఎక్కారు. చంద్రబాబు ఎన్నోసార్లు ముళ్లపూడికి వార్నింగ్‌లు ఇచ్చినా ఆయ‌న తీరు మ‌త్రం మార‌లేదు.

బెదిరించినా ఫలితం లేక….

ఇక ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లోనూ ముళ్లపూడి బాపిరాజు టికెట్ ను ఆశించారు. బీజేపీతో ఎలాగూ.. తెగ‌తెంపులు చేసుకున్నందున త‌న‌కు టికెట్ ఖాయ‌మ‌ని ముళ్లపూడి అనుకున్నారు. పార్టీ మార‌తానంటూ చంద్రబాబునే బెదిరించే ధోర‌ణితో వ్యవ‌హ‌రించారు. చివ‌ర‌కు బుజ్జగింపుల‌కు త‌లొగ్గక త‌ప్ప‌లేదు. అయితే, అనూహ్యంగా చంద్రబాబు కాపు వ‌ర్గానికి చెందిన ఈలి నానికి అవ‌కాశం ఇచ్చారు. అయితే, జ‌గ‌న్ సునామీ ముందు ఈయ‌న కూడా ఓడిపోయారు. ఇక‌, ఇటీవ‌ల రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ప‌ద‌వీ కాలం ముగియ‌డంతో ముళ్లపూడి జెడ్పీ చైర్మన్ ప‌ద‌వి కూడా ముగిసింది. మ‌రో ప‌క్క పార్టీలో ఆయ‌న ఆశించిన మేర‌కు టికెట్ ల‌భించ‌క‌పోగా, అధినేత నుంచి కూడా ఆశించిన మేర‌కు గుర్తింపు రాలేద‌నే భావ‌న‌తో ఉన్నారు.

ఇప్పుడు ఏం చేస్తారో…?

ఈ నేప‌థ్యంలో ఇప్పుడు ఏం చేయాల‌నే ఆలోచ‌న ముళ్లపూడి బాపిరాజుని వేధిస్తోంద‌ని అంటున్నారు. ఆయ‌న అనుచ‌రులు, ఆయ‌న దూకుడు స్వభావంతో స్థానికి నాయ‌క‌త్వానికి కూడా దూరం కావ‌డంతో ఇప్పుడు పోలిటిక‌ల్ ఫ్యూచ‌ర్ అగ‌మ్యంగా మారింద‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇక ఆయ‌న‌కు ఇప్పుడు పొలిటిక‌ల్ బేస్ కోసం సొంత నియోజ‌క‌వ‌ర్గం అంటూ లేకుండా పోయింది. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో తాడేప‌ల్లిగూడెం పార్టీ ప‌గ్గాలు కూడా వ‌చ్చే ప‌రిస్థితి లేదు. ఐదేళ్ల పాటు జిల్లాలో బాపిరాజు ముర‌ళీమోహ‌న్‌, చింత‌మ‌నేని ప్రభాక‌ర్, ఈలి నాని, పీత‌ల సుజాత, మొడియం శ్రీనివాస్ లాంటి వాళ్లతోనూ వైరం పెట్టుకున్నారు. మ‌రి రాబోయేరోజుల్లో ముళ్లపూడి ఏ దిశ‌గా అడుగులు వేస్తారో చూడాలి.

Tags:    

Similar News