ఎన్నెన్నో జన్మల బంధం.. నీదీ…నాదీ?

ముకుల్ వాస్నిక్ కాంగ్రెస్ రాజకీయాల్లో కీలక వ్యక్తి. గత ముాడున్నరదశాబ్ధాలలో భారత కాంగ్రెస్ రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగిన నాయకుడు. సాధార‌ణ కార్యకర్తగా తన రాజకీయప్రస్ధానం ప్రారంభించిన ముకుల్ [more]

Update: 2020-03-25 16:30 GMT

ముకుల్ వాస్నిక్ కాంగ్రెస్ రాజకీయాల్లో కీలక వ్యక్తి. గత ముాడున్నరదశాబ్ధాలలో భారత కాంగ్రెస్ రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగిన నాయకుడు. సాధార‌ణ కార్యకర్తగా తన రాజకీయప్రస్ధానం ప్రారంభించిన ముకుల్ వాస్నిక్ ఏకంగా ఏఐసీసీ అధ్యక్షపదవికి పోటీ చేసే స్ధాయికి చేరుకున్నారు. ఓ దళిత కుటుంబం నుంచి జన్మించి దేశ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించారు. క్రియాశీల రాజకీయాల్లో తలమునకలైన ఈ మహారాష్ట్ర నాయకుడు ఆరు పదుల వయస్సులో ఓ ఇంటి వాడయ్యారు. వివాహం చేసుకున్నారు. తన చిన్ననాటి స్నేహితురాలు రవీనా ఖురాన్ తో కలసి జీవితాన్ని పంచుకోవాలని నిర్ణయించుకుని దానిని అమలు పరిచారు. ఇటీవల డిల్లీలో ఒక హోటల్లో వీరిద్దరుా ఒకటయ్యారు.

ఇద్దరూ ప్రేమించుకుని….

సీనియర్ నాయకుడు, సోనియాగాంధీ రాజకీయసలహాదారు అహ్మద్ పటేల్, రాజస్ధాన్ ముఖ్కమంత్రి అశోక్ గెహ్లతో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఇతర ప్రము‌ఖులు ఈ కార్యక్రమానికి హాజరై నుాతన దంపతులను ఆశీర్వదించారు. ముకుల్ వాస్నిక్, రవీనా ఖురాన్ పాత స్నేహితులు అయినప్పటికి వారు వివాహం చేసుకోక పోవడం విశేషం. 1984 నుంచి వారి మధ్య పరిచయం ఉంది. రవీనా డీల్లీ లో న్యాయవాదిగా పనిచేస్తున్నారు. ఆమె వ్యాపారాలు కుాడా చేస్తున్నారు. వారికి పలువురు శుభాకంక్షలు తెలిపారు. 1984 లో ముకుల్ వాస్నిక్ ను, 1985 లో రవీనాను మెుదటిసారి కలిశానని, తామంతా అప్పట్లో మాస్కోలో జరిగిన వరల్డ్ యుాత్ ఫెస్టివల్ కు వెళ్ళామని కేంద్ర మాజీమంత్రి , కాంగ్రెస్ నాయకుడు మనీష్ తివారీ ఈసంధర్భంగా గుర్తు చేసుకున్నారు. నాయకులు రాజకీయాల్లో తలమునకలై ఆలస్యంగా వివాహాలు చేసుకోవడం, వివిధ కారణాల వల్ల ద్వితియ వివాహాలు చేసుకోవడం ఇటీవల కాలంలో మనం చుాస్తున్నాం.

ఎందరో నేతలు….

ఉమ‌్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన తెలుగుదేశం అధినేత నందముారి తారకరామారావు 90 వ దశకంలో లక్షీపార్వతిని ద్వితియ వివాహం చేసుకున్నారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదేళ్ళపాటు పనిచేసిన ఏఐసీసీ ప్రదాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ కొన్నేళ్ళ క్రితం ఓ ఇంటివాడయ్యాడు. గతంలో నాస్తికోద్యమంలో పనిచేసిన రామస్వామి నాయక్ వృద్ధాప్యంలో మళ్ళీ పెళ్ళి చేసుకున్నారు. జింబాబ్వే దివంగత అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే జీవిత చరమాంకంలో మళ్ళీ పెళ్ళి చేసుకున్నాడు. చెప్పుకుంటూ పోతే ఇలాంటి విషయాలు ఎన్నో వెలుగులోకి వస్తాయి.

కష్టపడి పైకి వచ్చి….

ముకుల్ వాస్నిక్ వివాహం విషయాన్ని పక్కకు పెడితే ఆయన రాజకీయాల్లో కష్టపడి పైకొచ్చిన నాయకుడు. దళిత కుటుంబంలో జన్మించిన ఆయన తన ప్రతిభ, పాటవాలతో అంచెలంచెలుగా పైకి ఎదిగారు. రాష్ట్ర రాజకీయాల నుంచి జాతీయ స్ధాయికి ఎదిగారు. కేంద్ర మంత్రిగా పనిచేసిన ముకుల్ వాస్నిక్ ఇప్పుడు పార్టీ ప్రదాన కార్యదర్శిగా కీలక భాధ్యతలు నిర్వహిస్తున్నారు. 1984 లో తొలిసారిగా పాతికే‌ళ‌్ళ వయసులో మహారాష్ట్ర లోని ‘ బుల్దానా ‘ స్ధానం నుంచి ఎనిమిదో లోక్ సభకు ఎన్నికయ్యారు. 1991-96 మధ్య ఇదే నియెాజకవర్గం నుంచి పదో లోక్ సభకు ప్రాతినిధ్యం వహించారు. 1998-99 మద్య కాలంలో 12వ లోక్ సభకు ప్రాతినిధ్యం వహించారు. 1989 లోక్ సభ ఎన్నికల్లో 1996, 1999 లోక్ సభ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. తరువాత 2009 లో రికుటిక్ నియెాజకవర్గంనుంచి గెలుపొందారు. 2014 ఇదే స్ధానం నుంచి ఓడిపోయారు. విధర్భ ప్రాంతమైన నాగ్ పూర్ నగర సమీపంలో ‘ రామ్ టెక్ ‘ నియెాజకవర్గం ఉంది. 1984 లో కాంగ్రెస్ నాయకుడు పి.వి.నరసింహారావు హన‌్మకొండ తో పాటు రామ్ టెక్ లోనుా పోటీచేసారు. హన్మకొండలో బి.జె.పి. అభ్యర్ధి చందుపట్ల జంగారెడ్డి చేతిలో ఓడిపోయిన పి.వి రామ్ టెక్ లో గెలిచి రాజివ్ నాయకత్వంలో అయిదేళ్ళు కొనసాగారు. తెలంగాణా సరిహద్దుల్లో ఈ నియెాజక వర్గం విస్తరించి వుంద

స్టూడెంట్స్ విభాగం నుంచి…

ముకుల్ వాస్నిక్ 1984-86 మద్య కాంగ్రెస్ విభాగమైన నేషనల్ స్టుడెంట్స్ యుానియన్ ఆఫ్ ఇండియా (nsui) అధ్యక్షుడిగా పనిచేశారు. 1988-90 మద్యకాలంలో కాంగ్రెస్ యువజన విభాగమైన ఇండియన్ యుాత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా వ్యవహరించారు. ముకుల్ వాస్నిక్ తండ్రి బాలకృష్ణ రామచంద్ర వాస్నిక్ కుాడా ‘ బుల్దానా ‘ ఎంపీగా పనిచేశారు. ముకుల్ వాస్నిక్ 2009-12 మద్య కాలంలో మన్మోహన్ సింగ్ మంత్రి వర్గంలో సామాజిక న్యాయ మంత్రిగా పనిచేశారు. గత ఏడాది లోక్ సభ ఎన్నికల్లో ఓటమి తర్వాతరాహుల్ గాంధీ రాజీనామా చేసీన తరువాత అత్యున్నత పదవికి ముకుల్ వాస్నిక్ పేరు పార్టీవర్గాల్లో బలంగా వినిపించింది. ముకుల్ వాస్నిక్ కు మున్ముందు మంచి రాజకీయ భవిషత్తు ఉందన్న సీనియర్ నేతల విశ్లేషణను తోసిపుచ్చలేం.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News