ఈయన పట్టాలెక్కిస్తారా? అంతా అయిపోయాక అప్పగిస్తారా?

చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది. అంతా కొలాప్స్ అయ్యాక కాని కాంగ్రెస్ అధిష్టానం మేలుకోదనేది మరోసారి మధ్యప్రదేశ్ రాజకీయాలు చెప్పకనే చెప్పాయి. [more]

Update: 2020-05-04 17:30 GMT

చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది. అంతా కొలాప్స్ అయ్యాక కాని కాంగ్రెస్ అధిష్టానం మేలుకోదనేది మరోసారి మధ్యప్రదేశ్ రాజకీయాలు చెప్పకనే చెప్పాయి. మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలిపోయింది. అధిష్టానం మధ్యప్రదేశ్ రాజకీయాలను పెద్దగా పట్టించుకోక పోవడం, అక్కడ ఇన్ ఛార్జిగా ఉన్న దీపక్ బబారియా వన్ సైడ్ గా వ్యవహరించడంతో జ్యోతిరాదిత్య సింధియా పార్టీని వీడారు. అప్పటి వరకూ చోద్యం చూసిన కాంగ్రెస్ హైకమాండ్ ప్రభుత్వం కుప్పకూలి పోయిన తర్వాత ఇప్పుడు డెసిషన్ కు వచ్చింది.

ఆయనను తప్పించి….

మధ్యప్రదేశ్ ఇన్ ఛార్జి పదవి నుంచి దీపక్ బబారియాను తప్పించి తనకు అత్యంత నమ్మకస్థుడైన ముకుల్ వాస్నిక్ ను కాంగ్రెస్ అధిష్టానం ఆ రాష్ట్రానికి ఇన్ ఛార్జిగా నియమించింది. దీపక్ బబారియా స్వచ్ఛందంగా తన పదవికి రాజీనామా చేశారు అనేకంటే ఆయనను అధిష్టానం తప్పించిందనే చెప్పాలి. ముకుల్ వాస్నిక్ ఇప్పటికే కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు. టెన్ జన్ పథ్ లో మూడు దశాబ్బాల నుంచి కీలక వ్యక్తిగా ఉన్నారు ముకుల్ వాస్నిక్.

దళిత నేతగా….

ముకుల్ వాస్నిక్ దళిత వర్గానికి చెందిన నేత. సాధారణ కార్యకర్తగా ఆయన కాంగ్రెస్ లో తన జీవితాన్ని ప్రారంభించారు. ఇటీవల రాహుల్ గాంధీ జాతీయ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నప్పుడు ముకుల్ వాస్నిక్ పేరు కూడా ఈ పదవికి విన్పించడం విశేషం. మహారాష్ట్ర నుంచి ముకుల్ వాస్నిక్ తన రాజకీయ జీవితాన్ని ప్రారంభిచారు. పాతికేళ్ల వయసులోనే లోక్ సభకు ముకుల్ వాస్నిక్ ఎన్నికయ్యారు. మూడు సార్లు ముకుల్ వాస్నిక్ లోక్ సభకు ఎన్నికయ్యారు.

విద్యార్థి దశ నుంచే…..

ముకుల్ వాస్నిక్ రాజకీయ జీవితం విద్యార్థి విభాగం నుంచి ప్రారంభమయింది. 1984లో ఆయన కాంగ్రెస్ అనుబంధ విభాగమైన ఎన్ఎస్‍‍‍‍యూఐ కి జాతీయ అధ్యక్షుడిగా వ్యవమరించారు. ఈయన తండ్రి రామచంద్ర వాస్నిక్ కూడా పార్లమెంటు సభ్యుడిగా పనిచేశారు. ముకుల్ వాస్నిక్ కాంగ్రెస్ హయాంలో కేంద్ర మంత్రిగా కూడా పని చేేశారు. ప్రధానంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ చెప్పిన పనిని చెప్పినట్లే చేసే నేత కావడంతో సోనియా వద్ద మార్కులు కొట్టేశారు. మధ్యప్రదేశ్ లో అంతా అయిపోయాక ముకుల్ వాస్నిక్ కు ఇన్ ఛార్జి పదవి ఇవ్వడంతో ఆయన ఏ మేరకు తిరిగి పార్టీని పట్టాలెక్కిస్తారో చూడాలి. కమల్ నాధ్, దిగ్విజయ్ సింగ్ వంటి సీనియర్ నేతలున్న మధ్యప్రదేశ్ లో ముకుల్ వాస్నిక్ ఎలా నెగ్గుకొస్తారో చూడాలి మరి.

Tags:    

Similar News