అంబానీ ఊరికే రాలేదట.. అందుకేనట

దేశంలో అపరకుబేరుడు ముకేశ్ అంబానీ ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను కలుసుకోవడం పై ఇప్పుడు హాట్ టాపిక్ నడుస్తుంది. చంద్రబాబు కి రామోజీరావు కి అత్యంత సన్నిహితుడిగా [more]

Update: 2020-03-01 03:30 GMT

దేశంలో అపరకుబేరుడు ముకేశ్ అంబానీ ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను కలుసుకోవడం పై ఇప్పుడు హాట్ టాపిక్ నడుస్తుంది. చంద్రబాబు కి రామోజీరావు కి అత్యంత సన్నిహితుడిగా ముద్ర పడిన అంబాని ఇలా ఆకస్మికంగా జగన్ ను కలుసుకుంటారని ఏ ఒక్కరు ఊహించలేదు. అందులోను కెజి బేసిన్ లో ఉమ్మడి ఎపి కి వాటా రావాలంటూ వైఎస్ డిమాండ్ చేసేవారని, అందుకే ఆయన హెలికాఫ్టర్ ప్రమాదం వెనుక రిలయన్స్ హస్తం ఉందంటూ జరిగిన ప్రచారం తో ఆయన మరణం తరువాత పెద్ద ఎత్తునే అంబాని సంస్థలపై దాడులు కూడా జరిగిన సంగతి అందరికి తెలిసిందే. ఇంతటి చరిత్ర ఉన్న తరువాత ఏ ఒక్కరు జగన్ అంబానీల నడుమ మంచి సంబంధాలు ఉంటాయని భావించి ఉండరు.

రాజ్యసభ సీట్ల వ్యవహారం …

ముఖేష్ అంబాని మిత్రుడు రిలయన్స్ సంస్థల వైస్ ప్రెసిడెంట్ గా వున్న పరిమళ్ నత్వాని రాజ్యసభ సభ్యత్వం త్వరలో ముగియనుంది. ఎపి నుంచి వైసిపి కి దక్కబోయే నాలుగు రాజ్యసభ సీట్లలో పరిమళ్ నత్వాని కి స్థానం కోసమే ముఖేష్ నేరుగా జగన్ ను కలిశారనే ప్రచారం ఇప్పుడు ఎక్కువైంది. ప్రధాని మోడీ సూచన మేరకే ఇదంతా తెరవెనుక నడిచినట్లు చెప్పుకుంటున్నారు. దీనికి ప్రతిఫలంగా సెర్బియా లో ఉన్న నిమ్మగడ్డ బకాయిలు పడ్డ మొత్తాన్ని వాన్ పిక్ కేసులో ఏదో రకంగా ముఖేష్ కట్టి బయటపడేయడానికే ఈ కలయిక అన్నది టిడిపి సాగిస్తున్న ప్రచారం. ఇది నిజమో కాదో తేలాలంటే రాజ్యసభ సీట్ల కేటాయింపు వ్యవహారం పూర్తి కావాలిసివుంది.

వ్యాపార అవసరాలు …

ప్రస్తుతం పెట్టుబడుల కోసం పరితపిస్తున్న ఆంధ్రప్రదేశ్ కి ముఖేష్ అంబాని వంటి పారిశ్రామిక వేత్త ఆశీస్సులు చాలా అవసరం. అలాగే అపార చమురు సహజవాయువు నిక్షేపాలు ఉన్న కెజి బేసిన్ లో తమ కార్యకలాపాలు నిరాటంకంగా సాగాలంటే వైసిపి సర్కార్ అండ కూడా రిలయన్స్ కి ముఖ్యమే. ఇటీవలే జియో ఫోన్ల కోసం గత ప్రభుత్వం తిరుపతి లో రిలయన్స్ కు కేటాయించిన భూములను జగన్ సర్కార్ పేదల ఇళ్లకోసం కేటాయించింది అన్న విమర్శ వుంది. ఎపి లో అనేక వ్యాపారాల్లో రిలయన్స్ పెట్టుబడులు ఇప్పటికే పెట్టి వుంది. వీటి అభివృద్ధికి ఆంధ్రా ప్రభుత్వ అండ ఆ సంస్థకు చాలా అవసరం.

ఒక అడుగు ముందుకు వేసి…

వ్యాపారవేత్తలకు ఏ సర్కార్ అధికారంలో ఉన్నప్పటికి వారితో సఖ్యత మరిన్ని ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఈ నేపథ్యంలోనే అంబాని ఒక అడుగు ముందుకు వేసి జగన్ ఇంటికి నేరుగా వెళ్లారని అంటున్నారు. టిడిపి మీడియా ఎక్కడ తప్పుడు ప్రచారాలు చేస్తుందో అని అంబాని రాక అంశం అత్యంత గోప్యంగా సిఎంఓ ఉంచడం గమనార్హం. సిఎం షెడ్యూల్ లో సైతం వీరి పర్యటన లేదంటే అత్యంత రహస్యంగానే ముఖేష్ అంబానీ వచ్చి వెళ్లెవరకు నడవటం మరింత చర్చనీయం అయ్యింది. జగన్ – ముఖేష్ అంబానీలకు ఒకరితో మరొకరికి ఉన్న అవసరాలే వీరి కలయికకు కారణమని విశ్లేషకులు అంటున్నారు.

Tags:    

Similar News