జోగయ్యను ఒప్పుకోవడం లేదు.. ముద్రగడే ముద్దు

కాపు ఉద్యమాన్ని నడిపేందుకు ఇప్పుడు బలమైన నేత కరువయ్యారు. మొన్నటి వరకూ ముద్రగడ పద్మనాభం నేతృత్వంలో కాపు ఉద్యమం నడిచింది. కాపులకు రిజర్వేషన్లు కల్పించాలంటూ ముద్రగడ పద్మనాభం [more]

Update: 2020-09-28 15:30 GMT

కాపు ఉద్యమాన్ని నడిపేందుకు ఇప్పుడు బలమైన నేత కరువయ్యారు. మొన్నటి వరకూ ముద్రగడ పద్మనాభం నేతృత్వంలో కాపు ఉద్యమం నడిచింది. కాపులకు రిజర్వేషన్లు కల్పించాలంటూ ముద్రగడ పద్మనాభం కొన్నేళ్లుగా ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారు. చంద్రబాబు అధికారంలో ఉండగా కిర్లంపూడి టు అమరావతి పాదయాత్రకూడా తలపెట్టారు. తుని ఘటన నేపథ్యంలో ప్రభుత్వం ముద్రగడ పద్మనాభం పాదయాత్రకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. కిర్లంపూడిలోనే ఆయనను హౌస్ అరెస్ట్ చేసింది.

ముద్రగడ తప్పుకోవడంతో…..

అయితే కాపు ఉద్యమంలో జరుగుతున్న పరిణామాలను గమనించి ముద్రగడ పద్మనాభం తాను తప్పుకుంటున్నట్లు రెండు నెలల క్రితం ప్రకటించారు. సొంత సామాజిక వర్గం నుంచే తనపై విమర్శలు చేసేవారు ఎక్కువయ్యారని, తాను ప్రస్తుతమున్న నేపథ్యంలో కాపు రిజర్వేషన్ల ఉద్యమాన్ని నడపలేనని ముద్రగడ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో ఆయనపై ట్రోల్ అవుతున్న విషయాలపై కూడా ముద్రగడ హర్ట్ అయ్యారు.

చేగొండి ముందుకొచ్చినా….

ముద్రగడ కాపు ఉద్యమం నుంచి తప్పుకోవడంతో తాను ఆ బాధ్యతలను స్వీకరిస్తానని మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య ముందుకొచ్చారు. ఇందుకోసం కొందరితో సమన్వయ కమిటీని కూడా నియమించారు. అయితే జోగయ్యపై నమ్మకం లేకపోవడం, ఆయన వయసు రీత్యా ఉద్యమాన్ని నడపలేరని భావించిన 13 జిల్లాల కాపు జేఏసీ నేతలు సమావేశమై తిరిగి ముద్రగడ పద్మనాభం కొనసాగాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.

దిగిరాని ముద్రగడ……

ముద్రగడ పద్మనాభం ఇంటికి వెళ్లి మరీ ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేశారు. అంతకు ముందే ముద్రగడ డిసైడ్ అయ్యారు. తాను ఉద్యమానికి నేతృత్వం వహించలేనని వారు ఇంట్లోకి అడుగుపెట్టిన వెంటనే లేఖ ఇచ్చారు. తనను ఇబ్బంది పెట్టవద్దని ముద్రగడ అభ్యర్థించారు. గంటల పాటు చర్చించినా ముద్రగడ దిగిరాలేదు. దీంతో కాపు జేఏసీ నేతలు నిరాశతో వెనుదిరిగారు. అయితే ఆయన సారథ్యంలోనే ఉద్యమం కొనసాగుతుందని కాపు జేఏసీ నేతలు చెప్పడం విశేషం.

Tags:    

Similar News