ముద్రగడ మనసులో అదే ఉన్నట్లుందిగా?

కాపు రిజర్వేషన్ ల కోసం అలుపెరగని పోరాటమే చేశారు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం. చంద్రబాబు సర్కార్ కి కంటిమీద కునుకు లేకుండా చేశారు. ఈ పోరాటంలో [more]

Update: 2020-07-04 08:00 GMT

కాపు రిజర్వేషన్ ల కోసం అలుపెరగని పోరాటమే చేశారు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం. చంద్రబాబు సర్కార్ కి కంటిమీద కునుకు లేకుండా చేశారు. ఈ పోరాటంలో ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి ఆయనకు. ఉవ్వెత్తున ఉద్యమం లేచే దశలో తుని లో రత్నాచల్ ఎక్స్ ప్రెస్, పోలీస్ స్టేషన్ తగులబెట్టిన కేసులు కాపు ఉద్యమ కారుల మెడకు చుట్టుకుంది. చంద్రబాబు మార్క్ చాణుక్య నీతి తో ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని తీవ్ర అవమానాలు చేయడమే కాదు ఆయన్ను ఉద్యమంలో ఒంటరిని చేసి ఇంటికి పరిమితం చేయగలిగారు.

అడుగడుగునా అవమానాలు …

ఇక ఇంతటి భారీ నిర్బంధానికి గురైనముద్రగడ పద్మనాభం చేసేదేమి లేక టిడిపి సర్కార్ కి చీకటి రోజులు రావాలని అప్పటివరకు తానూ ఏ పండగ జరుపుకొనని శపథం చేశారు కూడా. కట్ చేస్తే వైఎస్ జగన్ పాదయాత్రగా జగ్గంపేట, ప్రత్తిపాడు లో పర్యటించే సమయంలోనే తమ సర్కార్ అధికారంలోకి వస్తే రిజర్వేషన్ లు ఇచ్చే అధికారం తమకు లేదని కుండబద్దలు కొట్టేశారు. ముద్రగడ పద్మనాభం ఇలాఖాలోనే ఇలా జగన్ ప్రకటించడం నాడు ఎపి వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. అయితే జగన్ లెక్క చేయలేదు. అలా అని ముద్రగడను ఏనాడు తక్కువ చేసి మాట్లాడలేదు. ఇది ఇలా ఉంటే అంతా లెక్కేసినట్లే వైసిపి అఖండ మెజారిటీ తో ఎపి లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

జగన్ అన్నదే చేశారు …

జగన్ చెప్పినట్లే కాపు కార్పొరేషన్ కి నిధులు పెంచారు. అయితే ఎప్పటిలాగే రిజర్వేషన్ ల అంశం జోలికి ఏమాత్రం పోలేదు. ఈ మధ్య కాపు మహిళలకు నజరానా ప్రకటించి అందరిని ఆక్శ్చర్య పరిచారు. పాదయాత్ర లో ఇచ్చిన మాటను జగన్ నిలబెట్టుకునేందుకు ఈ కార్యక్రమం మమ అనిపించారు. ఇచ్చిన వారు కాకుండా అర్హులు ఇంకా ఉంటె మహిళలకు లబ్ది చేకూర్చే స్కిం కి దరఖాస్తు చేసుకోవాలని ఆఫర్ ఇచ్చారు.

టిడిపి ఫైర్ …. జనసేనాని లేఖ …

ఇది ఇలా ఉంటె ఈ కార్యక్రమం నచ్చని టిడిపి తమదైన శైలిలో విమర్శలకు దిగింది. జనాభా ఎంత మీరు ఇచ్చింది ఎంత అని నిలదీసింది. ఇక జనసేనాని సిఎం జగన్ కి లేఖ రాశారు. ఈ తాయిలాలు కాదు కాపు లకు కావాలిసింది రిజర్వేషన్లు వాటి అమలుకు కృషి చేయండి అంటూ ఘాటుగా స్పందించారు. పవన్ ఇలా స్పందించి కొద్ది రోజులు కూడా కాలేదు.

ముద్రగడ పొగిడారా … తిట్టారా …?

స్క్రీన్ మీదకు ముద్రగడ పద్మనాభం వచ్చేశారు. అడిగినవి అడగనివి కూడా అందరికి ఇచ్చేస్తున్నారు మంచిదే. పదవిని మూన్నాళ్ళ ముచ్చట చేసుకోకండి. వైఎస్ ఆర్ , జ్యోతి బసు, నవీన్ పట్నాయక్ లా పూజలు అందుకునే పని చేయాలని కాపు రిజర్వేషన్ లు ఇచ్చే విషయం ఆలోచించాలని కోరారు. ఇలా ఒక పక్క కీర్తిస్తూ మరోపక్క తమ డిమాండ్ గుర్తు చేస్తూ ముద్రగడ ఇచ్చిన కొత్త ట్విస్ట్ దేనికోసం అన్నదే ఇప్పుడు ఎపి లో హాట్ టాపిక్. ఏడాదిగా కాపు రిజర్వేషన్లపై ముద్రగడ పద్మనాభం సైలెంట్ గా లేఖల ద్వారానే అప్పుడప్పుడు స్పందిస్తూ మౌనం వహిస్తున్నారు. ఆయన ఇప్పటికిప్పుడు వైరస్ మహమ్మారి కారణంగా రోడ్డెక్కే పరిస్థితి లేనప్పటికీ ఆ తరువాత అయినా తన డిమాండ్ కోసం ఉద్యమ బాట పడతారా లేదా అన్నది చూడాలి.

Tags:    

Similar News