కదలిక మొదలయింది….కలసి వస్తున్నారు

ఇప్పుడిప్పుడే తెలుగుదేశం పార్టీ నేతల్లో కదలిక మొదలయింది. నేతలు ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేందుకు బయటకు వస్తున్నారు. ఇటీవల తెలుగుదేశం పార్టీ జాతీయ [more]

Update: 2021-07-07 05:00 GMT

ఇప్పుడిప్పుడే తెలుగుదేశం పార్టీ నేతల్లో కదలిక మొదలయింది. నేతలు ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేందుకు బయటకు వస్తున్నారు. ఇటీవల తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జిల్లాల పర్యటనతో తేటతెల్లమయింది. నారా లోకేష్ పర్యటనకు నేతలందరూ కలసి రావడం పార్టీ అధినాయకత్వంలో ఆనందాన్ని నింపింది. ఇప్పటి వరకూ అంటీముట్టనున్నట్లు ఉన్న నేతలు సయితం బయటకు రావడం శుభపరిణామం అంటున్నారు.

రెండేళ్ల నుంచి…..

దాదాపు రెండేళ్ల నుంచి తెలుగుదేశం పార్టీ ఓటమి పాలయిన రోజు నుంచి టీడీపీ నేతలు బయటకు రావడం లేదు. పార్టీ కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొనడం లేదు. ఒకరూ అరా నేతలు ఏదో మమ అనిపిస్తున్నారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల విషయంలోనూ టీడీపీ నేతలు చేతులెత్తేశారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు ఎవరూ చురుగ్గా ఎన్నికల్లో పాల్గొనలేదన్న నివేదికలు పార్టీ కేంద్ర కార్యాలయానికి అందాయి.

విశాఖ జిల్లాలో…..

ఈ నేపథ్యంలో నారా లోకేష్ పర్యటన కొంత ఉత్సాహాన్ని నింపుతుందనే చెప్పాలి. ఇటీవల నారా లోకేష్ విశాఖ జిల్లాలో పర్యటించారు. మత్తు డాక్టర్ సుధాకర్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చారు. ఈకార్యక్రమంలో టీడీపీ ముఖ్య నేతలందరూ పాల్గొన్నారు. విశాఖ పరిపాలన రాజధానిగా ప్రకటించినా అక్కడ టీడీపీకి తాము ఉన్నామంటూ నేతలు భరోసా ఇస్తున్నట్లు లోకేష్ పర్యటనలో వెల్లడయింది.

సీమలోనూ నేతలందరూ….

అలాగా తాజాగా నారా లోకేష్ కర్నూలు జిల్లాలో హత్యకు గురైనా టీడీపీ నాయకుల కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీలు కె.యి.ప్రభాకర్, ఎన్.ఎం.డి ఫారూఖ్, పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత, నంద్యాల పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు గౌరు వెంకట రెడ్డి,నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మా నందా రెడ్డి, కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఆళ్లగడ్డ టీడీపీ నాయకుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సీమలోనూ ఇప్పుడిప్పుడే నేతలందరూ పార్టీ కోసం బయటకు వస్తున్నారని లోకేష్ పర్యటన తర్వాత వెల్లడయిందని ఒక సీనియర్ నేత వ్యాఖ్యానించారు. మొత్తం మీద మళ్లీ టీడీపీ నేతల్లో కదలిక మొదలయింది. ఇది పార్టీకి శుభశూచకమేనని చెప్పుకోవాలి.

Tags:    

Similar News