ఇరవై ఏళ్ల తర్వాత ఆశ మొదలయిందా?

మారింది మూడు పార్టీలే. అయినా ఆయనకు ఏ పార్టీ అచ్చిరాలేదు. మంత్రిగా పనిచేసిన ఘనత మాత్రం దక్కింది. కాంగ్రెస్, తెలుగుదేశం, బీజేపీ ఈ మూడు పార్టీల్లో ఆయన [more]

Update: 2021-08-30 00:30 GMT

మారింది మూడు పార్టీలే. అయినా ఆయనకు ఏ పార్టీ అచ్చిరాలేదు. మంత్రిగా పనిచేసిన ఘనత మాత్రం దక్కింది. కాంగ్రెస్, తెలుగుదేశం, బీజేపీ ఈ మూడు పార్టీల్లో ఆయన కీలక పాత్ర పోషించాలనుకున్నారు. ఒక్క టీడీపీలోనే ఆ అవకాశం దక్కింది. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు లభించిన గుర్తింపు ఏ పార్టీలోనూ దక్కలేదు. ఆయనే మోత్కుపల్లి నరసింహులు. నాలుగో పార్టీలోకి మారినా ఆయనకు ఆ గౌరవం, ఆ అవకాశాలు లభిస్తాయా? అన్నది సందేహమే.

ఇరవై ఏళ్లుగా….

మోత్కుపల్లి నరసింహులు సీనియర్ నేత. దళిత సామాజికవర్గం నుంచి ఎన్టీఆర్ పిలుపు మేరకు 1983లో ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. అదే ఎన్టీఆర్ ప్రభుత్వంలో ఆయన మంత్రిగా పనిచేశారు. అదే చివరి అవకాశం. ఆ తర్వాత ఆయనకు అదృష్టం తలుపు తట్టలేదు. 1999లో మోత్కుపల్లి నరసింహులు చివరి సారి విజయం సాధించారు. అంటే ఇరవై ఏళ్ల నుంచి ఆయన మాజీగానే నెట్టుకొస్తున్నారు. ఎటువంటి పదవులు దక్కలేదు.

సుదీర్ఘకాలం…..

మోత్కుపల్లి నరసింహులు సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీలో కొనసాగారు. చంద్రబాబు హయాంలో ఎలాంటి పదవి దక్కలేదు. అయితే రేవంత్ రెడ్డికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వడాన్ని తప్పుట్టారు. పార్టీ నుంచి బయటకు వచ్చారు. 2020లో బీజేపీలో చేరారు. బీజీపీలో చేరినా మోత్కుపల్లి నరసింహులు పెద్దగా యాక్టివ్ గా లేరు. అక్కడ కూడా ఆయనకు ప్రాధాన్యత దక్కక పోవడంతోనే మౌనంగా ఉన్నారు. పార్టీలోనూ ఎలాంటి పదవి దక్కలేదు. దీంతో ఆయన ఇటీవలే బీజేపీకి రాజీనామా చేశారు.

ఆశ అదొక్కటే….

మోత్కుపల్లి నరసింహులు టీఆర్ఎస్ లో చేరిన తర్వాత ఏదైనా పదవి దక్కే అవకాశాలున్నా యంటున్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మోత్కుపల్లితో ఉన్న సంబంధాలు, సామాజికవర్గం ఆధారంగా ఎమ్మెల్సీ లేదా నామినేటెడ్ పోస్టును ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. టీఆర్ఎస్ లో చేరిక వల్లనే తన రాజకీయ జీవితం తిరిగి గాడిన పడుతుందని మోత్కుపల్లి నరసింహులు భావిస్తున్నారు. మొత్తం మీద రెండు దశాబ్దాల తర్వాత మోత్కుపల్లి నరసింహులు రాజకీయ జీవితంలో ఆశలు చిగురిస్తున్నాయట.

.

Tags:    

Similar News