మోత్కుపల్లికి ఇక గడ్డు రోజులేనా?

సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు బీజేపీలో చేరినా ఫలితం లేకుండా పోయింది. ఆయన పూర్తిగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. తెలుగుదేశం పార్టీలో ఉన్న సమయంలో మోత్కుపల్లి [more]

Update: 2020-10-26 09:30 GMT

సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు బీజేపీలో చేరినా ఫలితం లేకుండా పోయింది. ఆయన పూర్తిగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. తెలుగుదేశం పార్టీలో ఉన్న సమయంలో మోత్కుపల్లి నరసింహులుకు ఒక గుర్తింపు ఉండేది. అయితే ఆ తర్వాత క్రమంగా ఆయన రాజకీయంగా ఇబ్బందిపడుతున్నారు. ప్రధానంగా రాష్ట్ర విభజన వరకూ తెలుగుదేశం పార్టీలో మోత్కుపల్లి నరసింహులు కీలకంగా ఉండేవారు.

విభజన తర్వాతే…..

రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మోత్కుపల్లి నరసింహులు పార్టీ అధ్యక్ష పదవిని ఆశించారు. కానీ చంద్రబాబు ఆ అవకాశం ఇవ్వలేదు. రేవంత్ రెడ్డిని వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేశారు. రేవంత్ రెడ్డితో పాటువరసగా పార్టీని నేతలు విడిచి వెళ్లిపోతున్నప్పుడు కూడా మోత్కుపల్లి నరిసింహులు టీడీపీకి అండగా నిలిచారు. చంద్రబాబు పై వచ్చి ప్రతి విమర్శను ఆయన తిప్పికొట్టేవారు. 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడం, టీడీపీలో అందులో చేరిపోవడంతో మోత్కుపల్లి ఆశలు పెరిగిపోయాయి.

గవర్నగా అంటూ…..

మోత్కుపల్లి నరసింహులను గవర్నర్ గా నియమిస్తారని ప్రచారం జరిగింది. కానీ అధికారంలో ఉన్ననాళ్లు చంద్రబాబు మోత్కుపల్లి నరసింహులను పట్టించుకోలేదు. ఫలితంగా గవర్నర్ ఊసే లేకుండా పోయింది. దీంతో మోత్కుపల్లి నరసింహులు తెలుగుదేశం పార్టీపై విమర్శలకు దిగారు. దీంతో పార్టీ అధిష్టానం మోత్కుపల్లి నరసింహులును పార్టీ నుంచి బహిష్కరించింది. దీంతో ఆయన కూడా పార్టీకి తానే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

బీజేపీలో ఉన్నట్లా? లేనట్లా?

అయితే కొన్నాళ్ల క్రితం మోత్కుపల్లి నరిసింహులు బీజేపీలో చేరారు. అయితే బీజేపీలో కూడా మోత్కుపల్లి నరసింహులుకు ఎలాంటి ప్రాధాన్యత లభించడం లేదు. గత కొంతకాలంగా మోత్కుపల్లి నరసింహులు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన మోత్కుపల్లి నరసింహులుకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతే గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయంటున్నారు.

Tags:    

Similar News