ఆ ఎమ్మెల్యే సీటుకు మోదుగుల ఎర్త్ పెడుతున్నారా ?

సీనియ‌ర్ నాయ‌కుడు.. మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి.. త‌న‌దై న శైలిలో రాజకీయం చేస్తున్నార‌ని అంటున్నారు వైసీపీలో సీనియ‌ర్లు. 2009 నుంచి 2019 ఎన్నిక‌ల ముందు [more]

Update: 2021-08-30 14:30 GMT

సీనియ‌ర్ నాయ‌కుడు.. మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి.. త‌న‌దై న శైలిలో రాజకీయం చేస్తున్నార‌ని అంటున్నారు వైసీపీలో సీనియ‌ర్లు. 2009 నుంచి 2019 ఎన్నిక‌ల ముందు వ‌ర‌కు ఆయ‌న టీడీపీలో ఉన్నారు. అయితే గ‌త ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీ అధినేత చంద్రబాబును ప‌రోక్షంగా టార్గెట్ చేసిన ఆయ‌న రెడ్డి రాజ్యం వ‌స్తే.. త‌ప్ప రెడ్లకు స్వేచ్ఛ లేదంటూ.. కామెంట్లు చేశారు. ఈ క్రమంలోనే వైసీపీ పంచ‌న చేరారు. 2009 ఎన్నిక‌ల వేళ ఆయ‌న ప్రజారాజ్యం నుంచి టీడీపీలోకి జంప్ చేశారు. ఆ ఎన్నిక‌ల‌లో గుంటూరు జిల్లా న‌ర‌సారావుపేట పార్లమెంటు నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం ద‌క్కించుకున్నారు.

రాయపాటి కోసం…?

అయితే.. 2014 నాటికి రాయ‌పాటి కోసం సీటు త్యాగం చేసి గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి విజ‌యం ద‌క్కించుకున్నా రు. ఈ క్రమంలోనే ఆయ‌న చంద్రబాబు మంత్రివ‌ర్గంలో బెర్త్‌ను ఆశించారు. అయితే.. బాబు ఆయ‌న‌కు అవ‌కాశం ఇవ్వలేక పోయారు. దీనికి ప‌లు ఈక్వేష‌న్లు కూడా ఉన్నాయి. కానీ, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మాత్రం స్వపక్షంలోనే విప‌క్షం మాదిరిగా మారిపోయారు. అప్పటి టీడీపీ ప్రభుత్వంపై బ‌హిరంగ‌వేదిక‌ల‌పైనే విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే ఆ పార్టీని వీడి వైసీపీలో చేరారు. ఈ క్రమంలో ప‌ట్టుబ‌ట్టి గుంటూరు పార్లమెంటు సీటు తెచ్చుకున్నారు. టీడీపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్‌ను ఓడిస్తాన‌ని.. శ‌ప‌థాలు కూడా చేసి మరీ ఓడిపోయారు.

ఓటమి తర్వాత…?

ఇక‌, అప్పటి నుంచి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి సైలెంట్‌గా ఉంటున్నారు. అడ‌పాద‌డ‌పా.. ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నా.. పెద్దగా నిన్న మొన్నటి వ‌ర‌కు ఆయ‌న ఊపు చూపించ‌లేక పోయారు. ఈ క్రమంలోనే ఆయ‌న ఎమ్మెల్సీ కోరుకుంటున్నా ర‌నే ప్రచారం తెర‌మీదికి వ‌చ్చింది. జ‌గ‌న్ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మొర విన‌లేదు. అయితే.. ఇప్పుడు అనూహ్యంగా మోదుగుల త‌న నిర్ణయాన్ని మార్చు కున్న‌ట్టు వైసీపీలోనే చ‌ర్చ సాగుతోంది. గ‌తంలో తాను విజ‌యంద‌క్కించుకున్న గుంటూరు వెస్ట్‌పై క‌న్నేశార‌ట‌.

వచ్చే ఎన్నికల నాటికి…

వాస్తవానికి గ‌త ఎన్నిక‌ల్లో ఇక్కడ నుంచి టీడీపీ టికెట్‌పై గెలిచిన మ‌ద్దాలి గిరిధ‌ర్‌.. అనంత‌ర కాలంలో వైసీపీకి జైకొట్టిన విష‌యం తెలిసిందే. అయితే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్కడ నుంచి తాను పోటీ చేస్తాన‌ని.. త‌న అనుచ‌రుల‌తో ప్రచారం చేయిస్తున్నారు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి. అదే స‌మ‌యంలో గిరికి చాప‌కింద నీరులా.. కీల‌క నేత‌ల‌తో మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ట‌చ్‌లో ఉంటున్నార‌ని స‌మాచారం. నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన వైసీపీ నేత‌, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డితోను, ముఖ్యమంత్రి జ‌గ‌న్‌తోనూ స‌యోధ్యతో ముందుకుసాగుతున్నార‌ట‌.

ఎమ్మెల్సీ సీటు దక్కదని తెలిసి….?

పైగా మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణా రెడ్డి, రాజ్యస‌భ సభ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి ఇద్దరూ కూడా మోదుగుల‌కు బావ‌మ‌రుదులే..! దీంతో ఇప్పుడు ఎమ్మెల్సీ అడిగినా రాద‌ని.. వెస్ట్ సీటే టార్గెట్‌గా మోదుగుల వేణుగోపాల్ రెడ్డి కొత్త రాజ‌కీయం ప్రారంభించార‌ట‌. ఇక గిరి కూడా అంత వాయిస్ ఉన్న నేత కాక‌పోవ‌డంతో పాటు పార్టీ మార‌డంతో వైసీపీలో ఇమ‌డ లేక‌పోతున్నారు. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ నాయ‌కుడికే ఈ సీటు ద‌క్కుతుంద‌ని.. మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వ‌ర్గం ప్రచారం చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Tags:    

Similar News