నో డౌట్… మోదీ ఇమేజ్ తగ్గలేదు

బీహార్ ఎన్నికలలో మోదీ హవా స్పష్టంగా కన్పించింది. ఎన్డీఏ కూటమి అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవడానికి మోజీ క్రేజ్ ప్రధాన కారణమని చెప్పక తప్పదు. ఎగ్జిట్ పోల్స్ [more]

Update: 2020-11-10 16:30 GMT

బీహార్ ఎన్నికలలో మోదీ హవా స్పష్టంగా కన్పించింది. ఎన్డీఏ కూటమి అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవడానికి మోజీ క్రేజ్ ప్రధాన కారణమని చెప్పక తప్పదు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ ఎన్డీఏ బీహార్ ఎన్నికల్లో అపూర్వ ప్రతిభను చూపింది. ఎన్డీఏలోని ప్రధాన పక్షమైన జేడీయూ కంటే ఎక్కువ స్థానాలను కైవసం చేసుకుని బీహార్ లో ప్రాంతీయ పార్టీలకు చెక్ పెట్టిందని చెప్పాలి. నితీష్ కుమార్ పై ఉన్న వ్యతిరేకతను ఈ ఎన్నికల్లో మోదీ ఇమేజ్ కాపాడిందనే చెప్పాలి.

పదిహేనేళ్ల నుంచి….

నితీష్ కుమార్ పదిహేనేళ్ల నుంచి బీహార్ సీఎంగా ఉన్నారు. సహజంగా ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత ఫలితాలపై ప్రభావం చూపింది. అందుకే నితీష్ కుమార్ పై ఉన్న వ్యతిరేకతను పోగొట్టేందుకే మోదీ తన ప్రచారంలో ఎక్కువ సమయాన్ని కేటాయించారు. మరోవైపు నితీష్ కుమార్ సయితం ఇవే తన చివరి ఎన్నికలని చెప్పడం కొంత ఓటర్లలో సానుకూలత పెంచాయని చెబుతున్నారు. బీజేపీ బీహార్ లో అనుసరించిన వ్యూహం సక్సెస్ అయిందనే చెప్ాపలి.

అత్యధిక స్థానాలను…..

బీజేపీ బీహార్ లో అధికారంలో చేపట్టేందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ కు చేరుకుంది. దాదాపు 123 అసెంబ్లీ స్థానాల్లో ఎన్డీఏ కూటమి ఆధిక్యతలో కొనసాగిడం మోదీ ఇమేజ్ కు అద్దం పట్టింది. బీజేపీ తొలి నుంచి ఒక వ్యూహం ప్రకారం ఎన్నికలకు వెళ్లింది. బీహార్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా నితీష్ కుమార్ పేరును ప్రకటించింది. అలాగే తనకు బలమున్న స్థానాలను తీసుకోవడంలో కూడా సక్సెస్ అయింది. ఫిఫ్టీ ఫిఫ్టీ ఫార్ములాను ఫాలో అయింది.

అతిపెద్ద పార్టీగా…..

నితీష్ కుమార్ మహాగడ్బంధన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత బీజేపీ అండగా నిలిచి ముఖ్యమంత్రిని చేసింది. అయితే ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో బీజేపీకి అత్యధిక స్థానాలు దక్కాయి. కూటమిలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. కరోనా వైరస్ తో బీహార్ లో ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. వలస కార్మికులు రాష్ట్రానికి రాలేక ఇబ్బంది పడ్డారు. ఈ సమస్యలన్నింటినీ అధిగమించి అత్యధిక స్థానాలను ఎన్డీఏ కైవసం చేసుకోవడం వెనక మోదీ ఇమేజ్ కారణమని చెప్పకతప్పదు.

Tags:    

Similar News