మోడీ మార్నింగ్ వాక్ లో…?

మహాబలిపురంలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు తెల్లవారుజామున మార్నింగ్ వాక్ కు వచ్చారు. అక్కడ బీచ్ లో ఉన్న ప్లాస్టిక్ వస్తువులను స్వయంగా మోడీ ఒక [more]

Update: 2019-10-12 04:08 GMT

మహాబలిపురంలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు తెల్లవారుజామున మార్నింగ్ వాక్ కు వచ్చారు. అక్కడ బీచ్ లో ఉన్న ప్లాస్టిక్ వస్తువులను స్వయంగా మోడీ ఒక సంచిలో ఏరారు. ప్లాస్టిక్ వస్తువులు పర్యావరణానికి ముప్పు కలిగిస్తాయని మోడీ స్వయంగా ప్లాస్టిక్ వస్తువులను తీసివేయడం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. చైనా అధినేత జిన్ పింగ్ తో రెండు రోజుల పాటుజరిగే సమావేశాల్లో పాల్గొనేందుకు మోడీ మహాబలిపురం వచ్చిన సంగతి తెలిసిందే. అక్కడే రాత్రి బస చేసిన మోడీ ఉదయాన్నే మార్నింగ్ వాక్ కు వచ్చారు. బీచ్ లో అరగంట పాటు చెత్తను తొలగించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని మోడీ కోరారు.

Tags:    

Similar News