ఈ రాష్ట్రాలు మిజోరాం బాటను పట్టక తప్పదా?

దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉంది. కరోనా వైరస్ విజృంభిస్తున్నప్పటికీ ఐదో విడత లాక్ డౌన్ లో భారత్ ఉందని చెప్పక తప్పదు. అయితే ఈ [more]

Update: 2020-06-12 17:30 GMT

దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉంది. కరోనా వైరస్ విజృంభిస్తున్నప్పటికీ ఐదో విడత లాక్ డౌన్ లో భారత్ ఉందని చెప్పక తప్పదు. అయితే ఈ లాక్ డౌన్ లో అన్నింటికి దాదాపు మినహాయింపులు ఇచ్చేశారు. పాఠశాలలు మినహా అన్నింటిని తెరిచేశారు. దీంతో భవిష్యత్తులో వైరస్ వ్యాప్తి మరింత పెరుగుతుందన్న ఆందోళన దేశ వ్యాప్తంగా వ్యక్తమవుతోంది. రెండు నెలల పాటు లాక్ డౌన్ ను పటిష్టంగా అమలుచేయడంతో రోజుకు రెండు వేల కేసులకు మించలేదు. ఇప్పుడు ఏకంగా పదివేల కేసులు రోజుకు దాటేస్తున్నాయి.

మినహాయింపుల వల్లనే…?

లాక్ డౌన్ మినహాయింపుల వల్లనే ఈ పరిస్థితి నెలకొందని నిపుణులు చెబుతున్నారు. ప్రజల్లో కరోనా వైరస్ పట్ల అవగాహన ఉన్నా మితి మీరిన విశ్వాసం కారణంగానే ప్రజలు కరోనా వైరస్ ను లైట్ గా తీసుకుంటున్నారు. రెండు నెలలు బలవంతంగా నిర్బంధంలో ఉన్న ప్రజలు లాక్ డౌన్ మినహాయింపులు ఇవ్వగానే రోడ్లమీదకు వచ్చేస్తున్నారు. ఇక రాష్ట్రాలు కూడా తమ ఆదాయం గణనీయంగా పడిపోవడంతో మినహాయింపులకే మొగ్గు చూపాయి.

భవిష్యత్ లో మరోసారి….

అయితే భవిష్యత్తులో మళ్లీ లాక్ డౌన్ తప్పదన్న సూచనలు బలంగా కన్పిస్తున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడుల్లో వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. దీంతో లాక్ డౌన్ ను విధించాలని మేధావులు సూచిస్తున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం అందుకు అంగీకరించడం లేదు. ఇప్పటికే రెండున్నర నెలల నుంచి అన్ని వ్యవస్థలు అలసిపోయి ఉన్నాయని, ఈ పరిస్థితుల్లో లాక్ డౌన్ ను విధించడం సాధ్యమయ్యే పనికాదని అనేక రాష్ట్రాలు అభిప్రాయపడుతున్నాయి.

మిజోరాం కీలక నిర్ణయం…

కానీ మిజోరాం మాత్రం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 9వ తేదీ నుంచి రెండు వారాల పాటు పూర్తి స్థాయి లాక్ డౌన్ విధిస్తున్నట్లు మిజోరాం ప్రభుత్వం ప్రకటించింది. ఇక్కడ ఎలాంటి మినహాయింపులు ఉండవు. మిజోరాంలో మరో 80 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై ముఖ్యమంత్రి జొరాంతంగ స్పష్టమైన వైఖరితో ఉన్నారు. ఇతర రాష్ట్రాల సరిహద్దులను కూడా మూసివేశారు. ప్రస్తుతం 14 రోజులుగా ఉన్న క్వారంటైన్ సమయాన్ని 21 రోజులకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం మీద భవిష‌్యత్ లో కొన్ని రాష్ట్రాలు మిజోరాం బాట పట్టక తప్పదని అంటున్నారు.

Tags:    

Similar News