ఆ మంత్రికి కొంచెం స‌బ్జెక్ట్ నేర్పండ‌య్యా?

ఒకింత ఆశ్చర్యంగా అనిపించినా.. ఇది నిజం..! వైసీపీ నేత‌లు ఇదే విష‌యాన్ని ఆఫ్ ది రికార్డుగా మీడియాకు సైతం చెబుతున్నారు. మంత్రి వ‌ర్గంలో కీల‌క పొజిష‌న్‌లో ఉన్న [more]

Update: 2020-12-01 13:30 GMT

ఒకింత ఆశ్చర్యంగా అనిపించినా.. ఇది నిజం..! వైసీపీ నేత‌లు ఇదే విష‌యాన్ని ఆఫ్ ది రికార్డుగా మీడియాకు సైతం చెబుతున్నారు. మంత్రి వ‌ర్గంలో కీల‌క పొజిష‌న్‌లో ఉన్న ఓ మ‌హిళా మంత్రి.. ఇటీవ‌ల ఓ విష‌యంపై సీఎంవోకు వ‌చ్చారట‌. త‌న నియోజ‌క‌వ‌ర్గంలో అమూల్ విస్తర‌ణ వ‌ద్దని.. ఇక్కడ టీడీపీ నేత‌లు ఎక్కువ‌గా ఉన్నార‌ని.. వారు దీనిని వ్యతిరేకిస్తున్నార‌ని.. పైగా ప్రభుత్వానికి ఇది బ్యాడ్ చేస్తుంద‌ని చెప్పుకొచ్చార‌ట‌. అంతేకాదు.. అమూల్‌తో క‌న్నా.. స్థానికంగా విజ‌య ‌డైరీనే బెస్ట్ అని కూడా ఆమె అన్నార‌ని వైసీపీ నేత‌లు చెబుతున్నారు. దీంతో అవాక్కయిన సీఎంవో అధికారులు.. మేడం.. అమూల్ విష‌యంలో ప్రభుత్వం అన్ని విష‌యాల‌ను ఆచి తూచి వ్యవ‌హ‌రించింది. ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు మీరు వ‌ద్దంటే ఎలా ? అని ప్రశ్నించారు.

సజ్జల నచ్చ చెప్పడంతో….

అయిన‌ప్పటికీ.. స‌ద‌రు మంత్రి మాత్రం .. మా నియోజ‌క‌వ‌ర్గానికి అమూల్ వ‌ద్దని.. భీష్మించ‌డంతో సీఎంకు స‌ల‌హాదారుగా ఉన్న స‌జ్జల రామ‌కృష్ణారెడ్డి రంగంలోకి దిగి.. అర‌గంట‌కు పైగా క్లాస్ ఇచ్చార‌ట‌. రాష్ట్రంలో కొన్ని ద‌శాబ్దాలుగా పాడి రైతుల‌కు అన్యాయం జ‌రుగుతోంద‌ని.. దీనిని త‌గ్గించి రైతుల‌కు ల‌బ్ధి చేకూర్చాల‌ని మ‌నం భావించామ‌ని.. ఇప్పటికే ఈ విష‌యంలో సీఎం అంద‌రికీ వివ‌రించార‌ని.. అప్పట్లో మీరు రాలేద‌ని.. సో.. ఈ విష‌యంలో మేం మీకు అండ‌గా ఉంటామ‌ని కూడా హామీ ఇచ్చార‌ట‌. కానీ.. స‌ద‌రు మంత్రి మాత్రం.. ఈ విష‌యంలో ఔన‌ని కానీ.. కాద‌ని కానీ.. చెప్పకుండానే స‌రే సార్‌! అని కారెక్కారు. ఆ వెంట‌నే స‌జ్జల సీఎంవో అధికారుల‌ను పిలిచి.. ఆ మంత్రికి స‌బ్జెక్ట్ నేర్పించ‌డయ్యా..! అని దిశానిర్దేశం చేశారని వైసీపీ నేత‌లు చెబుతున్నారు.

గతంలోనూ ఇంతేనట….

క‌ట్ చేస్తే.. ఇప్పుడు ఈ విష‌యం వైసీపీలో హాట్ టాపిక్‌గా మారింది. గ‌తంలోనూ ఈ మంత్రి ఓ ప‌థ‌కంపై యాగీ చేశార‌ని.. కానీ.. బ‌లవంతంగా ఆమెను ఒప్పించాల్సి వ‌చ్చింద‌ని.. మ‌హిళ‌ల‌కు ప్రాధాన్యం ఇచ్చే పొజిష‌న్‌లో ఉన్న ఆమె.. గ‌తంలో టీడీపీలో ఉన్న కార‌ణం.. అక్కడి సిద్ధాంతాలు.. అనుమానాల‌నే ఇప్పటికీ కొన‌సాగిస్తున్నార‌ని సీఎంవో అధికారులు గుస‌గుస‌లాడుతున్నార‌ట‌. “ఆ మంత్రికి స‌బ్జెక్ట్ లేదు. మేం చెబితే విన‌రు. గ‌తంలో పోస్టింగులు, ట్రాన్స్‌ఫ‌ర్‌ల విష‌యంలోనూ ఇలానే యాగీ చేశారు. ఇది సీఎంవో దాకా వ‌చ్చి.. ప‌త్రిక‌ల‌కు ఎక్కారు. ఇప్పుడు కూడా అమూల్ విష‌యంలో ప్రభుత్వం క్లారిటీతో ఉంది. కానీ, మంత్రిగారికి స‌బ్జెక్ట్ లేక‌పోతే.. మేమేం చేస్తాం“ అని సీఎంవో కీల‌క అధికారులు గుస‌గుస‌లాడుకుంటున్నార‌ని వైసీపీలో చ‌ర్చ న‌డుస్తోంది. మొత్తానికి ప్రభుత్వం కీల‌కంగా భావిస్తున్న ప‌థ‌కాల‌పై మంత్రుల‌కే క్లారిటీ లేక‌పోతే ఎలా ? అనేది నేత‌ల మాట‌..!

Tags:    

Similar News