బంధువు కోసం బొత్స రాజ‌కీయం.. ఆయనను డ‌మ్మీ చేశారా..`?

విజ‌య‌న‌గ‌రం జిల్లా రాజ‌కీయాల్లో చిత్రమైన ప‌రిస్థితి చోటు చేసుకుంది. ఈ జిల్లాకు చెందిన పెన్మత్స సాంబ‌శివ‌రాజు కుటుంబం ఆది నుంచి వైసీపీలో కొన‌సాగుతోంది. జిల్లాలో మొట్టమొద‌టి సారి.. [more]

Update: 2020-11-10 05:00 GMT

విజ‌య‌న‌గ‌రం జిల్లా రాజ‌కీయాల్లో చిత్రమైన ప‌రిస్థితి చోటు చేసుకుంది. ఈ జిల్లాకు చెందిన పెన్మత్స సాంబ‌శివ‌రాజు కుటుంబం ఆది నుంచి వైసీపీలో కొన‌సాగుతోంది. జిల్లాలో మొట్టమొద‌టి సారి.. పార్టీ జెండాను మోసింది కూడా ఈ కుటుంబమే. కాంగ్రెస్‌లో సుదీర్ఘకాలం వివాద ర‌హిత నేత‌గా ఉన్న సాంబ‌శివ‌రావు మంత్రి బొత్స స‌త్యనారాయ‌ణ‌కు గురువు. అయితే ఆ త‌ర్వాత బొత్స త‌న గురువుకే ఎస‌రు పెట్టార‌న్న టాక్ విజ‌య‌న‌గ‌రం జిల్లాలో ఉంది. ఆయ‌న రాజ‌కీయ వార‌సుడిగా ఎంట్రీ ఇచ్చిన ఆయ‌న కుమారుడు సురేష్‌బాబు 2014 ఎన్నిక‌ల్లో నెల్లిమ‌ర్లలో పోటీ చేసి ఓడిపోయారు. గ‌త ఎన్నిక‌ల్లో సురేష్‌బాబుకే టిక్కెట్ ఇవ్వాల్సి ఉండ‌గా.. బొత్స బంధువు అయిన బ‌డ్డుకొండ అప్పల‌నాయుడ‌కు సీటు ఇచ్చేందుకు జ‌గ‌న్ పెనుమ‌త్స కుటుంబానికి ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వలేక పోయారు.

సీటు త్యాగం చేసినందుకు…..

ఎమ్మెల్యే సీటు త్యాగం చేసినందుకు గాను జ‌గ‌న్ పెనుమ‌త్స సాంబ‌శివ‌రాజుకు ఎమ్మెల్సీ ఇస్తాన‌ని హామీ ఇచ్చారు. అయితే ఆయ‌న మ‌ర‌ణాంత‌రం రెండు సంవ‌త్సరాల ప‌ద‌వీ కాలం ఉన్న ఎమ్మెల్సీ సీటును సూర్యనారాయ‌ణ‌రాజు ఉర‌ఫ్ సురేష్‌బాబుకు క‌ట్టబెట్టారు. ఈ రెండు సంవ‌త్సరాల ఎమ్మెల్సీ సీటు కోసం పార్టీలో చాలా పోటీ ఉన్నా చివ‌ర‌కు పెనుమ‌త్స వార‌సుడికి ద‌క్కింది. ఇలా వైసీపీ అధినేతే స్వయంగా పిలిచి ప‌ద‌వినిచ్చిన నాయ‌కుడు ఏరేంజ్‌లో ఉంటారో అని అంద‌రూ అనుకుంటారు. కానీ, దీనికి భిన్నంగా ఉంది సురేష్‌బాబు ప‌రిస్థితి. ఇక్కడ ఎవ‌రూ ఆయ‌న‌కు వాల్యూ ఇవ్వడం లేదు. అధికారులు సైతం ప‌ట్టించుకోవ‌డం లేదు.

ప్రొటోకాల్ పాటించకుండా…..

ఇక‌, పార్టీ కార్యక్రమాలు కూడా ఆయ‌న‌కు తెలియ‌కుండానే జ‌రిగి పోతున్నాయి. వాస్తవానికి ఎమ్మెల్సీగా ప్రొటోకాల్ పాటించాల్సిన అధికారులు కూడా ఇలా వ్యవ‌హ‌రిస్తుండ డం పైగా పార్టీలో ఆయ‌న‌కు కేడ‌ర్‌కు మ‌ధ్య దూరం ఎక్కువ‌గా ఉండ‌డం చ‌ర్చనీయాంశంగా మారింది. దీనికి కార‌ణం ఏంటి అంటే.. రాజ‌కీయంగా పెన్మత్స సురేష్‌బాబు మంచి గుర్తింపు ఉంది. వివాద ర‌హిత కుటుంబం.. ప్రజ‌ల‌కు సానుకూలంగా ఉండే ఫ్యామిలీ గా గుర్తింపు సాధించారు. ఈ కుటుంబానికి ప్రధాన్యం ఇస్తే.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఈయ‌న రాజ‌కీయంగా దూకుడు పెంచి.. త‌మ‌కే పోటీ ఇవ్వడం ఖాయ‌మ‌ని మంత్రి బొత్స స‌త్యనారాయ‌ణ‌, ఆయ‌న మేన‌ల్లుడు.. నెల్లిమ‌ర్ల ఎమ్మెల్యే బొడ్డుకొండ అప్పల‌నాయుడు వ‌ర్గం భావిస్తోంద‌ట‌.

దూరంగా పెడుతూ….

ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న సురేష్‌ ప‌ద‌వీ కాలం 2023 వ‌ర‌కు ఉంది. ఒక‌వేళ ఆయ‌న‌కు ప్రాధాన్యం ఇస్తే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీకి వ‌స్తార‌నే జంకుతోనే ఇలా చేస్తున్నార‌నే ప్రచారం జోరందుకుంది. ఎంత రాజ‌కీయ గురువు కుమారుడు అయినా త‌న కుటుంబానికే పోటీ వ‌స్తే బొత్స ఎంత మాత్రం స‌హించ‌ర‌న్నది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ క్రమంలోనే వారి సూచ‌న‌ల‌తోనే సురేష్‌బాబును పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల‌కు దూరం పెడుతున్నార‌ట‌. ముఖ్యంగా నెల్లిమ‌ర్లలో సురేష్ ప్రస్తావ‌నే లేకుండా చేస్తున్నార‌ని అంటున్నారు.

2009లో తండ్రి… నేడు త‌న‌యుడు…

పెనుమ‌త్స సాంబ‌శివ‌రాజు ఏడుసార్లు గెలిచిన స‌తివాడ నియోజ‌క‌వ‌ర్గం ర‌ద్దు కావ‌డంతో 2009 ఎన్నిక‌ల్లో ఆయ‌న విజ‌య‌న‌గ‌రం ఎంపీ సీటు కోసం ప‌ట్టుబ‌డితే బొత్స అడ్డు పుల్ల వేసి త‌న భార్య బొత్స ఝాన్సీకి ( అప్పటికే ఆమె ఉప ఎన్నిక‌ల్లో గెలిచి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు ) ఇప్పించుకున్నారు. వైఎస్ నాడు చివ‌ర్లో పెనుమ‌త్సకు నెల్లిమ‌ర్ల సీటు ఇచ్చినా ఆయ‌న కుటుంబం పోటీకి దూరంగా ఉంది. ఇక ఇప్పుడు మ‌రోసారి ఆ కుటుంబానికి ప‌ద‌వి వ‌చ్చినా కూడా మ‌ళ్లీ అదే బొత్స & కో ప్రాధాన్యం లేకుండా చేస్తున్నార‌న్న ప్రచారం జిల్లాలో వినిపిస్తోంది.

Tags:    

Similar News