హడావిడి లేకుండానే పని కానిచ్చేస్తున్నారు

రాష్ట్రంలో ప్రతిప‌క్షాల నోళ్లకు తాళం వేసేలా .. జ‌గ‌న్ కేబినెట్‌లోని కీల‌క మంత్రి త‌న దూకుడు పెంచారు. ఏడాది కాలంగా కేవ‌లం సంక్షేమానికి మాత్రమే ప‌రిమిత‌మైన ప్రభుత్వం [more]

Update: 2020-07-11 14:30 GMT

రాష్ట్రంలో ప్రతిప‌క్షాల నోళ్లకు తాళం వేసేలా .. జ‌గ‌న్ కేబినెట్‌లోని కీల‌క మంత్రి త‌న దూకుడు పెంచారు. ఏడాది కాలంగా కేవ‌లం సంక్షేమానికి మాత్రమే ప‌రిమిత‌మైన ప్రభుత్వం అంటూ.. ప్రతిప‌క్షాల నుంచి విమ‌ర్శలు వ‌స్తున్నాయి అయితే, ఇప్పుడు స‌ద‌రు మంత్రి దూకుడుతో పెట్టుబ‌డులు వ‌చ్చేందుకు మార్గం సుగ‌మ‌మైంది. విష‌యంలోకి వెళ్తే..ప‌రిశ్రమ‌ల శాఖా మంత్రి మేక‌పాటి గౌతంరెడ్డి త‌న‌దైన వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. బ‌హుభాషా ప్రవీణుడు అయిన మేక‌పాటికి ఇంగ్లీష్‌పై మంచి ప‌ట్టుంది. దీంతో విదేశీ ప‌ట్టుబ‌డులు తెచ్చేందుకు త‌న‌దైన బాణీని ఆయ‌న వినియోగిస్తున్నారు.

అనేక కంపెనీలతో….

ఈ నేప‌థ్యంలోనే జపాన్‌కు చెందిన బ్యాంక్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ కో ఆపరేషన్ (జేబీఐసీ), జపాన్‌ ప్రీమియర్‌ ఫైనాన్షియల్‌ ఇన్‌స్టిట్యూషన్, జపాన్‌ ఇంట ర్నే షనల్‌ కో ఆపరేషన్‌ ఏజెన్సీ (జేఐసీఏ), ప్రీమియర్‌ జపాన్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ, కునియమి ఎసెట్‌ మేనే జ్‌మెంట్‌ కంపెనీ లిమిటెడ్‌ సంస్థలు ఏపీ పారిశ్రామి కాభివృద్ధిలో సహకరించేందుకు వాటితో చ‌ర్చలు జ‌రుపుతున్నారు. ఈ చ‌ర్చల ఫ‌లితంగా.. రాష్ట్రంలో పోర్టుల నిర్మాణం, ఓడరేవుల ద్వారా రవాణా, పోర్టు ఆధారిత క్లస్టర్‌ డెవలప్‌మెంట్, ఇండస్ట్రియల్‌ క్లస్టర్ల అభివృద్ధిలో జపాన్‌ సంస్థల భాగస్వామ్యం పెరుగుతుంది. దీంతో రాష్ట్రంలో అభివృద్ధి ప‌నులు యుద్ధ ప్రాతిప‌దిక‌న ముందుకు సాగ‌నున్నాయి.

విశాఖను ఐటీ హబ్ గా…..

తాజా చ‌ర్చల కార‌ణంగా.. సోలార్‌ విద్యుత్‌ పార్కుల ఏర్పాటు, ఆక్వాకల్చర్‌ అభివృద్ధి, ఏపీలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ యూనిట్ల ఏర్పాటులో పెట్టుబడులకు అవ‌కాశం ఉంటుంది. ఏపీ అర్బన్‌ ఇన్‌ఫ్రాస్ట్ర క్చర్‌ అసెట్స్‌ మేనేజ్‌మెంట్‌తో భాగస్వామ్యం, పట్టణాల పునరుద్ధరణ, అభివృద్ధిలో తోడ్పాటు అందుతుంది. విశాఖ కేంద్రంగా పెవిలియన్‌ ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన సంస్థలు.. విశాఖ లో ఏర్పాటు చేయనున్న స్కిల్‌ సెంటర్, ఐటీ, పారిశ్రామిక క్లస్టర్లు, పోర్టులు, మౌలిక వసతుల కల్పన, విశా ఖను ఐటీ హబ్‌గా మార్చేలా నైపుణ్య కేంద్రం ఏర్పాటుకు సహకారం అందించ‌నున్నాయి.

ప్రతిపక్షాలకు ఛాన్స్ లేకుండా…..

ఇక‌, అంతర్జాతీయ మార్కెట్ల స్థాయిలో జేబీఐసీ (జపాన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ కో ఆపరేషన్‌) క్రెడిట్‌ రేటింగ్‌తో ఆంధ్రప్రదేశ్‌ సమగ్రాభివృద్ధికి ఈ సంస్థలు తొడ్పాటును అందించ‌నున్నాయి. ఎక్కడా హ‌డావిడి లేకుండా… అటు జిల్లాలోనే కాకుండా… బ‌య‌ట కూడా ప్రతిప‌క్షాలు సైతం త‌న‌ను విమ‌ర్శించేందుకు ఛాన్స్ ఇవ్వకుండా మేక‌పాటి వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నారు. మొత్తంగా మంత్రి మేక‌పాటి వ్యూహాత్మకంగా వేసిన అడుగులు రాష్ట్రానికి ద‌శ దిశ చూపించ‌నున్నాయ‌న‌డంలో సందేహం లేదు.

Tags:    

Similar News