ముఫ్తీ ఆ నిర్ణయం వెనక?

పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్ అధినేత్రి మెహబూబా ముఫ్తీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక హోదా తిరిగి ఇచ్చేంత వరకూ తాను ఎన్నికల్లో పోటీ [more]

Update: 2020-10-31 17:30 GMT

పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్ అధినేత్రి మెహబూబా ముఫ్తీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక హోదా తిరిగి ఇచ్చేంత వరకూ తాను ఎన్నికల్లో పోటీ చేయబోనని మెహబూబా ముఫ్తీ ప్రకటించారు. ఇది ఆషామాషీ నిర్ణయం కాదు. ఈ నిర్ణయంతో కాశ్మీర్ ప్రజలను తనవైపునకు తిప్పుకునేందుకు ఆమె ఈ ఎత్తుగడ వేశారన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. మోదీ ప్రభుత్వం ఉన్నంత వరకూ జమ్మూ కాశ్మీర్ లో అది సాధ్యం కాదని తెలిసీ ముఫ్తీ తీసుకున్న ఈ నిర్ణయం సంచలనానికి కారణమైంది.

తండ్రి స్థాపించిన పార్టీని…….

కాంగ్రెస్ నేత అయిన ముఫ్తీ మహ్మద్ సయీద్ ఆ పార్టీని వీడి సొంతంగా పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్ ను ఏర్పాటు చేశారు. అప్పటి వరకూ కాశ్మీర్ లో పట్టున్న ఫరూక్ అబ్దుల్లా కుటుంబానికి చెక్ పెట్టగలిగారు. ముఫ్తీ మహ్మద్ సయీద్ రెండు సార్లుమ ముఖ్యమంత్రి అయ్యారు. ఒకసారి కాంగ్రెస్, మరోసారి బీజేపీ మద్దతుతో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత ఆయన కూతురు మెహబూబా ముఫ్తీ కాశ్మీర్ ముఖ్యమంత్రి అయ్యారు. అదీ బీజేపీ సహకారంతోనే.

గృహనిర్భంధం తర్వాత……

ఆమె ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన నాటి నుంచి కాశ్మీర్ లో ప్రభుత్వం ఏర్పడలేదు. ఈ నేపథ్యంలో మెహబూబా ముఫ్తీని కేంద్ర ప్రభుత్వం గృహనిర్భంధంలో ఉంచింది. దాదాపు నెలల పాటు మెహబూబా ముఫ్తీ గృహనిర్భంధంలో ఉన్నారు. ఇటీవల సుప్రీంకోర్టు జోక్యంతో ఆమె విడుదలయ్యారు. అయితే ఆమె బయటకు వచ్చిన తర్వాత తనకు బద్ధవిరోధి అయిన నేషనల్ కాన్ఫరెన్స్ తో మెహబూబా ముఫ్తీ చేతులు కలిపారు.

ప్రత్యర్థి పార్టీతో చేతులు కలిపి…..

370 అధికరణ రద్దును వ్యతిరేకిస్తూ రెండు పార్టీలూ కలసి ప్రత్యేక ఫ్రంట్ ను కూడా ఏర్పాటు చేసుకున్నాయి. అయితే కాశ్మీర్ కు తిరిగి ప్రత్యేక హోదా వచ్చేంత వతరకూ తాను ఎన్నికల్లో పోటీ చేయబోనని మెహబూబా ముఫ్తీ ప్రకటించడం రాజకీయ పార్టీల్లో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికలలో పోటీ చేయకుండా ముఫ్తీ ఏం చేయదలుచుకున్నారన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతోంది. అయితే ఇది కేవలం సానుభూతి కోసమే చేసిన ప్రకటన తప్ప ఆచరణలో సాధ్యం కాదని కొందరు కొట్టి పారేస్తున్నారు. మొత్తం మీద మెహబూబా ముఫ్తీ ప్రకటన కాశ్మీర్ రాజకీయాలో చర్చనీయాంశంగా మారింది.

Tags:    

Similar News