మళ్లీ టర్న్ తీసుకుంటున్నారా?

కర్ణాటక రాజకీయాలు ఎప్పుడు ఎటువైపు టర్న్ తీసుకుంటాయో ఎవరూ చెప్పలేరు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండున్నరేళ్ల సమయం ఉంది. అయితే ఇప్పటి నుంచే అన్ని రాజకీయ [more]

Update: 2020-09-18 17:30 GMT

కర్ణాటక రాజకీయాలు ఎప్పుడు ఎటువైపు టర్న్ తీసుకుంటాయో ఎవరూ చెప్పలేరు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండున్నరేళ్ల సమయం ఉంది. అయితే ఇప్పటి నుంచే అన్ని రాజకీయ పార్టీలూ వచ్చే అసెంబ్లీ ఎన్నికలపైనే దృష్టిపెట్టాయి. యడ్యూరప్ప కూడా సొంత పార్టీలోనే అసంతృప్తిని ఎదుర్కొంటున్నారు. యడ్యూరప్పకు ఇదే ముఖ్మమంత్రిగా చివరి అవకాశం. అది అందరికీ తెలుసు. అందుకే అసంతృప్తిని కూడా ఎన్నడూ లేని విధంగా ఈ టర్మ్ లో యడ్యూరప్ప బాగా ఎదుర్కొంటున్నారు.

పొత్తుతో వెళ్లాలనే…..

వచ్చే ఎన్నికల్లో జనతాదళ్ ఒంటరిగా పోటీ చేయాలని ఇప్పటికే నిర్ణయించింది. ఈ మేరకు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను నియమించుకుంది. కానీ జేడీఎస్ ఒంటరిగా పోటీ చేస్తే దానికే నష్టమన్నది మొన్నటి ఎన్నికల్లోనే తెలిసిపోయింది. దీంతో పొత్తుతోనే వెళ్లాలన్నది జేడీఎస్ ఆలోచనగా ఉంది. యడ్యూరప్ప రాజకీయంగా రిటైర్ మెంట్ అయితే తాము చక్రం తిప్పవచ్చన్న యోచనతో జేడీఎస్ ఉందంటున్నారు.

కాంగ్రెస్ వేస్ట్ అని…

ఎన్నికల అనంతరం కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నా కుమారస్వామి 14 నెలలకు మించి ముఖ్యమంత్రిగా పనిచేయలేకపోయారు. కాంగ్రెస్ లో క్రమశిక్షణ లేకపోవడం, కట్టుబాట్లు లేమి కారణంగానే అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చిందన్న అభిప్రాయంలో కుమారస్వామి ఉన్నారు. కాంగ్రెస్ ను నమ్ముకుంటే ఎప్పటికీ రాష్ట్రంలో ఎదగలేమని, ముఖ్యమంత్రి పదవి కూడా దక్కడం కష్టమేనన్న ధోరణికి కుమారస్వామి వచ్చారు. అందుకే యడ్యూరప్పకు చేరువ కావాలన్న యోచనలో ఉన్నారు.

ఇద్దరికీ లాభదాయకమే……

ఇటీవల కుమారస్వామి, యడ్యూరప్పల సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. అసంతృప్తి ఉన్న బీజేపీ నేతలను కట్టడి చేసేందుకు యడ్యూరప్పకు ఈ సమావేశం ఉపయోగపడుతుంది. బీజేపీ నుంచి అసంతృప్తి మొదలై అధికారానికి ఎసరు వచ్చే పరిస్థితుల్లో కుమారస్వామి మద్దతు దొరుకుతుంది. అలాగే కుమారస్వామి కూడా వచ్చే ఎన్నికల్లో పొత్తుకు కూడా ఈ సమావేశం పునాది వేసిందని చెబుతున్నారు. తొలుత శిర అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో రెండు పార్టీలూ కలసి పోటీ చేస్తాయంటున్నారు. అదే జరిగితే మరోమారు కర్ణాటక రాజకీయాల్లో అనేక మార్పులు చోటు చేసుకునే అవకాశముంది.

Tags:    

Similar News