ఢిల్లీ వెళితే ఇంత రాద్ధాంతమా?

తెలుగు మీడియా ఎటు పోతుందనే ప్రశ్న అటు పాత్రికేయరంగంలో ఉన్న వారి నుంచి రాజకీయ నేతలు, ప్రజల వరకు చర్చ సాగుతుంది. తాజాగా ఎపి ముఖ్యమంత్రి వైఎస్ [more]

Update: 2019-10-23 03:30 GMT

తెలుగు మీడియా ఎటు పోతుందనే ప్రశ్న అటు పాత్రికేయరంగంలో ఉన్న వారి నుంచి రాజకీయ నేతలు, ప్రజల వరకు చర్చ సాగుతుంది. తాజాగా ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ టూర్ ను వైసిపి – టిడిపి మీడియా లలో చూసిన వారు అవాక్కయ్యే వార్తలు తీవ్ర గందరగోళానికి తెరతీసేలా వున్నాయి. ఎపి లో కొన్ని ఛానెల్స్ పై అనధికార బ్యాన్ ను ప్రభుత్వం కొనసాగించడానికి వారు చేసే ప్రచారమే కారణమని ఈ వార్తలు గమనిస్తే ప్రతి ఒక్కరికి అర్ధం అయ్యేలా మారింది. అసలు ఏం జరుగుతుంది ? ఎలా జరిగింది ? ఎందుకు జరిగింది ? ఎప్పుడు జరిగింది ? ఎక్కడ జరిగింది ? అనే అంశాల్లో ఒక ఛానెల్ కి మరో ఛానెల్ కి పొంతనే లేకపోవడం చూస్తే మీడియా జెండాలు అజెండాలు సామాన్యులకు సైతం అర్ధం అయ్యేలా కనిపిస్తున్నాయి.

గతం నుంచి కేసులు గోలే ….

వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాకముందు ప్రతిపక్ష నేతగా ఉన్నంత కాలం ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా కేసుల మాఫీ కోసమంటూ ఎల్లో మీడియా గట్టిగా అరచి గోల పెట్టేది. నాడు కేంద్రంలో అధికారంలో ఎన్డీయే ఉండగా దాని పార్ట్ నర్ గా ఎపి లో అధికారంలో వున్న టిడిపి ఉండగా ఇదే తంతు సాగేది. అయితే మొన్నటి ఎన్నికల్లో ప్రజలు జగన్ కేసుల అంశాన్ని పట్టించుకున్నదే లేదు. 2014 లో కూడా ప్రజలు వైసిపి అధినేత పై టిడిపి సాగించిన ప్రచారానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్లే ఆయన అధికారానికి దగ్గరగా వచ్చి ఓటమి చెందారు. తిరిగి 2019 ఎన్నికల ముందు టిడిపి తన మీడియా ద్వారా ఇదే ప్రచారం హోరెత్తించినా అఖండ మెజారిటీతో జగన్ అధికారంలోకి వచ్చేశారు. అయినా కానీ టిడిపి లో కానీ ఆ పార్టీని భుజాన మోసే ఒకవర్గం మీడియా లో ఎలాంటి మార్పు లేదు అదే ధోరణి కొనసాగించడమే చర్చనీయాంశం అయ్యింది.

పర్యటన ఇలా వక్రీకరించింది …

తాజాగా జగన్ ఢిల్లీ టూర్ మొదలైనప్పటినుంచి టిడిపి మద్దతు మీడియా ముఖ్యమంత్రిని రొటీన్ గానే టార్గెట్ చేసింది. అమిత్ షా అపాయింట్ మెంట్ రద్దు అయ్యిందని తిరిగి తరువాత రోజు కలిశాక కేవలం అమిత్ షాకు పుట్టినరోజు శుభాకాంక్షలు వరకే సాగిందంటూ దుమ్మెత్తిపోసింది. హోం మంత్రి అపాయింట్ మెంట్ తేడా కొట్టడంతో ఇతర మంత్రులతో జగన్ భేటీలు కూడా క్యాన్సిల్ అయ్యాయని దీనిపై విజయసాయి పైనా, ఎపి వ్యవహారాలు చూసే ప్రవీణ్ ప్రకాష్ పైనా ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారంటూ కొన్ని ఛానల్స్ బ్రేకింగ్ లు కొట్టడం గమనార్హం.

విజయవంతం అయ్యిందన్న వైసిపి …

ముఖ్యమంత్రి జగన్ కేంద్ర హోం మంత్రి అమిత్ షా నడుమ 45 నిమిషాల పాటు భేటీ సాగిందని వైసిపి అధికారికంగా ప్రకటించింది. టిడిపి మీడియా చేస్తున్న ప్రచారం నేపథ్యంలో వైసిపి చివరికి ఈ తరహా ప్రకటన జారీ చేసినట్లు తెలుస్తుంది. జగన్ రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను ప్రస్తావించారని ఇద్దరి నడుమ పార్టీలకు అతీతంగా చర్చ నడిచినట్లు వైసిపి వెల్లడిస్తుంది. పోలవరం రివర్స్ టెండరింగ్ లో వందల కోట్ల రూపాయలు మిగిల్చినందుకు షా ముఖ్యమంత్రిని అభినందించారని తెలిపింది. పోలవరం, అమరావతి, ఎపి కి ప్రత్యేక హోదా ఇవ్వలిసిన అవసరాలను జగన్ షా కు వివరించారని వైసిపి పేర్కొంది.

గందరగోళమే టార్గెట్ ….

తెలుగు మీడియా లో ఒక సమాచారం అందులోను ముఖ్యమంత్రి స్థాయిలో జరిగే పర్యటనపై కూడా ఒకేలా సమాచారం ఉండటం లేదు. తమ అభిమాన పార్టీకి అనుకూలంగా ఎవరికి వారు బాకాలు ఊదేస్తున్నారు. దాంతో ప్రజలకు ఖచ్చితమైన సమాచారం వెళ్లడం లేదు. విపక్ష మీడియా అవలంబిస్తున్న ధోరణి తీవ్ర గందరగోళానికి తెరతీస్తోంది. ఏది నిజం? ఏది అబద్ధం? అన్నది ప్రతి అంశంలోనూ జనం చర్చించుకుంటున్నారు అంటే మీడియా విశ్వసనీయత ఏ స్థాయిలో వుందన్నది తేలిపోతుంది. ఇక సోషల్ మీడియా లో సైతం అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రత్యేక సెల్ లను ఏర్పాటు చేసుకోవడంతో అక్కడ కూడా కంపు కొనసాగుతుంది. ఈ ధోరణి ఎప్పటివరకు కొనసాగుతుందో చూడాలి.

Tags:    

Similar News