కేసుల్లో మీడియా అత్యుత్సాహం ప్రమాదమే కదా … ?

అనారోగ్యకర వాతావరణం రాజ్యమేలుతున్న రంగాల్లో మీడియా కూడా ఒకటిగా మారిపోయింది. పోటీ ప్రపంచంలో ముందుగా తామే ఆ వార్తలను అందించాలనే తపన వ్యాపార ధోరణి అనేక కేసుల్లో [more]

Update: 2020-10-23 09:30 GMT

అనారోగ్యకర వాతావరణం రాజ్యమేలుతున్న రంగాల్లో మీడియా కూడా ఒకటిగా మారిపోయింది. పోటీ ప్రపంచంలో ముందుగా తామే ఆ వార్తలను అందించాలనే తపన వ్యాపార ధోరణి అనేక కేసుల్లో నేరస్థులకు వరంగాను బాధితులకు శాపంగా మారిపోతున్నాయి. ఏదైనా క్రైం సంఘటన జరిగిన వెంటనే పోలీసులు దర్యాప్తు పూర్తి అయ్యేవరకు నెత్తి నోరు కొట్టుకుని కొంత సంయమనం పాటించాలని కోరుతున్నా పట్టించుకునేవారు ఉండటం లేదు. దీనికి తోడు దర్యాప్తు సంస్థలతో పాటు సమాంతర దర్యాప్తు తెలిసి తెలియని అంశాలతో సాగిస్తున్నారు. ఇది సమాజానికి ప్రమాదకరంగా మారుతుంది. ఇటీవల జరిగిన అనేక కేసులతో పాటు తాజాగా జరిగిన దీక్షిత్ కిడ్నాప్ కేసు వరకు ముఖ్యంగా దృశ్యమాధ్యమా మీడియా బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తున్న తీరు సోషల్ మీడియా లో చర్చనీయాంశం అయింది.

కిడ్నాప్, హత్య, దోపిడీ కేసుల్లో …

కిడ్నాప్, హత్య, దోపిడీ, అత్యాచార కేసుల్లో అప్ డేట్ పేరుతో, బ్రేకింగ్ ల పేరుతో అనధికార వార్తలను ఇవ్వడం వల్ల పోలీసుల కదలికలను నేరస్తులు గమనిస్తున్నారు. ఆ సమాచారం తెలుసుకున్న వారు దొరక్కుండా తప్పించుకుంటున్నారు. అంతేకాదు కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలను నాశనం చేస్తున్నారు. ఫలితంగా వివిధ కేసుల్లో నిందితులను పోలీసులు అరెస్ట్ చేసినా కోర్టు ల్లో వారిపై సాక్ష్యాధారాలు నిలవక దర్జాగా బయటపడే అవకాశాలు మీడియా తనకు తెలియకుండానే చేసేపరిస్థితి ఏర్పడింది. దీనివల్ల కేసులను నిరూపించడం పోలీసులకు సవాల్ గా మారింది.

సోషల్ మీడియా కూడా దూకుడే …

ఏదైనా సంఘటన తమ ప్రాంతంలో జరిగితే సంప్రదాయ మీడియా కన్నా ముందే సోషల్ మీడియా స్పందిస్తుంది. దీనివల్ల పోలీసులు మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంఘటన స్థలంలో బయట పెట్టకూడని అనేక కీలక అంశాలను తెలిసి తెలియక సామాజిక వేదికలపై దర్శనం ఇచ్చేస్తున్నాయి. ప్రధాన మీడియా లో వార్త వచ్చే సమయానికే సోషల్ మీడియా లో చర్చలు కూడా పూర్తి అయిపోతున్నాయి. ఈ ధోరణికి ఎలా చెక్ పెట్టాలన్న అంశం ఇప్పుడు పోలీసులకు కొత్త సవాల్ విసురుతుంది. దీనిపై ప్రధాన మీడియా తో పాటు సోషల్ మీడియా లో సైతం కౌన్సిలింగ్ ఇవ్వాలనే ఆలోచన లో పోలీసులు ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఇది ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి. దో చూడాలి.

Tags:    

Similar News