మాయావతి ఎంట్రీతో మారిపోనుందా?

బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ కొత్త పొత్తులు ఏర్పడుతున్నాయి. ప్రధానంగా మాయావతి బీహార్ రాజకీయాల్లో అడుగు పెట్టాలని నిర్ణయించుకున్నారు. బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థులు [more]

Update: 2020-10-06 17:30 GMT

బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ కొత్త పొత్తులు ఏర్పడుతున్నాయి. ప్రధానంగా మాయావతి బీహార్ రాజకీయాల్లో అడుగు పెట్టాలని నిర్ణయించుకున్నారు. బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థులు బీహార్ ఎన్నికల బరిలో ఉంటారని మాయావతి ప్రకటించారు. దీంతో బీహార్ ఎన్నికల్లో కొత్త పొత్తులు సంతరించుకుంటున్నాయి. బీహార్ ఎన్నికల షెడ్యూల్ విడుదలయింది. ఎన్నికల ప్రచారం కూడా మొదలయింది.

ఆర్ఎల్ఎస్పీతో పొత్తు…..

ఇప్పటికే బీజేపీ, జేడీయూ ఒక కూటమిగా, కాంగ్రెస్, ఆర్జేడీ మరో కూటమిగా బరిలోకి దిగాయి. అధికార, విపక్ష కూటములు రెండూ హోరాహోరీ పోరాడుతున్నాయి. అయితే ఈ పరిస్థితుల్లో మాయావతి మరో కూటమిని తెరపైకి తెచ్చారు. రాష్ట్రీయ లోక్ సమతా పార్టీతో మాయావతి పొత్తు పెట్టుకున్నారు. ఈ కూటమి బీహార్ ఎన్నికల్లో పోటీ చేస్తుందని మాయావతి ప్రకటించారు. తాను కూడా బీహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని చెప్పారు.

అన్ని రాష్ట్రాల్లో…..

రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ చీఫ్ ఉపేంద్ర కుశ్వానా తమ ముఖ్యమంత్రి అభ్యర్థి అని మాయావతి ప్రకటించడం విశేషం. ఇప్పటికే మాయావతి అనేక రాష్ట్రాల్లో పోటీ చేశారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్ లలో బీఎస్పీ ఎమ్మెల్యేలు కీలకంగా మారారు. రాజస్థాన్ లో బీఎస్పీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ తన వైపు కలుపుకుంది. 2019 లో జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో జనసేనతో కలసి మాయావతి పొత్తు పెట్టుకున్నారు. కానీ ఏ ఒక్క స్థానాన్ని కూడా బీఎస్పీ గెలుచుకోలేకపోయింది.

ఓట్లను చీల్చడంతో…

మాయావతి దళితుల ఓట్లను చీల్చి అధికార పార్టీకి పరోక్షంగా ఉపయోగపడతారు తప్ప మరొకటి లేదని విపక్షాలు ఆందోళన చెందుతున్నాయి. ఇప్పటికే సామాజిక వర్గాల పరంగా ఓటర్లు బీహార్ లో డిసైడ్ అయిపోయారంటున్నారు. మాయావతి పార్టీ రాకతో కొంత నష్టం జరుగుతుంది విపక్ష పార్టీలకు మాత్రమేనని అధికార పక్షం బీజేపీ, జేడీయూ ధీమాగా ఉన్నాయి. కానీ అధికార పార్టీ ఓటు బ్యాంకుకు కూడా చిల్లుపడుతుందని ఆర్జేడీ భావిస్తుంది. మాయావతి ఎంట్రీతో బీహార్ ఎన్నికల్లో ఎవరికి దెబ్బ పడుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News