Uttar pradesh : మాయావతి స్లో అయింది అందుకేనా?

ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. అన్ని పార్టీలూ ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలు దూకుడు మీద ఉన్నాయి. కానీ ఒకప్పుడు ఉత్తర్ [more]

Update: 2021-11-04 16:30 GMT

ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. అన్ని పార్టీలూ ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలు దూకుడు మీద ఉన్నాయి. కానీ ఒకప్పుడు ఉత్తర్ ప్రదేశ్ రాజకీయాలను శాసించిన బహుజన్ సమాజ్ పార్టీ నేత మాయావతి మాత్రం ఎన్నికలను పట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు. మాయావతి స్ట్రాటజీ పై మిగిలిన రాజకీయ పార్టీల్లో చర్చగా మారింది.

నాడు శాసించి….

ఉత్తర్ ప్రదేశ్ రాజకీయాలను మాయావతి శాసించారు. కాన్షీరామ్ తర్వాత దేశంలో అత్యంత ప్రభావితమైన నేతగా మాయావతి ఆవిర్భవించారు. కానీ దాదాపు పదేళ్లుగా ఆమె రాజకీయాలను చూసిన వారు ఆశ్చర్యపోక మానడం లేదు. రాజీ అన్నది ఎరుగని మాయావతి ప్రతిసారీ ఎన్నికల సందర్భంగా ఆమె తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీ నేతలకే అర్థం కాకుండా ఉన్నాయి. ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలకు ఇంకా ఐదు నెలలు మాత్రమే సమయం ఉంది.

అన్ని పార్టీలూ…

బీజేపీ అధికారంలో ఉండటంతో ఇప్పటి నుంచి మరోసారి పవర్ లోకి వచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తుంది. ప్రధాని నుంచి కేంద్ర మంత్రల వరకూ విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ రధయాత్ర పేరుతో రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. పార్టీ నేతల్లోనూ, క్యాడర్ లోనూ జోష్ నింపుతున్నారు. రాష్ట్రంలో ఉనికిని కోల్పోయినా కాంగ్రెస్ సయితం కష్టపడుతుంది. ప్రియాంక గాంధీ తన సమయాన్ని మొత్తం ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలకే వెచ్చిస్తున్నారు. కానీ మాయావతి మాత్రం మౌనంగానే ఉంటున్నారు.

చివరి నిమిషంలో….

ప్రస్తుతం ఉత్తర్ ప్రదేశ్ లో ఉన్న రాజకీయ పరిస్థితులను అంచనా వేసుకుంటే మాయావతి కాంగ్రెస్ కంటే వెనుకబడి ఉన్నారన్నది విశ్లేషకుల అంచనా. మాయావతికి పట్టున్న దళిత ఓటు బ్యాంకు కూడా కాంగ్రెస్ వైపు మళ్లుతుందంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మాయావతి ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు. అయితే మాయావతి చివరి నిమిషంలో ఎవరితోనైనా పొత్తుకు దిగుతారా? అన్న అనుమానాలు లేకపోలేదు. అందుకే మాయావతి యూపీ రాజకీయాల్లో స్లో అయ్యారన్న కామెంట్స్ వినపడుతున్నాయి. ఇంకా ఎన్నికలకు ఐదు నెలలు సమయం ఉండటంతో మాయావతి స్ట్రాటజీ ఎలా ఉంటుందోనన్న చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది.

Tags:    

Similar News