జనరేషన్ గ్యాప్.. రాజకీయాలు కష్టమేనా?

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు మరో రెండేళ్లలో జరగబోతున్నాయి. అయితే మాయావతి మాత్రం ఎక్కువగా ఢిల్లీలోనే గడుపుతున్నారు. ఇటు సమాజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ [more]

Update: 2021-01-22 17:30 GMT

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు మరో రెండేళ్లలో జరగబోతున్నాయి. అయితే మాయావతి మాత్రం ఎక్కువగా ఢిల్లీలోనే గడుపుతున్నారు. ఇటు సమాజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు సిద్ధమవుతున్నా మాయావతి పార్టీలో మాత్రం ఆ జోష్ కన్పించడం లేదు. ఇప్పటికే మాయావతికి 65 ఏళ్లు వచ్చాయి. బహుశా వచ్చే రెండేళ్లలో జరిగే ఎన్నికల ఫలితాలు ఆమెకు ముఖ్యం. అయితే ఇందుకు భిన్నంగా మాయావతి వ్యవహరిస్తున్నారని బహుజన్ సమాజప్ పార్టీలో విన్పిస్తుండటం విశేషం.

ఒంటిచేత్తో పార్టీని…..

మాయావతి ఒంటి చేత్తో పార్టీని నడిపిస్తారు. అయితే దాదాపు దశాబ్దకాలం నుంచి ఆమె అధికారానికి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇప్పటికే బీఎస్పీలోని అనేక మంది కీలక నేతలు పార్టీకి గుడ్ బై చెప్పేశారు. మరికొందరు ఎన్నికలకు ముందు పార్టీని వీడే అవకాశముందంటున్నారు. అయినా మాయావతి మాత్రం ఇదేమీ పట్టించుకోవడం లేదు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు, రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై కూడా మాయావతి దూకుడుగా వెళ్లడం లేదు.

అనేక సార్లు రాజీ…..

దీంతో ఉత్తర్ ప్రదేశ్ లో మాయావతి పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా ఉంది. మాయావతి దగ్గర ఉన్న లక్షణం ఒక్కటే. అనేక సార్లు రాజీ పడ్డారు. అప్పటికప్పడు తీసుకున్న నిర్ణయాలు పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టాయంటున్నారు. ప్రధాన ప్రత్యర్థి సమాజ్ వాదీ పార్టీతో కూడా మాయావతి గత లోక్ సభ ఎన్నికల వేళ అంటకాగడం పార్టీ క్యాడర్ జీర్ణించుకోలేకపోయింది. దీంతో ఫలితాలు అనుకూలించకపోగా సమాజ్ వాదీ పార్టీ కంటే మాయావతి పార్టీయే ఎక్కువగా దెబ్బతినింది.

రానున్న ఎన్నికల్లో…..

65 ఏళ్ల వయసులో పార్టీని ముందుకు నడిపించడం మాయావతికి కష్టసాధ్యమే. ఇప్పుడు జనరేషన్ మారింది. కేవలం దళిత ఓటు బ్యాంకు పైనే ఆధారపడి రాజకీయాలు చేయడం మైనస్. దళితుల్లో కూడా ఇప్పుడిప్పుడే మాయావతిని వదిలి కాంగ్రెస్ వైపు చూస్తుండటం ఆందోళన కల్గించే అంశమే. ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని మాయావతి ప్రకటించారు. మరి మాయావతి వచ్చే ఎన్నికల్లో గెలుపు సంగతి పక్కన పెడితే కనీస స్థానాలు దక్కించుకుంటారా? అన్నది కూడా అనుమామే.

Tags:    

Similar News