మాయావతికి అదే శాపమా?

ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు ఎంతో దూరం లేవు. అంటే రెండున్నరేళ్లు మాత్రమే సమయం ఉంది. కాంగ్రెస్ ఇప్పటి నుంచే ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలపై దృష్టి పెట్టింది. ప్రత్యేకంగా [more]

Update: 2020-09-20 16:30 GMT

ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు ఎంతో దూరం లేవు. అంటే రెండున్నరేళ్లు మాత్రమే సమయం ఉంది. కాంగ్రెస్ ఇప్పటి నుంచే ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలపై దృష్టి పెట్టింది. ప్రత్యేకంగా కమిటీని కూడా వేసింది. ప్రియాంక గాంధీ అక్కడే ఉండి క్యాడర్ ను ఎన్నికలకు సిద్ధం చేసే పనిలో ఉన్నారు. అధికార బీజేపీ సంగతి చెప్పనవసరం లేదు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధమేనని ప్రకటించింది. ఇక అఖిలేష్ యాదవ్ కూడా త్వరలో సైకిల్ యాత్రకు సిద్దమవుతున్నారన్న వార్తలు వస్తున్నాయి. మరి మరోనేత మాయావతి సంగతి ఏంటి?

బలమైన నేతగా……

ఉత్తర్ ప్రదేశ్ లో బలమైన నేత మాయావతి. దళిత ఓటు బ్యాంకుతో అధికారంలోకి వచ్చిన మాయావతిపై గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి. ఆస్తులు భారీగా కూడబెట్టారన్న ఆరోపణలను కూడా ఎదుర్కొన్నారు. తాజ్ కుంభకోణం కూడా అందులో ఒకటి. బహుజన్ సమాజ్ పార్టీని మాయావతి జాతీయ పార్టీగా తీర్చి దిద్దారు. అయితే ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు మాయావతి పార్టీకి కాలం చెల్లిందంటున్నారు విశ్లేషకులు.

తన ఓటు బ్యాంకులోనూ…..

దేశంలోనూ ఎక్కడా ఏవిధమైన ప్రభావం చేయలేని స్థితిలో మాయావతి ఉన్నారు. ఉత్తర్ ప్రదేశ్ లోనూ అంతే. వరస తప్పిదాలు మాయావతిపై దళితుల్లోనూ నమ్మకం లేకుండా చేశాయంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో విడిగా పోటీ చేసిన మాయావతి, పార్లమెంటు ఎన్నికలకు వచ్చేసరికి తన దీర్ఘకాల ప్రత్యర్థి అయిన సమాజ్ వాదీ పార్టీతో పొత్తు పెట్టుకోవడాన్ని దళితులే తప్పుపడుతున్నారు. దీన్నుంచి బయటపడటానికే మాయావతి ఇక ఒంటరిపోరే అని ప్రకటిస్తున్నారు.

ఈసారి కూడా అంతేనా?

మాయవతి వయసు, ఆరోగ్య రీత్యా కూడా పెద్దగా పర్యటించడం లేదు. దళిత ఓటు బ్యాంకును కాంగ్రెస్ ఎక్కడ తన్నుకుపోతుందోనన్న ఆందోళనలో మాయావతి ఉన్నారు. అందుకే అధికారంలో ఉన్న బీజేపీని కాదని, కాంగ్రెస్ పై విమర్శలు చేస్తున్నారని కూడా అభిప్రాయపడుతున్నారు. గత శాసనసభ, పార్లమెంటు ఎన్నికల్లోనే ఎలాంటి ప్రభావం చూపలేని మాయవతికి ఈసారి కూడా అదే పరిస్థితి తప్పదంటున్నారు. మాయావతి నిర్ణయాలే ఆమెకు శాపంగా పరిణమించాయంటున్నారు.

Tags:    

Similar News