మాయావతి స్ట్రాటజీ అర్థం కావడం లేదే?

బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి ఈసారి ఒంటరిగానే ఎన్నికల బరిలో నిలవనున్నట్లు వెల్లడించారు. ఏ పార్టీతో ఎటువంటి పొత్తులుండవని మాయావతి ఇప్పటికే ప్రకటించారు. మాయావతి ఒంటరిగా [more]

Update: 2020-07-03 17:30 GMT

బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి ఈసారి ఒంటరిగానే ఎన్నికల బరిలో నిలవనున్నట్లు వెల్లడించారు. ఏ పార్టీతో ఎటువంటి పొత్తులుండవని మాయావతి ఇప్పటికే ప్రకటించారు. మాయావతి ఒంటరిగా పోటీ చేసి వచ్చే అసెంబ్లీ లో గెలిచే ఛాన్స్ ఉంటుందా? అన్నది సందేహమే అయినా ఆమె మాత్రం 2022 అసెంబ్లీ ఎన్నికలకు క్యాడర్ ను సిద్ధం చేసే పనిలో ఉన్నారు. అందరి వ్యక్తిగా ఉండాలన్నది మాయావతి అభిప్రాయంగా కన్పిస్తుంది.

అందరితో పొత్తు పెట్టుకుని…..

ఉత్తర్ ప్రదేశ్ లో మాయావతి ఒక బీజేపీతో తప్ప అందరితో పొత్తు పెట్టుకున్నారు. తన చిరకాల ప్రత్యర్థి అయిన సమాజ్ వాదీ పార్టీతో కూడా పొత్తు పెట్టుకున్నారు. అయితే ఈ ప్రయోగం ఫలించలేదు. గత పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని కూడా పక్కన పెట్టారు. అయినా ఫలితం లేదు. అయితే ఉత్తర్ ప్రదేశ్ లో ఉన్న తన ఓటు బ్యాంకును కాంగ్రెస్, ఎస్పీలు కొల్లగొడతాయామోనన్న ఆందోళన మాయావతిలో ఉంది.

వాటికి దూరంగా…..

అందుకే కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలకు మాయావతి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తన ఓటు బ్యాంకును పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా ప్రియాంక గాంధీ ఉత్తర్ ప్రదేశ్ పై ప్రత్యేక దృష్టిపెట్టారు. అందుకే మాయావతి గత కొంతకాలంగా ప్రియాంక గాంధీని టార్గెట్ చేసుకున్నారు. ఇటీవల రాజస్థాన్ లోని కోటాలో వంద మంది చనిపోతే అక్కడకు వెళ్లని ప్రియాంక గాంధఈ ఇక్కడసీఏఏ అల్లర్ల లోమరణించిన వారి కుటుంబాలను పరామర్శించడానికి వస్తారని మాయావతి ఎద్దేవా చేశారు. ప్రియాంక ప్రతి కదలిక మీద కూడా ఆమె వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. కాంగ్రెస్ నిర్వహించే అఖిలపక్ష సమావేశానికి కూడా ఆమె వెళ్లడం మానుకున్నారు.

బీజీపికి దగ్గరగా….

ఇదే సమయంలో మాయావతి బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ప్రకటిస్తుండటం విశేషం. బీజేపీ తీసుకున్న అనేక నిర్ణయాలకు మాయావతి మద్దతు ప్రకటించారు. కరోనా సమయంలో మోడీ తీసుకున్న చర్యలను మాయావతి సమర్థించారు. అలాగే తాజాగా ఇండియా చైనా సరిహద్దు అంశంపై కూడా బీజేపీకి బాసటగా నిలుస్తామని ప్రకటించారు. తనకు మిత్రులైన కాంగ్రెస్, ఎస్సీలకు దూరంగా ఉంటూ శత్రువైన బీజేపీకి మాయావతి దగ్గరవుతున్నట్లే కన్పిస్తుంది. మరి మాయావతి స్ట్రాటజీ ఏంటో అర్థం కాక సొంత పార్టీ నేతలే జుట్టు పీక్కుంటున్నారట.

Tags:    

Similar News