ఎంత చేసినా కష్టమేనా….??

ఉప ఎన్నికలు వేరు… సాధారణ ఎన్నికల వేరు. ఉప ఎన్నికలు కేవలం రెండు మూడు నియోజకవర్గాలకు మాత్రమే పరిమితమవుతాయి. సాధారణ ఎన్నికలు అలా కాదు. అప్పుడు వచ్చినట్లుగా [more]

Update: 2019-03-23 18:29 GMT

ఉప ఎన్నికలు వేరు… సాధారణ ఎన్నికల వేరు. ఉప ఎన్నికలు కేవలం రెండు మూడు నియోజకవర్గాలకు మాత్రమే పరిమితమవుతాయి. సాధారణ ఎన్నికలు అలా కాదు. అప్పుడు వచ్చినట్లుగా ఫలితాలు సాధారణ ఎన్నికల్లో రావాలంటే సాధ్యం కాదన్నది చరిత్ర చెబుతున్న సంగతి. ఉత్తరప్రదేశ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ఇక్కడ ఎవరు అధిక స్థానాలు దక్కించుకుంటారో వారిదే ఢిల్లీ పీఠం అని చెప్పకతప్పదు. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ లో ఎన్నికలకు ముందుగానే కుదిరిన పొత్తులు పండుతాయా? లేదా? అన్నది పార్టీ నేతలకు సయితం బోధపడలేదు.

త్రిముఖ పోరులో….

ఉత్తర ప్రదేశ్ లో ఇప్పుడు త్రిముఖ పోరు నెలకొనే అవకాశముంది. బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్ వాదీ పార్టీ కలసి పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీలు ఒంటరిగా తలపడుతున్నాయి. కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీల మధ్య అంతర్గత అవగాహన అయితే కుదిరింది. ఆ యా పార్టీలకు చెందిన ప్రముఖులు పోటీ చేసే స్థానాల్లో తాము అభ్యర్థులను దించబోమని ఇప్పటికే మూడు పార్టీలు ప్రకటించుకున్నాయి. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ దశాబ్దాలుగా శత్రువులుగా ఉన్న పార్టీల నేతలు ఏకమయితే క్యాడర్ ఒకటవుతుందా? అన్నదే ప్రశ్న.

కుల రాజకీయాలే…

ఎందుకంటే ఉత్తరప్రదేశ్ లో కుల రాజకీయాలు బలంగా ఉంటాయి. కులాల ఆధారంగానే ఓటు బ్యాంకు ఉంటుంది. ప్రాంతీయ పార్టీలు కూడా కులాల ఆధారంగానే ఏర్పడ్డాయి. ఇప్పుడు మాయావతి, అఖిలేష్ యాదవ్ లు ఏకమైతే మొత్తం సీట్లను స్వీప్ చేయాల్సిన పరిస్థితి. కానీ యూపీలో నెలకొన్న పరిస్థితులను చూస్తుంటే అది సాధ్యమనిపించడం లేదు. మాయావతి, అఖిలేష్ యాదవ్ లు కలిసిపోయినా వారు ఓటు బ్యాంకుగా భావిస్తున్న కులాల ఓట్లు కలిసిపోయాలే లేవన్నది ఇద్దరిలోనూ ఆందోళన కల్గించే అంశం. కాంగ్రెస్ ప్రభావంతో కూడా ఈ రెండు పార్టీల ఓట్లు చీలే ప్రమాదం ఉంది.

బీజేపీకి అవకాశాలు….??

మరోవైపు ఇక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. గత లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ71 సీట్లు సాధించింది. కానీ ఇప్పుడు అంత సంఖ్యలో సీట్లు రాకున్నప్పటికీ యాభై స్థానాలకు పైగానే సాధించే అవకాశముందన్నది విశ్లేషకుల అంచనా. మూడు పార్టీల ఓటు బ్యాంకు ఒకరికి మరొకరికి బదిలీ కాదన్న నమ్మకంతో బీజేపీ ఉంది. ఇప్పుడు మాయావతి, అఖిలేష్ ముందున్న లక్ష్యమొక్కటే. తొలుత క్యాడర్ ను ఏకం చేసే పనిలో ఉండాలి. తర్వాత ఓటు బ్యాంకు బదిలీ అయ్యేలా చూసుకోవాలి. అది జరిగితేనే మాయావతి కూటమికి లాభం. లేకుంటే బీజేపీ సీట్లను ఎగరేసుకు పోయే ఛాన్సు ఉంది.

Tags:    

Similar News