మత్తువదలరా మూవీ రివ్యూ

నటీనటులు: శ్రీ సింహ, సత్య, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, అజయ్,విద్యుల్లేఖ, నరేష్ అగస్త్య, అతుల్య చంద్ర తదితరులు మ్యూజిక్ డైరెక్టర్: కాల భైరవ సినిమాటోగ్రఫీ: సురేష్ సారంగం [more]

Update: 2019-12-25 06:26 GMT

నటీనటులు: శ్రీ సింహ, సత్య, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, అజయ్,విద్యుల్లేఖ, నరేష్ అగస్త్య, అతుల్య చంద్ర తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్: కాల భైరవ
సినిమాటోగ్రఫీ: సురేష్ సారంగం
ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్
నిర్మాత: చిరంజీవి, హేమలత
దర్శకత్వం: రితేష్ రానా

టాలీవుడ్ ఇండస్ట్రీలో రాజమౌళి ఫ్యామిలీ చరిత్ర తెలియని వారే ఉండరు. రాజమౌళి కాంపౌండ్ నుండి సినిమా వస్తుంది అంటేనే అందరి చూపు ఆ సినిమా వైపే ఉంటుంది. రాజమౌళి కొడుకు కార్తికేయ, భార్య రమ, ఆయన అన్న కీరవాణి, భార్య, కొడుకు కాల భైరవ, శ్రీ సింహ, రాజమౌళి కజిన్స్ అందరూ సినిమాల్లో అనేక డిపార్మ మెంట్స్ లో పని చేస్తున్నారు. ఇక కీరవాణి రాజమౌళి ఆస్థాన మ్యూజిక్ డైరెక్టర్, కీరవాణి కొడుకు కాల భైరవ కూడా మ్యూజిక్ డైరెక్టర్. కానీ కీరవాణి మరో కొడుకు శ్రీ సింహ హీరో గా ఎంట్రీ ఇచ్చాడు. మత్తువదలరా అనే కామెడీ ఎంటెర్ టైనర్ తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. మరి రాజమౌళి ఫిల్మీ బ్యాక్ డ్రాప్ తో హీరో వస్తున్నాడు అంటే ఆ సినిమాపై ఎంతగా అంచనాలు పెరగాలి. అయితే శ్రీ సింహ, సత్య, నరేష్ అగస్త్య లు ముగ్గురు ఫ్రెండ్స్ తో కలిసి దర్శకుడు రితేష్ రానా మత్తువదలరా అనే సినిమా తెరకెక్కుతున్నట్లుగా గత నెల వరకూ ఎవరికీ తెలియదు. కానీ మైత్రి మూవీస్ సహకారంతో రితేష్ రానా ప్రస్తుతం యూత్ ఎదుర్కుంటున్న ఇబ్బందులను సినిమా రూపంలో మలిచాడు. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ నుండే సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. అందులోను రాజమౌళి కాంపౌండ్ నుండి హీరో అనగానే అందరిలో స్పెషల్ ఇంట్రెస్ట్ వచ్చేసింది. మరి భారీ ప్రమోషస్న్ తో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన మత్తువదలరా సినిమా ఎలా ఉందొ సమీక్షలో చూసేద్దాం.

కథ:

బాబు మోహన్ అలియాస్ బాబు (శ్రీ సింహ) యేసు దాస్(సత్య) నరేష్ అగస్త్య ముగ్గురు రూమ్ మేట్స్. అయితే బాబు, యేసు లు డెలివరీ బాయ్స్ గా చిన్నపాటి ఉద్యోగం చేస్తూ నెలకి కటింగ్స్ అన్నిపోను నాలుగు, మూడు వేలు సంపాదిస్తుంటారు. ఆ వచ్చిన శాలరీ ఇంటి రెంట్ కి మాత్రమే సరిపోతుంది. అందులో కనీసం ఇంటికి పంపడానికి బాబు సతమతమవుతుంటారు. రెంట్ పోను మిగిలిన వెయ్యి రూపాయలతో.. బార్లో తప్పతాగి.. ఈ ఉదయాన్నే మానేస్తా అంటూ బాబు, యేసు తో చెప్తాడు. కానీ యేసు.. బాబు చేతిలో ఐదు వేలు పెట్టి.. అమ్మకి పంపు, ఉద్యోగం మనకూ.. ఈ ఒక్క రోజు నాతో ఉండి డెలివరీ విషయంలో మెళుకువలు నేర్చుకో అంటూ.. కష్టమర్స్ నుండి డబ్బులు టిప్స్ రూపంలో ఎలా తస్కరించాలో చెప్తుంటాడు. ఇక వీరిద్దరూ ఇలా రోడ్ల మీద తిరుగుతుంటే.. నరేష్ మాత్రం రూమ్ లోనే కూర్చుని హాలీవుడ్ మూవీస్, సీరియల్స్ చూస్తుంటాడు. అయితే బాబు కూడా యేసు చెప్పింది మొదట్లో నచ్చకపోయినా.. చివరికి యేసు రూట్ లోకి వెళ్లాలని నిర్ణయించుకుని.. ఆ క్రమంలోనే పెరిగిన గెడ్డాన్ని నీట్ గా షేవ్ చేసుకుని, మంచి డ్రెస్ వేసుకుని గెటప్ మొత్తం మార్చేసి సరుకు డెలివరీ ఇవ్వడానికి ఓ రిచ్చెస్ట్ అపార్ట్మెంట్ కి వెళ్తాడు. అయితే అక్కడ బాబు అనుకోకుండా ఓ మర్డర్ చేస్తాడు. దానితో ఎలా తప్పించుకోవాలో తెలియక ఫ్రెండ్స్ సలహా అడుగుతాడు. అసలు బాబు మర్డర్ ఎలా, ఎందుకు చేసాడు? యేసు, నరేష్ ఇద్దరు బాబు కి ఎలాంటి హెల్ప్ చేసారు? అసలు ఆ మర్డర్ మిస్టరీ వెనకున్న రహస్యం ఏమిటి? అలాగే వీరి కథకు మత్తువదలరా టైటిల్ కి ఉన్న సంబంధం ఏమిటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటులు:

ఇందులో హీరో అంటూ ప్రత్యేకించి చెప్పలేం. కీరవాణి కొడుకు శ్రీ సింహ హీరో, సత్య కమెడియన్. బట్ ఇద్దరూ చేసిన నేచురల్ కామెడీ సూపర్బ్. శ్రీ సింహ అయితే నేచురల్ నటనతో, ఫేస్ ఎక్సప్రెషన్స్ తో ఇరగదీసాడు. మొదటిసారి స్క్రీన్ ముందుకు వచ్చినట్టుగా లేదు.. చాలా సినిమాల అనుభవం ఉన్న నటుడిగా శ్రీ సింహ నటన అబ్బుర పరుస్తుంది. మర్డర్ చేసానని పొరబడినప్పుడు, తెలియకుండా డ్రగ్స్ కలిపిన వాటర్ తగి డ్రగ్స్ మత్తులో కి వెళ్ళినప్పుడు, సత్య, నరేష్ తో కలిసి ఉన్న కాంబో సీన్స్ లోను శ్రీ సింహ ఫేస్ ఎక్సప్రెషన్స్ ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇక మరో మెయిన్ లీడ్ సత్య. కమెడియన్ సత్య చాలా సినిమాల్లో కామెడీ చేసాడు కానీ.. మత్తువదలరా సినిమాలో సత్య చేసిన కామెడీ సినిమాకే హైలెట్. సత్య కామెడీ టైమింగ్ సూపర్. దొంగతనం కాదు, తస్కరించడం అని చెప్పిన డైలాగ్స్ కి థియేటర్స్ లో పడి పడి నవ్వాల్సిందే. ఇక మరో మెయిన్ కేరెక్టర్ నరేష్ అగస్త్య కూడా రూమ్ మేట్ గా ఫ్రెండ్లీగా ఉంటూనే.. ఫ్రెండ్స్ కి వెన్నుపోటు పొడిచే కేరెక్టర్ లో అద్భుతమైన నటన కనబర్చాడు. పావలా శ్యామలా, ఇక వెన్నెల కిషోర్ కేరెక్టర్ కూడా ఉన్నంతలో కామెడీ పండించింది. అలాగే విద్యుల్లేఖ కామెడీ, అతుల్య చంద్ర డ్రగ్ డీలర్ గా అద్భుతమైన నటన కనబర్చారు. మిగతా నటీనటులు తమ పరిధిమేర ఆకట్టుకున్నారు.

విశ్లేషణ:

సినిమాల్లో ఓ పాట, ఓ ఫైట్, హీరోయిన్ తో రొమాంటిక్ సీన్స్ ఉంటేనే యూత్ కానీ, సాధారణ ప్రేక్షకులు కానీ సినిమాలు చూస్తున్నారు. అసలు హీరోయిన్ లేకుండా.. పాటలే లేకుండా సినిమా అంటే కాస్త రిస్క్ చెయ్యడమే. మరి కొత్త కథతో, హీరోయిన్ కానీ, పాటలు కానీ లేకుండా యూత్ ఫుల్ కాన్సెప్టు తో కొత్త దర్శకుడు రితేష్ రానా, కీరవాణి తనకుడు సింహ తో మత్తువదలరా అంటూ సినిమా తెరకెక్కించాడు. అసలు రాజమౌళి కుటుంబం నుంచి వారసుడు అంటే అంచనాలు ఓ రేంజ్ లో ఉంటాయి. కావాల్సినంత కమర్షియల్ ప్యాకేజీ ఇంట్లోనే ఉండటంతో.. అనుకుంటే పక్క మాస్ సినిమా చేయొచ్చు కానీ సింహ కోడూరి.. పాటలు లేకుండా.. హీరోయిన్ లేకుండా..కొత్త ప్రయత్నంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. చేతిలో పైసా లేని బీదరికంలో ఉన్న కుర్రాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుందో.. అవసరం ఎలాంటి పనైనా చేపిస్తుంది అనే విషయానికి కామెడి టచ్ ఇచ్చాడు దర్శకుడు. ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్లు కాస్త సాగదీసినట్లు అనిపించినా సత్య కామెడీ మాత్రం కడుపు చెక్కలయ్యేలా నవ్వించింది. కష్టమర్స్ నుండి టిప్స్ ఎలా తీసుకోవాలో సత్య చెప్పడం, సింహ అది దొంగతనం అవుతుంది అంటే సత్య కాదు తస్కరించడం అనడం, పావలా శ్యామల సింహ తో చేసిన అల్లరి కామెడీ కూడా ఆకట్టుకునేలా వుంది. వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ మధ్య ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ఇక పావలా శ్యామల ని మర్డర్ చేశాననుకుని భ్రమలో ఉన్న సింహ ఫ్రెండ్స్ ని హెల్ప్ అడగడం, వారు వచ్చేలోపే సింహ మరో మర్డర్ లో చిక్కుకుని పారిపోయి రూమ్ కి రావడం అంతా నేచురల్ గా అనిపిస్తుంది. ఇక డబ్బు దొరికితే సత్య పారిపోదామని, నరేష్ వద్దని అంటుంటే.. కాదు పోలీస్ స్టేషన్స్ కి వెళదామని సింహ చెప్పడం, వద్దు ముందు అపార్ట్ మెంట్ కి వెళ్లి.. అసలేం జరిగిందో చూద్దాం అంటూ బయలు దేరడం అక్కడ క్లూ కోసం వెదుకుతూ.. మర్డర్ కేసు ని సాల్వ్ చేసే పనిలో డ్రగ్స్ తయారు చేసే వారిని కనుక్కుని.. తన ఫ్రెండ్ తమని మోసం చేసాడని తెలుసుకుని.. ఆ డ్రగ్స్ తయారీని నాశనం చెయ్యడం, ఇలా అన్ని విషయాలకు కామెడీ టచ్ ఇస్తూ కథని బోర్ కొట్టకుండా లాగించేసాడు. ఇంటర్వెల్ తర్వాత కథ ఆసక్తికరంగా మారింది.. స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది. అయితే కమర్షియల్ సినిమా ఇష్టపడే వాళ్లకు ఈ మత్తువదలరా సినిమా ఎక్కకపోవచ్చు కానీ.. రొటీన్ కి భిన్నంగా కోరుకునే ఆడియన్స్ కు ఈ సినిమా మంచి ఛాయిస్.. ఓవరాల్ గా మత్తు వదలరా.. ప్రేక్షకులకు కామెడీ మత్తెక్కిస్తుంది.

సాంకేతికంగా…

కాల భైరవ తండ్రికి తగ్గ తనయుడు. మత్తువదలరా సినిమా మెయిన్ ప్లస్ పాయింట్స్ లో నేపధ్య సంగీతం ఉంటుంది. కామెడీ సీన్స్ కి అనుగుణంగా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ దంచేసాడు. సిచ్యూవేషన్‌కు తగ్గట్టుగా బ్యాక్ గ్రౌండ్‌లో వేరియేషన్స్ చూపిస్తూ కొత్త తరహా మ్యూజిక్ అందించారు. హుడ్ జానర్‌ బేస్ చేసుకుని బ్యాగ్ గ్రౌండ్ వచ్చే హు.. హు.. అనే ఆర్ ఆర్ సినిమాకే హైలైట్ అని చెప్పాలి. కాకపోతే ఈ సినిమాలో పాటలకు ప్లేస్ లేదు. ఉన్న ఒక్క పాట మత్తువదలరా… పాత బ్యాగ్రౌండ్ లోనే కలిసిపోయింది. అయినా అద్భుతంగా వుంది. సురేష్ సారంగం కెమెరా ప‌నిత‌నం ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపిస్తుంది. చాలా వరకూ సినిమాను ఒక అపార్ట్‌మెంట్‌లోనే తీసినా.. ప్రతి ఫేమ్‌ను కొత్తగా చూపించారు. ఎ.ఎస్‌.ప్ర‌కాష్ ఆర్ట్ వ‌ర్క్, కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ బాగా కుదిరాయి. రన్ టైం 2.10 నిమిషాలే కావడంతో బోర్ కొట్టకుండా క్రిస్పీగా అనిపించింది. ఈ చిత్రంలో భారీ హంగామా లేకుండా కథానుగుణంగానే నిర్మాణ విలువలు ఉన్నాయి. తక్కువ బడ్జెట్‌లో కథకు ఏం కావాలో అది ఇచ్చారు నిర్మాత చిరంజీవి.

 

రేటింగ్: 3.0/5

Tags:    

Similar News