ఆ వైసీపీ నేత‌కు మంచి రోజులొచ్చేనా.. ఇప్పటికైనా ప‌ద‌వి ద‌క్కేనా?

గుంటూరు జిల్లా చిల‌క‌లూరిపేట‌కు చెందిన వైసీపీ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌కు మంచి రోజులు రానున్నాయా ? ఇప్ప‌ వ‌ర‌కు ఆయ‌న‌ను ప‌ట్టించుకోలేద‌న్న అప‌వాదును తుడిచి [more]

Update: 2020-08-08 13:30 GMT

గుంటూరు జిల్లా చిల‌క‌లూరిపేట‌కు చెందిన వైసీపీ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌కు మంచి రోజులు రానున్నాయా ? ఇప్ప‌ వ‌ర‌కు ఆయ‌న‌ను ప‌ట్టించుకోలేద‌న్న అప‌వాదును తుడిచి పెట్టేందుకు వైఎస్సార్ సీపీ అధినేత జ‌గ‌న్ దూకుడు నిర్ణయం తీసుకుని, మంచి ప‌ద‌విని ఇచ్చేందుకు పావులు క‌దుపుతున్నారా ? త‌న మాట‌ను నిల‌బెట్టుకునేందుకు కీల‌క‌మైన ప‌ద‌విని మ‌ర్రికి క‌ట్టబెట్టనున్నారా ? అంటే.. ఔన‌నే అంటున్నాయి వైసీపీ వ‌ర్గాలు. జ‌గ‌న్ చెప్పినట్టు సీటు త్యాగం చేసిన‌ప్ప‌టి నుంచి మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌ పార్టీలో మంచి ప‌ద‌వి ద‌క్క‌క‌పోదా ? అని ఎంతో ఆశ‌తో వెయిట్ చేస్తున్నారు. జ‌గ‌న్ ఏకంగా ఎమ్మెల్సీతో పాటు మంత్రి ప‌ద‌వి ఇస్తాన‌ని బ‌హిరంగ హామీ ఇచ్చి యేడాది దాటుతున్నా ఇప్పటి వ‌ర‌కు అది అతీ గ‌తీ లేదు.

కొత్తగా ఏర్పాటయ్యే…..

ఇక ఇప్పుడు వ‌రుస‌గా రాజ్యసభ‌, ఎమ్మెల్సీలు, కేబినెట్ ప‌ద‌వుల భ‌ర్తీలు, నామినేటెడ్ ప‌ద‌వుల‌ను వ‌రుస‌గా భ‌ర్తీ చేస్తూ వ‌స్తున్నారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో పార్లమెంటు నియోజ‌క‌వ‌ర్గాల ప్రాతిప‌దిక‌న కొత్త జిల్లాల ఏర్పాటుకు జ‌గ‌న్ శ్రీకారం చుట్టారు. అయితే, వీటికి కొంత స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉంది. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి నుంచి జ‌నాభా లెక్కలు జ‌ర‌గ‌నున్నాయి. ఈ ప్రక్రియ పూర్తయిన త‌ర్వాత‌.. అంటే మార్చి త‌ర్వాత‌.. జిల్లాల ఏర్పాటు ఉంటుంది. అయితే, వీటిక‌న్నా ముందుగానే ప్రాంతీయ మండ‌ళ్లను ఏర్పాటు చేయాల‌ని స‌ర్కారు నిర్ణయించుకుంది. విజ‌య‌న‌గ‌రం, కాకినాడ‌, గుంటూరు, క‌డ‌ప ప్రాంతీయ మండ‌ళ్లను ఏర్పాటు చేయ‌నున్నారు. ఈ నాలుగు ప్రాంతీయ మండ‌ళ్ల ప‌రిధిలోకి రాష్ట్రం మొత్తం వ‌స్తుంది. ఆయా ప్రాంతాల అభివృద్ధి, కొత్త ప్రాజెక్టులు ఇలా.. ఏ కార్యక్రమమైనా కూడా ఈ మండ‌ళ్ల ఆధ్వర్యంలోనే జ‌ర‌గ‌నుంది.

ప్రాంతీయ మండలి ఛైర్మన్ గా…..

ఈ మండ‌ళ్లకు చైర్మన్లను నియ‌మించ‌నున్నారు. కీల‌క బాధ్యత‌లు, అధికారాల‌ను వీరికి క‌ట్టబెట్టనున్నారు. అంతేకాదు, ఈ చైర్మన్‌ల‌కు కేబినెట్ హోదా కూడా క‌ల్పించ‌నున్నారు. ఇలా ఏర్పాటు చేయ‌నున్న గుంటూరు ప్రాంతీయ మండ‌లికి చైర్మన్‌గా మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌ను నియ‌మించాల‌ని జ‌గ‌న్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో చిల‌క‌లూరిపేట టికెట్‌ను మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌ త్యాగం చేశారు. దీంతో ఆయ‌న‌కు మంత్రిగా ప్రమోష‌న్ ఇస్తాన‌ని జ‌గ‌న్ హామీ ఇచ్చారు. అయితే, సామాజిక స‌మీక‌ర‌ణ‌లు స‌రిపోని నేప‌థ్యంలో మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌ని ఇప్పటి వ‌ర‌కు జ‌గ‌న్ ప‌ట్టించుకోలేదు. ఈ నేప‌థ్యంలోనే ప్రాంతీయ మండ‌లి చైర్మన్‌గా ఆయ‌న‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

ఆయన మాత్రం…..

విజ‌య‌న‌గ‌రం ప్రాంతీయ మండ‌లిని బీసీల‌కు, కాకినాడ మండ‌లిని కాపుల‌కు, గుంటూరు ప్రాంతీయ మండలి ప‌ద‌విని క‌మ్మ వ‌ర్గమైన మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌కు ఇవ్వడంతో పాటు క‌డ‌ప ప్రాంతీయ మండ‌లిని రెడ్డి వ‌ర్గానికి క‌ట్టబెట్టాల‌ని జ‌గ‌న్ నిర్ణయం తీసుకున్నార‌ని వార్తలు వ‌స్తున్నాయి. జ‌గ‌న్ నిర్ణయం ఎలా ఉన్నా మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌ మాత్రం ఎమ్మెల్సీతో పాటు త‌న‌కు జ‌గ‌న్ ఇచ్చిన మంత్రి ప‌ద‌వి హామీ వ‌స్తుంద‌న్న ఆశ‌తో ఉన్నారు.

Tags:    

Similar News