మర్రికి ఇక మంచిరోజులేనట.. జగన్ చెప్పారట

గుంటూరు జిల్లా చిల‌క‌లూరి పేట వైసీపీ రాజ‌కీయాల్లో స్పష్టమైన మార్పులు క‌నిపిస్తున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇప్పటి వ‌ర‌కు ఇక్కడ చ‌క్రం తిప్పిన‌.. ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జ‌నీ.. ఎంత [more]

Update: 2021-02-14 12:30 GMT

గుంటూరు జిల్లా చిల‌క‌లూరి పేట వైసీపీ రాజ‌కీయాల్లో స్పష్టమైన మార్పులు క‌నిపిస్తున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇప్పటి వ‌ర‌కు ఇక్కడ చ‌క్రం తిప్పిన‌.. ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జ‌నీ.. ఎంత దూకుడు చూపించిందో అంద‌రికీ తెలిసిందే. బీసీ కార్డును వాడుకుని అతి త‌క్కువ స‌మ‌యంలో ఎలివేట్ అయింది. ఒకానొక ద‌శ‌లో ఆమె బీసీ + మ‌హిళా కోటాలో మంత్రి కాబోతున్నార‌న్న ప్రచారం కూడా జోరుగా న‌డిచింది. అటు బీసీ సంఘాల్లోనూ ఆమె కీల‌కంగా వ్యవ‌హ‌రిస్తున్నారు. ఇదిలా ఉంటే ఆమె కోసం టికెట్ త్యాగం చేసి.. పైగా ప్రచారం చేసి గెలిపించిన సీనియ‌ర్ నాయ‌కుడు మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ స‌హా.. ఓ వ‌ర్గాన్ని ఆమె క‌డు దూరం పెట్టింది. ఇదంతా కూడా రాజ‌కీయ వ్యూహ‌మేన‌ని అంటారు ప‌రిశీల‌కులు.

ఆ హామీని ఇప్పటి వరకూ…

ఫ‌లితంగా మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌కు ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీ అధినేత‌గా జ‌గ‌న్ ఇచ్చిన మంత్రి హామీ ఇప్పటి వ‌ర‌కు నెర‌వేర‌లేదు. పేట వైసీపీలో ఉన్న గ్రూపు రాజ‌కీయాలు కూడా ఆయ‌న్ను వ్యూహాత్మకంగా ప‌క్కన పెట్టేలా చేశాయి. తాజాగా స్థానిక ఎన్నిక‌లు రావ‌డంతో ర‌జ‌నీ ప‌క్కన పెట్టిన వ‌ర్గాలు అన్నీ స‌మైక్యం అవుతున్నాయి. అదే స‌మ‌యంలో ఎంపీ లావు కృష్ణదేవ‌రాయులు కూడా మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ కి అనుకూలంగా వ్యవ‌హ‌రిస్తున్నారు. ముఖ్యంగా చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గంలో అంద‌రూ రైతు బాంధ‌వుడు, ఎత్తిపోత‌ల ప‌థ‌కాల రూప‌కర్తగా పేరున్న మ‌ర్రి మామ‌, మాజీ ఎమ్మెల్యే సోమేప‌ల్లి సాంబ‌య్య వ‌ర్థంతి హైలెట్ అయ్యింది.

మర్రి విషయంలో….

ద‌శాబ్దాలుగా సాంబ‌య్య, ఆ త‌ర్వాత మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ వ‌ర్గంగా ఉన్న వారికి ఇప్పుడు ఎంపీ లావు రూపంలో బ‌ల‌మైన స‌పోర్ట్ దొరికింది. ఎంపీ లావు సైతం ఎంత బిజీగా ఉన్నా చిల‌క‌లూరిపేట‌పై ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ ఉండ‌డంతో పాటు త‌న వ‌ర్గాన్ని స్ట్రాంగ్ చేసుకుంటున్నాన‌రు. ఇటీవ‌ల సాంబ‌య్య వ‌ర్దంతికి లావు శ్రీకృష్ణదేవ‌రాయులు హాజ‌ర‌య్యారు. మ‌ర్రికి ఆయ‌న వెన్నుద‌న్నుగా నిలుస్తున్నారు. దీంతో ర‌జ‌నీ దూరంపెట్టిన వ‌ర్గాన్ని చేరువ చేసి.. పార్టీని బ‌లోపేతం చేయాలనే ల‌క్ష్యంతో ఉన్న ఎంపీ ఈ క్రమంలోనే మ‌ర్రికి జ‌రిగిన అన్యాయంపై సీఎం జ‌గ‌న్‌కు ఇటీవ‌ల వివ‌రించిన‌ట్టు తెలిసింది.

జగన్ నుంచి హామీ…..

సీటు త్యాగం చేసినందుకు మీరు ఎమ్మెల్సీ ఇచ్చి.. మంత్రి ప‌ద‌వి ఇస్తామ‌ని హామీ ఇచ్చార‌ని.. ఇప్పటికే లేట్ అయ్యింద‌న్న విష‌యాన్ని జ‌గ‌న్ వ‌ద్ద ‌ప్రస్తావించిన‌ట్టు తెలిసింది. లావు చెప్పిందంతా సానుకూలంగా విన్న జ‌గ‌న్ త్వర‌లోనే ఇద్దామ‌ని, ఆయ‌న‌ను మ‌రిచిపోయే ప్రస‌క్తి లేద‌ని.. చెప్పిన‌ట్టు చిల‌క‌లూరి పేట రాజ‌కీయాల్లో చ‌ర్చ సాగుతోంది. మ‌రో ఏడెనిమిది నెల‌ల్లో మంత్రి వ‌ర్గ విస్తర‌ణ జ‌రుగుతుండ‌డంతో పాటు జ‌గ‌న్ సూచాయ‌గా మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ కి ప‌ద‌వికి ఓకే చెప్పార‌న్న వార్తే ఇప్పుడు పేట పాలిటిక్స్‌లో హాట్ టాపిక్ ? ఇక‌, సీనియ‌ర్ నాయ‌కుడు, టీటీడీ చైర్మన్ వైవీ. సుబ్బారెడ్డి కూడా మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ కి అనుకూలంగా ఉండడం గ‌మ‌నార్హం. ఈ మ‌ధ్య కాలంలో మ‌ర్రి వ‌ర్గంలో ఇంత జోష్ లేదు. మొత్తంగా ఈ ప‌రిణామాలు.. మ‌ర్రికి మంచి రోజులు వ‌స్తున్నాయ‌ని చెబుతున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Tags:    

Similar News