గణపతి లొంగుబాటు నిజమేనా? లీకులేనా?

తెలంగాణ కు చెందిన కీలక మావోయిస్టు నేతలు లొంగిపోయ్యేందుకు సిద్ధంగాఉన్నారా?? ఒకవేళ లొంగిపోవాలంటే వారు పెట్టిన షరతులు ఎంటి?? ప్రభుత్వం , పోలీసులు ఏమనుకుంటున్నారు,..? మూడు దశాబ్దాలుగా [more]

Update: 2020-09-03 09:30 GMT

తెలంగాణ కు చెందిన కీలక మావోయిస్టు నేతలు లొంగిపోయ్యేందుకు సిద్ధంగాఉన్నారా?? ఒకవేళ లొంగిపోవాలంటే వారు పెట్టిన షరతులు ఎంటి?? ప్రభుత్వం , పోలీసులు ఏమనుకుంటున్నారు,..? మూడు దశాబ్దాలుగా మావోయిస్టు పార్టీ కీలక అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి ప్రభుత్వానికి లోంగిపోతారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో నిజం ఎంత? కేవలం లీకులకే పరిమితమా లేదా మరో కోణం ఉందా..?

ఫిలిప్పీన్స్ వెళ్లాడని…..

ముప్పాళ్ళ లక్ష్మణ రావు అలియాస్ గణపతి..దాదాపు 40 ఏళ్లుగా విప్లవ సామ్రాజ్యంలో బతికిన నేత..కరీంనగర్ జిల్లాలో జన్మించిన లక్ష్మణరావు వృత్తి రీత్యా సైన్స్ టీచర్. వరంగల్ లో ఆర్ ఎస్ యు లో చురుగ్గా ఉండే గణపతి . పీపుల్స్ వార్ గ్రూప్ నేత నల్లా ఆది రెడ్డి ,కొండపల్లి సీతారామయ్య ద్వారా విప్లవ ఉద్యమంలోకి వచ్చాడు 1992 లో పీపుల్స్ వార్ నాయకత్వ బాధ్యతలు చేపట్టాడు. మావోయిస్టు పార్టీ ఆవిర్భావంలో కీలక పాత్ర పోషించాడు గణపతి. 2004 లో ఏర్పాటైన మావోయిస్ట్ పార్టీ నుండి మొదలుకుని 2018 దాకా సుదీర్గ కాలంగా కేంద్ర కమిటీ కార్యదర్శిగా పని చేశాడు. 2018 నవంబర్ 10 న ఆరోగ్య సమస్యల దృష్ట్యా కార్యదర్శి పదవి నుండి తప్పుకుని కేవలం పార్టీ కార్యకలాపాలకు పరిమితం అయ్యాడు..74 ఏళ్ల గణపతి తన 40 ఏళ్ల జీవితాన్ని విప్లవ ఉద్యమంలో గడిపాడు.. అనారోగ్యం కారణంగా తన తరువాత నంబాల కేశవ రావు పేరును కమిటీ కి సిఫార్సు చేశాడు. అప్పటి నుండి కేవలం పార్టీ కార్యక్రమాల్లో మాత్రమే పాల్గొంటున్నాడు.అయితే దండ కారుణ్యం లో దశాబ్దాల పాటు గడిపిన గణపతి ఆరోగ్య సమస్యల కారణంగానో మారే ఇతర కారణాల గానో బీహార్ మీదుగా నేపాల్ ద్వారా ఫిలిపిన్స్ కు వెళ్ళాడని ఇంటలిజెన్స్ వర్గాల సమాచారం.

మూడు కోట్ల వరకూ రివార్డులు…..

గణపతి తల పై పలు రాష్ట్ర పోలీసులు రివార్డ్ లు సైతం ప్రకటించారు …పోలీసులే కాకుండా ఎన్ఐఎ వాంటెడ్ లిస్ట్ లో గణపతి ఉన్నాడు. వివిధ రాష్ట్రాల్లో గణపతి తల పై 3 కోట్ల వరకు రివార్డ్ ఉంది. చివరి గా 2017 లో బీహార్ లో సంచరించనట్టు పోలీసుల అనుమానం. జీవితంలో అధిక శాతం దండకారణ్యంలో నే గడిపిన గణపతికి పలు అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు గణపతి ఆరోగ్యం మరింత క్షీణించిన నేపధ్యంలోనే ఆయన ప్రభుత్వానికి లొంగిపోవాలని అనుకున్నట్టు సమాచారం. ఇదే విషయాన్ని తన అనుచరులు, బంధువుల దగ్గర చర్చించినట్టు చెబుతుననారు.

ఎవరు లొంగిపోతామన్నా….

గణపతి లోంగిపోతారంటూ వస్తున్న వార్తల పై పోలీసు శాఖ స్పందించింది. జన జీవన స్రవంతి లోకి ఎవరు వచ్చినా స్వాగతిస్తా మంటూ పోలీస్ శాఖ ప్రకటించింది. గతంలో లొంగిపోయిన మావోలు జంపన్న, సుధాకర్ లాంటి వారికి ఏ విధంగా సహకరించామో అలానే గణపతి కి కూడా అలానే సహకరిస్తామని పోలీస్ లు అంటున్నారు. ఇప్పటి వరకు 1137 మంది నక్సల్స్ లొంగిపోయారనీ పోలీసులు తెలుపుతున్నారు. గణపతి తో పాటు మల్లోజుల వేణుగోపాల్ కూడా లొంగిపోయే అవకాశం ఉన్నట్టు సమాచరం ఉందని తెలంగాణ పోలీసులు ప్రకటించారు.

గతంలో మీడియాతో…..

అయితే గతంలో పలు అంతర్జాతీయ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో గణపతి చేసిన కొన్ని వాఖ్యాలు ఇప్పటి పరిస్థితి కి అద్దం పడుతున్నాయి.2009 లో ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు గణపతి ఇచ్చిన జవాబు ..మావోయిస్టు పార్టీ లో 60 సంవత్సరాల పై బడిన వారు ఆరోగ్య సమస్యలతో లొంగిపోతునారు దీని పై మీ అభిప్రాయం అని గణపతి అడిగాడు జర్నలిస్ట్ రాహుల్ పండిత..దీనికి బదులుగా 60 సంవత్సరాలు ఉన్నా సరే రోజుకు 16 నుండి 17 గంటల పాటు పని చేయగల సామర్ధ్యం ఉన్న సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. లొంగుబాటు కు వయసు సంబంధం కాదు అని గణపతి అన్నారు..ఇప్పుడు పలు ఆరోగ్య సమస్యల కారణంగా లొంగుబాటు దిశగా గణపతి అడుగులు వేస్తున్నట్టు వార్తలు రావడం తో ఆసక్తి చోటు చేసుకుంది..

లొంగిపోవాలనుకుంటే…..

ఒకవేళ గణపతి లొంగిపోవాలి అనుకుంటే ఎక్కడ లోంగిపోతాడు అనే అంశం కూడా చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ లో లొంగిపోవడం కంటే కేంద్రం వద్ద లొంగిపోయ్యేందుకు ఆస్కారం ఉన్నటు సమాచారం. కేంద్రం లో ఉన్న పెద్దలలో లొంగుబాటు దిశగా చర్చలు జరిగినట్టు సమాచారం. చాలా రాష్ట్రాల్లో గణపతి పై కేసులు ఉండటం సుమారు 15 కు పైగా రాష్ట్రాల్లో ఇతని పై రివార్డ్ ఉన్న నేపధ్యంలో కేంద్రం వద్దే లోంగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లొంగుబాటు కు కొన్ని షరతులు కోరే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆరోగ్యం పట్ల చికిత్స కు సహకరింపు తో పాటు మావోయిస్ట్ రహస్య సమాచారం అడగి ఇబ్బంది గురి చేయవద్దు అనే ఫార్మ ల్ డిమాండ్స్ కోరే అవకాశముంది.

Tags:    

Similar News