ఈ గవర్నర్ మాత్రం చికాకు పెట్టేస్తున్నాడు

పశ్చిమ బెంగాల్ లో మమతకు కంటి మీద కునుకు లేదు. ఒకవైపు బీజేపీ, కాంగ్రెస్ లు మమత బెనర్జీపై విరుచుకుపడుతున్నాయి. కరోనా కట్టడి లో మమత బెనర్జీ [more]

Update: 2020-05-10 18:29 GMT

పశ్చిమ బెంగాల్ లో మమతకు కంటి మీద కునుకు లేదు. ఒకవైపు బీజేపీ, కాంగ్రెస్ లు మమత బెనర్జీపై విరుచుకుపడుతున్నాయి. కరోనా కట్టడి లో మమత బెనర్జీ విఫలమవుతున్నారని, రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని బీజేపీ విరుచుకుపడుతుంది. బీజేపీ సోషల్ మీడియా వింగ్ అయితే మమత బెనర్జీని మామూలుగా ఆడుకోవడం లేదు. దీంతో మమత బెనర్జీ ఒకింత ఆందోళనకు గురయ్యారు.దీనికి ప్రతిగా ప్రశాంత్ కిషోర్ టీంను మమత బెనర్జీ రంగంలోకి దించేందుకు సిద్ధమయ్యారు.

కరోనా సమయంలోనూ…..

ఇదిలా ఉండగానే పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగ్ దీప్ ధన్ కర్ సయితం మమత బెనర్జీని వదిలి పెట్టడం లేదు. కరోనా సమయంలో రాజ్ భవన్ ప్రభుత్వానికి అండగా ఉండాలి. ప్రభుత్వ సహాయ కార్యక్రమాలకు, తీసుకునే నిర్ణయాలకు గవర్నర్ సహకరించాల్సి ఉంటుంది. ప్రభుత్వానికి క్లిష్టసమయంలో చేయూతనందించడం గవర్నర్ బాధ్యత. కరోనా లాంటి మహ్మమ్మారిని తరిమికొట్టాలటే ప్రభుత్వాన్ని గవర్నర్ వెన్నుతట్టి ప్రోత్సహించాల్సి ఉంటుంది.

బెంగాల్ లో విరుద్ధమైన సీన్….

కానీ పశ్చిమ బెంగాల్ లో మాత్రం దీనికి విరుద్ధమైన సీన్ కనపడుతుంది. గవర్నర్ జగ్ దీప్ థనకర్ మమత బెనర్జీపై రోజు విరుచుకు పడుతున్నారు. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలమయిందంటూ గవర్నర్ చేసిన విమర్శలు రాజకీయంగా దుమారం రేపాయ. ఆయన మమత బెనర్జీనికి రెండు లేఖలు రాశారు. లాక్ డౌన్ నిబంధనలను ఉల్లఘస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం వైఫల్యం కాదా? అని ఆయన ప్రశ్నించారు.

దీదీ ధీటుగా కౌంటర్….

దీనికి దీదీ ధీటుగా సమాధానం చెప్పారు. తమది ప్రజల చేత ఎన్నుకోబడన ప్రభుత్వమని, నామినేట్ కాలేదని మమత బెనర్జీ తీవ్ర స్థాయిలో గవర్నర్ కు కౌంటర్ ఇచ్చారు. పరిధి దాట వద్దని హెచ్చరించారు. ప్రభుత్వ అధికారాల్లో జోక్యం చేసుకుంటే బాగుండదని కూడా వార్నింగ్ ఇచ్చారు. గత కొంతకాలంగా గవర్నర్ , మమత బెనర్జీకి మధ్య పడటం లేదు. కరోనా సమయంలోనైనా కలిసికట్టుగా పనిచేస్తారనుకుంటే ఆ పరిస్థితులు పశ్చిమ బెంగాల్ లో కన్పించడం లేదు. మొత్తం మీద గవర్నర్ మమత బెనర్జీని చికాకు పెడుతున్నట్లే కనపడుతుంది.

Tags:    

Similar News