హ్యాట్రిక్ విజయం గ్యారంటీనా…?

పశ్చిమ బెంగాల్ లో ఎనిమిది విడతలుగా జరిగిన పోలింగ్ హోరాహోరీగా సాగింది. బీజేపీ, టీఎంసీలు పోటా పోటీగా ప్రచారం చేశాయి. మరికొద్ది గంటల్లో ఫలితం తేలనుంది. పదేళ్ల [more]

Update: 2021-05-01 17:30 GMT

పశ్చిమ బెంగాల్ లో ఎనిమిది విడతలుగా జరిగిన పోలింగ్ హోరాహోరీగా సాగింది. బీజేపీ, టీఎంసీలు పోటా పోటీగా ప్రచారం చేశాయి. మరికొద్ది గంటల్లో ఫలితం తేలనుంది. పదేళ్ల తర్వాత మమత బెనర్జీలో అలజడి మొదలయింది. గెలుపోటములపై సందేహాలు నెలకొన్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మాత్రం మమతబెనర్జీ గెలుపు గ్యారంటీ అంటున్నారు. మరోవైపు బీజపీ కూడా తనదే గెలుపు అని చెబుతోంది.

హోరాహోరీ…

294 అసెంబ్లీ నియోజకవర్గాలున్న పశ్చిమ బెంగాల్ లో ఈసారి మమత బెనర్జీ గెలిస్తే హ్యాట్రిక్ విజయం సాధించినట్లే. బెంగాల్ ప్రజలు వరస విజయాలు అందించడం కొత్తేమీ కాదు. అయితే ఈసారి ప్రత్యర్థి బలమైన వాడు కావడంతోనే అనుమానాలు నెలకొన్నాయి. భారతీయ జనతా పార్టీ కొన్నేళ్లుగా పశ్చిమ బెంగాల్ పై దృష్టి పెట్టింది. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నప్పటికీ ఒక్క పశ్చిమ బెంగాల్ పైనే బీజేపీ ఫోకస్ పెట్టింది.

అందరూ అక్కడే…?

ప్రధాని నరేంద్ర మోదీ తో సహా అగ్రనేతలందరూ పశ్చిమ బెంగాల్ లో వరసగా పర్యటనలు చేశారు. మమత బెనర్జీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. దీదీకి మరోసారి అవకాశం ఇస్తే బెంగాల్ బాగుపడదని పరోక్ష హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో 200 స్థానాలకు పైగానే సాధిస్తామన్న నమ్మకంతో బీజేపీ నేతలున్నారు. అయితే అదే సమయంలో మమత బెనర్జీ పట్ల సానుభూతి కూడా వచ్చిందంటున్నారు.

మరోసారి అవకాశం కోసం….

మమత బెనర్జీ ఎన్నికల సమయంలో గాయపడ్డారు. వీల్ ఛెయిర్ లోనే ప్రచారం నిర్వహించారు. మమత బెనర్జీ సభలకు జనం భారీగానే హాజరయ్యారు. ఆమె చేసిన సూటి విమర్శలు ప్రజల్లోకి బలంగానే వెళ్లాయి. కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉండి గవర్నర్ ద్వారా తనను ఎంత ఇబ్బందిపెట్టిందీ తన ఎన్నికల ప్రచారంలో మమత బెనర్జీ హైలెట్ చేశారు. మొత్తం మీద మరికొన్ని గంటల్లో మమత బెనర్జీ హ్యాట్రిక్ సాధిస్తారా? లేదా? అన్నది తేలననుంది

Tags:    

Similar News