మమత టార్గెట్ అదే…అందుకే ఈ సమయంలోనూ?

పశ్చిమ బెంగాల్ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఎన్నికల్లో పైచేయి సాధించాలని ఇటు అధికార తృణమూల్ కాంగ్రెస్, అటు భారతీయ జనతా పార్టీ ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. కరోనా [more]

Update: 2020-04-06 17:30 GMT

పశ్చిమ బెంగాల్ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఎన్నికల్లో పైచేయి సాధించాలని ఇటు అధికార తృణమూల్ కాంగ్రెస్, అటు భారతీయ జనతా పార్టీ ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. కరోనా సమయంలోనూ రాజకీయాలు వీడటం లేదు. పశ్చిమ బెంగాల్ లో లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధిచండంతో ఎప్పటి నుంచో పశ్చిమ బెంగాల్ పై కన్నేసింది. కుదిరినప్పుడల్లా అక్కడకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెళ్లివస్తున్నారు. హీట్ తగ్గకుండా బీజేపీ శ్రేణులను ఉత్తేజపరుస్తున్నారు. ఇక మమత బెనర్జీ సయితం ఏమాత్రం తగ్గడం లేదు. కుదిరినప్పుడల్లా నాలుగు చీవాట్లు పెట్టడం మమతకు అలవాటయిపోయింది.

ప్రధానికి లేఖ రాసి…..

అయితే కరోనా ఎఫెక్ట్ ప్రపంచమంతా పడింది. భారత్ లో సయితం దాని ప్రభావం ఎక్కువగా కన్పిస్తుంది. దేశమంతా లాక్ డౌన్ లో ఉంది. పశ్చిమ బెంగాల్ కు ఇరవై ఐదు వేల కోట్ల సాయాన్ని చేయాలని మమత బెనర్జీ ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవాలని ఆమె కోరారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వదని తెలిసినా మమత లేఖ రాయడం వెనక రాష్ట్ర ప్రయోజనం కంటే రాజకీయమే ఎక్కువ ఉందన్నది వాస్తవం.

పొలిటికల్ డిస్టెన్స్ తో….

ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని అందరూ ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించారు. రాష్ట్రాల్లో పరిస్థితులను, ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. కానీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ మాత్రం ఈ వీడియోకాన్ఫరెన్స్ కు హాజరు కాలేదు. కరోనా సయమంలోనూ మమత బెనర్జీ పొలిటికల్ డిస్టెన్స్ ను పాటిస్తున్నారని చెప్పకనే తెలుస్తోంది. దీంతో పాటు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరగకుండా చర్యలు తీసుకుంటున్నందునే హాజరు కాలేకపోయానని పార్టీ వర్గాలు తెలిపాయి.

బీజేపీ నేతలపై మండిపాటు….

మరోవైపు లాక్ డౌన్ జరుగుతుండటంతో బీజేపీ నేతలు కూడా పశ్చిమ బెంగాల్ లో రంగంలోకి దిగారు. ఇంటింటికి నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని బీజేపీ నేతలు ప్రయత్నించారు. అయితే ప్రభుత్వం వీరిని అడ్డుకుంది. లాక్ డౌన్ నిబంధనలను ఎవరు ఉల్లంఘించినా చర్యలు తప్పవని మమత బెనర్జీ హెచ్చరించారు. నిత్యావసరాల పంపిణీ పేరుతో ప్రజలకు ప్రమాదం తెచ్చి పెడతామంటే ఒప్పుకునేది లేదన్నారు మమత. ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందని మమత చెబుతున్నారు. బీజేపీ నేతలు మాత్రం మమత వైఖరి పై మండిపడుతున్నారు.

Tags:    

Similar News