నవీన్ తరహాలోనేనట ….మమత ధీమా అదే?

పశ్చిమ బెంగాల్ లో ఎన్నికలు నువ్వా? నేనా? అన్నట్లు సాగుతున్నాయి. మమత బెనర్జీ వీల్ ఛైర్ లోనే ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. ఇక మోదీ, అమిత్ [more]

Update: 2021-04-04 18:29 GMT

పశ్చిమ బెంగాల్ లో ఎన్నికలు నువ్వా? నేనా? అన్నట్లు సాగుతున్నాయి. మమత బెనర్జీ వీల్ ఛైర్ లోనే ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. ఇక మోదీ, అమిత్ షాలు తమ మాటల గారడీతో తమ వైపునకు ఓటర్లను తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే దీదీ మాత్రం ఒడిశా ఫలితం రిపీట్ అవుతుందని గట్టి ధీమా గా ఉన్నారు. ఒడిశాలోనూ నవీన్ పట్నాయక్ ను అధికారంలోకి రానివ్వకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినా అది ఫలించలేదు.

ఎన్ని ట్రిక్కులు ప్లే చేసినా…..?

కారణం నవీన్ పట్నాయక్ పట్ల ఒడిశా ప్రజలకు ఉన్న నమ్మకమే. ఒడిశాలోనూ పశ్చిమ బెంగాల్ లో ద్వితీయ స్థానంలోకి వచ్చింది. గత పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ ను వెనక్క నెట్టేసి ప్రతిపక్షంగా ఏర్పడింది. బెంగాల్ లోనూ అదే జరుగుతుందన్న అంచనాలు ఉన్నాయి. బీజేపీ ఎన్ని ట్రిక్కులు ప్లే చేసినా మమత బెనర్జీదే విజయమన్న ధీమా తృణమూల్ కాంగ్రెస్ నేతల్లో కన్పిస్తుంది. ఇందుకు మమత బెనర్జీ సభలకు ప్రజల నుంచి కన్పిస్తున్న ఆదరణే కారణమంటున్నారు.

సర్వేలు కూడా…..

నిజానికి అన్ని ఎన్నికల్లో మాదిరిగా పశ్చిమ బెంగాల్ లో సర్వేలు కూడా బీజేపీకి అనుకూలంగా లేవు. బీహార్ ఎన్నికల సమయంలో సర్వేలే బీజేపీకి అండగా నిలిచాయి. అయితే ఈసారి పశ్చిమ బెంగాల్ లో మాత్రం సర్వేలన్నీ దాదాపు మమత బెనర్జీ వైపే ఉన్నాయి. ఏవో కొన్ని సంస్థలు తప్పించి ఎక్కువ సర్వేలు మమత బెనర్జీ గెలుపు ఖాయమని తేల్చాయి. దీంతో మమత బెనర్జీ శిబిరంలో ఉత్సాహం అలుముకుంది.

విపక్షంలోనేనా?

మరోవైపు ఒడిశాల మాదిరిగానే ఇక్కడ బీజేపీ ప్రతిపక్ష స్థానాన్ని దక్కించే అవకాశాలు ఉన్నాయని పశ్చిమ బెంగాల్ లో పర్యటించి వచ్చిన విశ్లేషకులు చెబుతున్నారు. బీజేపీని అక్కడ అధిక శాతం మంది ప్రజలు బయట పార్టీగా చూస్తున్నారన్న వాదనలు కూడా ఉన్నాయి. బీజేపీపై ఈ ప్రచారం చేయడంలో మమత బెనర్జీ సక్సెస్ అయ్యారు. టీఎంసీ నేతలను ఎక్కువ మందిని చేర్చుకోవడం కూడా మమత బెనర్జీకి ప్లస్ గా మారనుందంటున్నారు. పశ్చిమ బెంగాల్ లోనూ ఒడిశా ఫలితం రిపీట్ అవుతుందని, మమత బెనర్జీ హ్యాట్రిక్ విజయం ఖాయమని చెబుతున్నారు.

Tags:    

Similar News