పట్టుదలకు ప్రతీక మమత

మమతా బెనర్జీ పరిచయం అక్కరలేని పేరు. పేరుకు ఆమె ఒక ప్రాంతీయ పార్టీ అధినేత్రి. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అయినప్పటికి జాతీయ రాజకీయాల్లో మమతా బెనర్జీ పేరు [more]

Update: 2021-04-03 16:30 GMT

మమతా బెనర్జీ పరిచయం అక్కరలేని పేరు. పేరుకు ఆమె ఒక ప్రాంతీయ పార్టీ అధినేత్రి. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అయినప్పటికి జాతీయ రాజకీయాల్లో మమతా బెనర్జీ పేరు అందరికీ సుపరిచితం. ప్రస్తుతం ప్రధాని నరేంద్రమెాదీని విమర్శించే ధైర్యంగల ప్రాంతీయపార్టీ నాయకురాలు. దేశంలో ఏప్రాంతీయ పార్టీ అధినేత కూడా మెాదీని విమర్శించే సాహసం చేయడం లేదు. ఇందుకు కారణాలు అనేకం. అయితే మమతా బెనర్జీ మాత్రం కాషాయ పార్టీని, ఆ పార్టీ అధినేత, ఇతర నాయకులను దునుమాడగల ఎకైక నాయకురాలు. ఇప్పుడు జరుగుతున్న బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకమైనవి. రేపటి ఎన్నికల్లో దీదీ విజయం సాధిస్తే హ్యాట్రిక్ సాధించిన నేతగా మమతా బెనర్జీ చరిత్ర సృష్టిస్తారు. మెాదీని నిలువరించిన నేతగా గుర్తింపు పొందుతారు. తద్యారా 2024 నాటికి ప్రాతీయ పార్టీల ప్రధాని అభ్యర్ధిగా తెరపైకి వచ్చనా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు.

మొదటి నుంచి దూకుడుగానే….

మమతా బెనర్జీ రాజకీయ ప్రస్ధానంలో మెుదటినుంచీ దుాకుడుగానే వ్యవహరించారు. అందుకే ఆమెకు ఫైర్ బ్రాండ్ నాయకురాలిగా పేరుంది. షరాయి చెప్పులు, నేతచీర వస్త్రధారణతో సాధారణంగా కనిపించే మమతా బెనర్జీ ప్రత్యర్ధులపై ధీటైన విమర్శలు సంధించేవారు. ముఖ్యంగా కమ్యునిస్టులను ఎదుర్కొవడంలో ఎప్పుడుా ముందుండేవారు. ఏడుపదులకు చేరువవుతున్న ఆమెలో పోరాటపటిమ ఎంత మాత్రం తగ్గలేదు. ముాడుపదుల వయసులోనే సీపీఎం దిగ్గజం సోమనాధ్ ఛటర్జీని బాదల్ పూర్ లోక్ సభ స్దానం నుంచి 1984 లో ఓడించి చరిత్ర సృష్టించారు. అప్పట్లో యువ ఎంపీల్లో ఒకరిగా మమతా బెనర్జీ గుర్తింపు పొందారు. 1989లో ఓడిపోయిన తరువాత దక్షిణ కోల్ కత్తా స్ధానం నుంచి అయిదుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న భవానీపుార్ అసెంబ్లీ సీటు దక్షిణ కోల్ కత్త పార్లమెంట్ స్ధానంలో పరిధిలోనే ఉంది.

కమ్యునిస్టులను నిలువరించడంలో…..

సీపీఎం ను ఎదుర్కోవడంలో కాంగ్రెస్ కు చిత్తశుద్ధి లేదన్నది మమతా బెనర్జీ భావన. ముఖ్యంగా పార్టీ జాతీయ నాయకత్వం సీపీఎం ముఖ్యమంత్రులు జ్యోతిబసు, బుద్ధదేవ్ భట్టాచార్య లను ఢీకొనడంలో ఉపేక్షించిందన్నది ఆమె ఆరోపణ. అందువల్లే బెంగాల్ పీసీసీ సీపీఎం కు బీ టీం గా మారిందని అధిష్టానాన్ని ఘాటుగా విమర్శించేవారు. కాంగ్రెస్ లో సీపీఎంను ఓడించనేమన్న ఉద్ధేశంతో 1998 జనవరి 1 న తృణముల్ కాంగ్రెస్ (TMC) పేరుతో సొంత కుంపటి ప్రారంభించారు. తనకున్న కొద్దిపాటి లోక్ సభ సభ్యులతో పరిస్ధితులను బట్టి కేంద్రంలో NDA, (1999) UPA (2009-2011) ప్రభుత్వాల్లో కేంద్రమంత్రిగా పనిచేశారు. రైల్వే మంత్రిగా బెంగాల్ కు ఎనలేని మేలుచేశారు. అప్పట్లో రైల్వే బడ్జెట్లో బెంగాల్ కే అత్యధిక కేటాయింపులు చేశారు. దీనిపై దాదాపు అన్నిపత్రికలు తుార్పు వెళ్ళేరైలు శీర్షికతో పతాక కధనాలు ప్రచురించాయి. అయినా విమర్శలను మమతా బెనర్జీ పట్టించుకునే వారుకాదు మమత.

గద్దె దించడానికి…..

సీపీఎం ను గద్దెదించడంలో, ఎదుర్కోవడంలో భాగంగా మమతా బెనర్జీ సందర్భాన్ని బట్టి NDA, UPA ల్లో పనిచేశారు. తనకు వామపక్ష ప్రభుత్వాన్ని గద్దెదించడమే ముఖ్యమని ఈ క్రమంలో ఎవరితో అయినా చేతులు కలిపేందుకు సిద్ధమని ప్రకటించేవారు. సీపీఎం సర్కారు సింగుారు భుాముల కేటాయింపుపై మమతా బెనర్జీ పెద్ద ఉద్యమాన్నే నడిపారు. ఈ సందర్బంగా నాటి నందిగ్రామ్ కాల్పుల ఘటనలో 14 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన రాష్ట్రాన్నే గాక యావత్ దేశాన్ని కుదిపేసింది. అప్పట్లో నందిగ్రామ్ ఉధ్యమంలో సువెందు అధికారి మమతకు మద్దతుగా నిలిచారు. టీఎంసీ వ్యవస్ధాపకుల్లో ఆయన ఒకరు. నిన్నమెున్నటిదాకా ఆమెకు కుడిభుజంగా పనిచేశారు. మమత సర్కారులో రవాణా, జల వనరులు వంటి కీలక శాఖలకు సారధ్యం వహించారు. ప్రస్తుతం ఆయన భాజపా అభ్యర్ధిగా నందిగ్రమ్ లో మమతతో ఢీ కొంటున్నారు.

నందిగ్రామ్ దేశవ్యాప్తంగా….

దీంతో నందిగ్రామ్ నియెాజకవర్గం దేశ వ్యాప్తంగా ప్రజలను ఆకట్టుకుంటోంది. ఇక్కడ గెలుపు ఇద్దరు నేతలకు ప్రష్టాతంకంగా మారింది. సుదీర్ఘ రాజకీయ ప్రస్ధానంలో మమతా బెనర్జీపై పెద్దగా అవినీతి ఆరోపణలు లేవు. కానీ శారదా కుంభకోణంలో కేసులు టీఎంసీ నేతల పాత్ర పై సీబీఐ కేసు నమెాదు చేసింది. ఈ కేసులో పార్టీ నాయకుల ప్రమేయం ఉన్నట్లు సీబీఐ గుర్తించింది. కేసుకు సంబధించి 2019 నాటి కోల్ కత్తా పోలీసు కమీషనరు రాజీవ్ కుమార్ ను విచారించేందుకు సీబీఐ ప్రయత్నించడంతో మమతా బెనర్జీ అడ్డుకున్నారు. కుంభకోణంలో ప్రభుత్వం, పార్టీ ప్రమేయం లేకపోతే విచారణను మమత ఎందుకు అడ్డుకున్నరన్న విమర్శలు అప్పట్లో వినిపించాయి. చివరకు సుప్రీంకోర్టు జోక్యంతో సీబీఐ విచారణ జరిపింది. పార్టీలో మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యంపై మమతా బెనర్జీ విమర్శలు ఎదుర్కొంటున్నారు. డమ్ డమ్ ఎంపీ అయిన అభిషేక్ కారణంగానే తాము పార్టీని వీడి కాషాయ పార్టీలో చేరుతున్నట్లు పలువురు నాయకులు ప్రకటించారు. మెుత్తానికి ఈ అసెంబ్లీ ఎన్నికలు మమతకు అగ్ని పరీక్షవంటింది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News